గ్రామీణ ప్రాంతంలో పాడి రైతులను ఆదుకునేందుకు జగనన్న పాల విలువ కార్యక్రమాన్ని సీఎం జగన్ ఏర్పాటు చేయడం జరిగిందని లింగపాలెం మండలం ఎడవల్లి గ్రామ సర్పంచ్ కట్టుబోయిన రమేష్ అన్నారు. ఈ సందర్భంగా గురువారం నాడు స్థానిక రైతు భరోసా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన పాల కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాడి రైతులు గ్రామస్తులు పాల్గొన్నారు.
చింతలపూడి టీ నర్సాపురం విద్యుత్ దారుల సహకరించాలి: ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్
పశ్చిమగోదావరి ఏలూరు జిల్లా లో 16.12.2022 శుక్రవారం ఉదయం 8.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు 33 KV చింతలపూడి – టి.నరసాపురం ఫీడరు ట్రీ కటింగ్ మరియు మరమ్మతులు నిమిత్తం సప్లై నిలుపుదల చేయబడుతుందని ఆ సమయంలో మరమ్మతులు మరియు ట్రీ కటింగ్ చేయబడుతుందని ఆయా సబ్ స్టేషన్ మరియు ఫీడర్ల పరిధిలోని విద్యుత్ వినియోగదారులు గమనించి సహకరించవలసినదిగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కోరారు.
–జంగారెడ్డిగూడెం నుండి గరువు బాబురావు