Kandula DurgeshKandula Durgesh

మృతి చెందిన నడిపిల్లి రాము కుటుంబానికి అండగా జనసేన

సమాజం ఇంత అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో కూడా కులం పేరుతో మారణహోమం జరుపుతూ పైచాచిక ఆనందం పొందేవారు ఉన్నారు అంటే చాలా సిగ్గు పడాలి అని కందుల దుర్గేష్ అన్నారు. తుని తాలూకా, శృంగవృక్షంలో జరిగిన ఘర్షణల్లో మృతి చెందిన నడిపిల్లి రాము ఆత్మకి శాంతి కలగాలని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ అన్నారు.

తుని నియోజకవర్గం శృంగవృక్షం గ్రామంలో నూకాలమ్మ జాతరలో మృతి చెందిన నడిపిల్లి రాము కుటుంబాన్ని జనసేన పార్టీ ఉమ్మడి తూర్పు జిల్లా అధ్యక్షులు శ్రీ కందుల దుర్గేష్ పరామర్శించారు. జాతరలో జరిగిన సంఘటన వివరాలు తెలుసుకున్నారు. నడిపిల్లి రాము కుటుంబానికి జనసేన పార్టీ అండదండగా ఉంటుందని కందుల దుర్గేష్ హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వంగలపూడి నాగేంద్ర, తుని మండల అధ్యక్షుడు ధారకొండ వెంకట రమణ, కోటనందూరు మండల అధ్యక్షులు పెదపాత్రుని శ్రీనివాస్, తొండంగి మండల ఉపాధ్యక్షులు కండవిల్లి గణేష్, తొండంగి మండల అధికార ప్రతినిధి పెదిరెడ్ల దుర్గాప్రసాద్, తొండంగి గ్రామ అధ్యక్షులు ఎలుగుబంటి నాగు నియోజకవర్గ సీనియర్ నాయకులు చోడిశెట్టి గణేష్, తేనే నాగ శేషు, రాజ శేషు అంకారెడ్డి, ఇండుగుబిల్లి శ్రీను, ప్రవీణ్, గెడ్డమూరి సురేష్, జనసేన శివశంకర్, నల్లమట్టి రాము, కన్నా జనసేన, నాగూర్, ఇళ్ళ శివన్నారాయణ, ఆనంద్, మొగ్గ తేజ తదితరులు జనసైనికులు పాల్గొని సంతాపం ప్రకటించారు.

వైసీపీ శ్రేణుల దాడిపై బీజేపీ అధినాయకత్వం స్పందించాలి: పవన్