Janasenani vizag rallyJanasenani vizag rally

తీవ్ర ఉత్కంఠల మధ్య కొనసాగిన జనసేన పార్టీ (Janasena Party) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) విశాఖ ర్యాలీ (Visakha Rally) అనూహ్య రీతిలో విజయ వంతం అయ్యింది. ఉత్తరాంధ్ర (Uttarandhra) ప్రజల సమస్యలు పరిస్కారం కోసం ఆదివారం జనవాణి – జనసేన భరోసా (Janasena Janavani) కార్యక్రమంలో పాల్గొనడానికి పవన్ కళ్యాణ్ విశాఖ విచ్చేసారు. ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ నాయకుల సమావేశాల నిమిత్తం శనివారం సాయంత్రం విశాఖపట్నంకు చేరుకున్న పవన్ కళ్యాణ్’కి పార్టీ శ్రేణులు అడుగడుగునా నీరాజనాలు పలికారు. విమానాశ్రయానికి వేలాదిగా తరలి వచ్చిన జనసైనికులు, వీర మహిళలు, పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు.

పవన్ కళ్యాణ్ రాక నేపధ్యంలో మధ్నాహ్నం నుంచి విమానాశ్రయంలో (Visakha Airport) సందడి వాతావరణం నెలకొంది. ఉత్తరాంధ్ర సంప్రదాయ కళలు అయిన తప్పెటగుళ్లు, గిరిజన నృత్యం ధింసా, కోలాటాలు, విచిత్ర వేషగాళ్లు, డప్పుల కళాకారులు పవన్ కళ్యాణ్’కి తమదైన శైలిలో ఆహ్వానం పలికారు. అనంతరం వేలాది మంది భారీ ర్యాలీగా కదలిరాగా బస చేయనున్న నోవాటెల్ హోటల్ కి బయలుదేరారు. విమానాశ్రయంలో పోలీసులు తగు భద్రత ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టక పోవడంతో ప్రాంగణం నుంచి బయటకు రావడానికి సుమారు 40 నిమిషాల సమయం పట్టింది. ఆ సమయంలో తన కోసం వచ్చిన ప్రతి ఒక్కరికీ అభివాదం చేస్తూ, ఆహ్వానం పలికిన కళాకారులకు స్వయంగా కరచాలనం చేస్తూ అందరినీ ఉత్సాహ పరిచారు.

అభిమానుల ల్ఫీల హోరు

విమానాశ్రయంలో ఓ అభిమాని తన మొబైల్ పవన్ కళ్యాణ్’కి అందచేసి తనతో పాటు సాటి జనసైనికులతో సెల్ఫీ దిగాలని కోరారు. అతని కోరిక మేరకు పవన్ కళ్యాణ్ కూడా అతని మొబైల్ లో స్వయంగా సెల్ఫీ దిగారు. ఆ తర్వాత చాలా మంది సెల్ఫీ కోసం తమ మొబైల్స్ పవన్ కళ్యాణ్’కి ఇచ్చేందుకు ఎగబడ్డారు. ఏ ఒక్కరినీ నిరుత్సాహ పరచకుండా జనసేనాని అందరి మొబైల్స్ తీసుకుని సెల్ఫీలు దిగారు. ఇక విమానాశ్రయం బయట జనసేన శ్రేణులు పెద్ద ఎత్తున పూల వర్షంతో స్వాగతం పలికారు. కిక్కిరిసిన జనసమూహాన్ని దాటుకుంటూ పవన్ కళ్యాణ్ ప్రధాన రహదారి మీదకు చేరుకునే సమయానికి వెలుతురు మందగించింది. అయితే అప్పటికే బయట మరో జనప్రవాహం ఆయనకు స్వాగతం పలికింది. పోలీసులు వారిని రహదారికి ఒక వైపు మళ్లించడం గాని, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు గాని చేపట్టకపోవడంతో ఒక్కో అడుగు కదలడం చాలా కష్టం అయ్యింది.

ఎన్ఏడీ, కంచరపాలెం, తాటిచెట్లపాలెం, తెలుగు తల్లి ఫ్లై ఓవర్.. ఇలా ప్రతి కూడలిలో వేల సంఖ్యలో ప్రజలు, జనసైనికులు (Janasainiks), మహిళలు (Veera Mahila) పవన్ కళ్యాణ్’తో కలసి అడుగులు వేసేందుకు సిద్ధంగా ఉన్నారు. దీనితో ఒక దశలో వాహన శ్రేణి ముందుకు కదలడం కష్టంగా మారింది. ఎన్ఏడీ ఫ్లై ఓవర్ నుంచి వెనక్కి చూస్తే పవన్ కళ్యాణ్ వాహనం నుంచి ఎయిర్ పోర్టు వరకు రహదారి మొత్తం జనసేనాని కోసం వచ్చిన జనప్రవాహంతో నిండి పోయింది. రహదారికి ఇరువైపులా మహిళలు హారతులు పట్టేందుకు పోటీ పడ్డారు. విద్యార్ధులతో పాటు అన్ని వర్గాల ప్రజలు పవన్ కళ్యాణ్’కి స్వాగతం పలికేందుకు రోడ్ల మీదకు వచ్చారు. ర్యాలీ ఆలస్యం అయినా ఏ ఒక్కరినీ నిరాశ పర్చుకుండా ఓపికగా వాహనపై నిలబడి ప్రతి ఒక్కరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగారు. విమానాశ్రయం నుంచి తెలుగుతల్లి ఫ్లై ఓవర్ వరకు ర్యాలీ చేరుకోవడానికి నాలుగు గంటల సమయం పట్టింది.

