Babu Pawan and JaganBabu Pawan and Jagan

బాబుకి దత్తపుత్రుడు (Adopted Son) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అంటూ జనసేనాని (Janasenani) ప్రత్యర్ధులు చేస్తున్న విమర్శలు ఇటీవల బాగా పెరుగుపోతున్నాయి. జనసేనానిపై అర్ధం పర్థంలేని ఆరోపణలను పాలక పార్టీలు చేస్తున్నాయి అని ప్రజలు విశ్వశిస్తున్నారు?

వారసతాన్ని కొనసాగిస్తున్నవాడు దత్తపుత్రుడు అవుతాడు గాని పవన్ కళ్యాణ్ ఎందుకు దత్తపుత్రుడు అవుతాడు అంటే ఒక్కరూ దీనికి సరి అయిన సమాధానం చెప్పరు. ఇంతకీ బాబుకి (Chandra Babu) దత్తపుత్రుడు జగనా లేక పవనా అనేది వివరంగా ఒక్కసారి పరిశీలిద్దాము.

  • చంద్రబాబు అనివీతిపై (Chandra Babu Corruption) పుస్తకాలు ప్రచురించిన జగన్ (Jagan) ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసికోలేకపోయారు? అంటే జగన్ బాబుకి దత్తపుత్రుడు అయినందువల్లనే చర్యలు తీసికోలేదా? లేక మరేదైనానా?
  • బాబు జన్మభూమి కమిటీలు (Janmabhumi Committees) వేస్తే జగన్ వాలంటీరులు (Volunteers) పేరుతో అదే విధానాన్ని కొనసాగిస్తున్నారు. అంటే జగన్ బాబుకి దత్తపుత్రుడు అయినందువల్లనే బాబు విధానాలు కొనసాగిస్తున్నారా లేక మరేదైనానా?
  • చంద్రబాబు హయాంలో ఇసుక మట్టి అమ్ముకొనే విధానమే జగన్ కూడా కొనసాగిస్తున్నారు అని ప్రజలు నమ్ముతున్నారు. అంటే జగన్ బాబుకి దత్తపుత్రుడు అయినందు వల్లనే బాబు విధానాలు కొనసాగిస్తున్నారా లేక మరేదైనానా?

నిరుద్యోగులకు అన్యాయం

  • బాబు నిరుద్యోగులకు (Unemployed Youth) అన్యాయం చేశారు అని అధికారంలోకి వచ్చి బాబు చేసినట్లుగానే నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నారు అని ప్రజలు నమ్ముతున్నారు. అంటే జగన్ బాబుకి (Jagan babu) దత్తపుత్రుడు అయినందువల్లనే బాబు విధానాలు కొనసాగిస్తున్నారా లేక మరేదైనానా?
  • సంపూర్ణ మధ్య నిషేధం (Ban of Liquor) అని జగన్ అధికారంలోకి వచ్చి బాబు మద్యపాన విధానాలనే కొనసాగిస్తున్నారు. అంటే జగన్ బాబుకి దత్తపుత్రుడు అయినందువల్లనే బాబు విధానాలు కొనసాగిస్తున్నారా లేక మరేదైనానా?
  • బాబు కమ్మవర్గానికే (Kamma) మెజారిటీ పదవులను కట్టబెట్టుకొంటున్నారు అని ధికారంలోకి వచ్చి, నేడు జగన్ కూడా రెడ్డి (Reddy) వర్గానికే మెజారిటీ పదవులను కట్టబెట్టుకొంటున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. అంటే జగన్ బాబుకి దత్తపుత్రుడు అయినందువల్లనే బాబు విధానాలు కొనసాగిస్తున్నారా లేక మరేదైనానా?

