PK for uttarandhraPK for uttarandhra

ఉత్తరాంధ్ర (Uttarandhra) జనసేన (Janasena) సంస్థాగత నిర్మాణానికి త్రిసభ్య కమిటీ (Three member committee) వేస్తున్నట్లు పార్టీ అధిష్ఠానము (Party High command) ప్రకటించింది. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలలో జనసేనను బలోపేతం చేయడానికి పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చర్యలు చేపట్టారు. ముందుగా పార్టీలో జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు కమిటీల నిర్మాణం పూర్తి చేసి ఆ తరువాత విస్తృతంగా పర్యటించాలని జనసేనాని నిర్ణయించారు.

ఇందులో భాగంగా పార్టీలోని ముగ్గురు సీనియర్ నాయకులతో ఒక త్రిసభ్య కమిటీని నియమించారు. ఈ కమిటీలో పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు  అర్హన్ ఖాన్ (Arham Khan), పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు  పంతం నానాజీ (Pantham Nanaji), ముత్తా శశిధర్ (Mutha Shasidhar) సభ్యులుగా ఉంటారు. తొలుత జిల్లా కమిటీలు, ఆ తరువాత మండల, గ్రామ కమిటీల నిర్మాణం పూర్తయ్యేవిధంగా ఈ త్రిసభ్య కమిటీ చర్యలు చేపడుతుంది. పార్టీ అధ్యక్షుల సూచనల మేరకు ఈ త్రిసభ్య కమిటీ సంస్థాగత నిర్మాణాన్ని తొందరలో పూర్తి చేస్తుంది అని ఒక ప్రకనలో జనసేన పార్టీ (Janasena Party) తెలిపింది.

ఆంధ్రాకి న్యాయం జరగాలంటే జాతీయ పార్టీలనే ఎన్నుకోండి: పళ్లంరాజు

Spread the love