వీధి లైట్లు బంద్ దేనికోసం?

పవన్ కళ్యాణ్ పర్యటనకు, భారీ ర్యాలీకి వేలాది మంది తరలివచ్చిన నేపధ్యంలో ప్రభుత్వం తన అక్కసు పవర్ కట్ రూపంలో వెళ్లగక్కింది అని అంటున్నారు. విమానాశ్రయం నుంచి బయటకు వచ్చే సమయానికే వెలుతురు మందగించింది. మీడియా కవరేజ్ (Media Coverage) రాకుండా విశాఖలో విద్యుత్ కోతతో పాటు నిత్యం దేదీప్యమానంగా వెలిగే వీధి దీపాలను సైతం వెలగకుండా జాగ్రత్తలు తీసుకుంది అనే ఆరోపణల మధ్య ర్యాలీ కొనసాగింది.

ఎన్ఏడీ దాటిన తర్వాత నుంచి పోలీసుల ఓవరాక్షన్

కొంత సమయం చీకట్లోనే పవన్ కళ్యాణ్ ర్యాలీ సాగింది. ఆ తర్వాత మీడియా వాహనంలో జనరేటర్ సాయంతో ఎల్ఈడీ లైట్ల వెలుతురు ర్యాలీకి ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి ప్రభుత్వం పోలీస్ పవర్ ఉపయోగించడం మొదలు పెట్టింది. లైటింగ్ తో ఉన్న మీడియా వాహనాన్ని పవన్ కళ్యాణ్ వాహనం నుంచి దూరంగా తీసుకువెళ్లడం.. ఉద్దేశపూర్వకంగా ఓ సీఐ స్థాయి అధికారి మీడియా వాహనంలో డ్రైవర్ దగ్గర కూర్చుని పవన్ కళ్యాణ్ ప్రజలకు కనబడకుండా జాగ్రత్త పడడం వంటి చర్యలు తీసుకున్నారు. పోలీసుల తీరు పట్ల జనసేన నేతలు ఒక దశలో నిరసన వ్యక్తం చేశారు అని జనసేన ఆరోపిస్తున్నది.

పోలీసులు (AP Police), పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్’ని ప్రజలకు అభివాదం చేయకుండా ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. జనప్రవాహం ఎక్కువగా ఉన్న నేపధ్యంలో ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉండడంతో పదే పదే వాహనం నుంచి బయటకు రావడానికి వీల్లేదంటూ పవన్ కళ్యాణ్ మీద ఒత్తిడి తీసుకురావడం మొదలు పెట్టారు. అప్పటికీ కాన్వాయ్ సజావుగానే సాగుతూ ఉంది. డీసీపీ., తెలుగుతల్లి ఫ్లై ఓవర్ దగ్గరకు వచ్చిన తర్వాత బయటకు కనబడడానికి వీల్లేదంటూ పవన్ కళ్యాణ్ వాహనం మీద ఎక్కి మరీ ఒత్తిడి వత్తిడి చేసినట్లు జనసేన చెబుతున్నది.

నేరుగా నోవాటెల్ తీసుకు వెళ్లిపోయారు…

అక్కడి నుంచి ర్యాలీ మొత్తాన్ని తప్పించి పవన్ కళ్యాణ్ వాహనాన్ని నేరుగా నోవాటెల్ (Novatel Hotel) తీసుకు వెళ్లిపోయారు. పోలీసుల తీరు పట్ల విశాఖ ప్రజలు, జనసేన శ్రేణులు తీవ్ర అసహనం వ్యక్తం చేశాయి. పవన్ కళ్యాణ్ రాకకోసం గంటల తరబడి వేచి చూస్తుంటే పోలీసులు అలా తీసుకువెళ్లిపోవడాన్ని జనసేన పార్టీ, జనసేన కార్యకర్తలు తప్పుబడుతున్నారు. నోవాటెల్ హోటల్ వద్ద పెద్ద ఎత్తున గుమిగూడి నిరసన తెలిపే ప్రయత్నం చేసిన జనసైనికుల మీద లాఠీలు కూడా ఝుళిపించారు అని జనసేన పార్టీ తెలియజేస్తున్నది. దీనికి పోలీసుల ఎలా స్పందిస్తారో చూడాలి.

నూకలమ్మ అమ్మవారి ఆలయానికి 1,01,116/లు విరాళం