వివేకానంద హత్యలో

  • వివేకానంద హత్యలో (Vivekananda Reddy Murder), కోడికత్తి (Kodi Kathi), తుని రైలు (Tuni Train) కేసుల్లో బాబుపై ఆరోపణలు వ్యక్తం చేసి జగన్ అధికారంలోకి వచ్చారు. కానీ ఇప్పటివరకు ఒక్కటి కూడా నిరూపించలేక పోయారు. అంటే జగన్ బాబుకి దత్తపుత్రుడు అయినందువల్లనే చర్యలు తీసికోలేదా? లేక మరేదైనానా?
  • శేఖర్ రెడ్డి (Shekar Reddy) చంద్రబాబు బినామీ అని జగన్ అధికారంలోకి వచ్చి, అదే శేఖర్ రెడ్డిని ఎందుకు కొనసాగించారు? అంటే జగన్ బాబుకి దత్తపుత్రుడు అయినందువల్లనే బాబు విధానాలు కొనసాగిస్తున్నారా లేక మరేదైనానా?
  • టీడీపీ ప్రభుత్వ కాలంలో పింక్ డైమండ్ (Pink Diamond) మాయం అయ్యింది అనే ఆరోపణలతో అధికారంలోకి వచ్చి ఇప్పటికే దాని సంగతి ఏమి అయ్యింది అనేది ప్రజలకు ఎందుకు చెప్పలేక పోతున్నారు. అంటే జగన్ బాబుకి దత్తపుత్రుడు (Datha Puthrudu) అయినందువల్లనే చర్యలు తీసికోలేదా? లేక మరేదైనానా?
  • బాబు చేసిన అప్పుల విధానాన్నే జగన్ కూడా కొనసాగిస్తున్నారు. అంటే ఇంతకు బాబు దత్తపుత్రుడు జగనా లేక పవనా?
  • బాబు కమలంతో మతకవైకిరితో రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారు అని జగన్ అధికారంలోకి వచ్చారు. కానీ జగన్ కూడా కమలంతో అదే మెతక వైఖిరిని కొనసాగిస్తున్నారు అని ప్రజలు నమ్ముతున్నారు. అంటే జగన్ బాబుకి దత్తపుత్రుడు అయినందువల్లనే బాబు విధానాలు కొనసాగిస్తున్నారా లేక మరేదైనానా?

భూముల ధారాదత్తం గురించి

  • బాబు వందల ఎకరాలు దారాదత్తం చేశారు అని రాజన్న అధికారంలోకి వచ్చారు. కానీ రాజన్న కూడా వేల ఎకరాలు అనేక కారణాలతో ధారాదత్తం చేశారు అని ఆరోపణలు ఉన్నాయి. అంటే రాజన్న, బాబుకి దత్తపుత్రుడు అయినందువల్లనే బాబు విధానాలు కొనసాగించారా లేక మరేదైనానా?
  • రాజన్న (Rajanna) వేల ఎకరాలు ధారాదత్తం చేశారు అని బాబు అధికారంలోకి వచ్చి బాబు కూడా వేల ఎకరాలు ధారాదత్తం చేశారు అనే ఆరోపణలు ఉన్నాయి. అంటే బాబు రాజన్నకి దత్తపుత్రుడు అయినందువల్లనే రాజన్న విధానాలు కొనసాగించారా లేక మరేదైనానా?
  • ఇప్పుడు మీ ప్రభుత్వంలో భూముల ధారాదత్తం గురించి ఏమో జరుగుతున్నది అనేది ప్రజలకు తెలుసు. అంటే బాబుకి జగన్ దత్తపుత్రుడు అయినందువల్లనే బాబు విధానాలు కొనసాగిస్తున్నారా లేక మరేదైనానా?
  • అధికారంలో ఉండి కూడా బాబుపై ఒక్క చర్య ఇప్పటివరకు తీసికోలేక పోతున్నారు. బాబు అవినీతిని బయట పెట్టలేక పోయారు. పైగా బాబు వారసత్వ ప్రభుత్వ విధానాలనే జగన్ కొనసాగిస్తున్నారు అనే ఆరోపణలు ప్రజల్లో మెండుగా ఉన్నాయి. అంటే జగన్ బాబుకి దత్తపుత్రుడు అయినందువల్లనే బాబు విధానాలు కొనసాగిస్తున్నారా లేక మరేదైనానా?

కాదంటారా? కాదంటే వీటికి పాలక పార్టీనుండి సరి అయిన సమాధానాలు ప్రజలకు వివరిస్తే ప్రజలు అర్ధం చేసికొంటారు. లేకపోతే బాబు – రాజన్న కుటుంబాలు ఒకరికొకరు అనుకూలంగా పరిపాలించు కొంటున్నారు. సాయం చేసికొంటున్నారు. కావున వీరే ఒకరికొకరు దత్తపుత్రులు అవుతారు తప్ప పవన్ కాదు అని ప్రజలు భావించవలిసి ఉంటుందేమో. 

ఆలోచించండి…అధికారంలో ఉండి బాబుని కాపాడుతూ, బాబు వారసత్వ విధానాలను కొనసాగిస్తున్న వారే, బాబుకి దత్తపుత్రుడు అవుతారెమో గానీ పవన్ ఎలా దత్తపుత్రుడు అవుతాడు?

— Akshara Satyam

తిరుమల కొండపైకి భజన బృందాలకు అనుమతి లేదా?

Spread the love