High courthigh court

హైకోర్టుకు నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం

ఆనందయ్య కంటి చుక్కల (కంటి మందు)లో హానికర పదార్థాలు ఉన్నట్లు పరీక్షల్లో తేలిందని రాష్ట్ర ప్రభుత్వం (State Government) హైకోర్టుకు (High Court) సోమవారం తెలియజేసింది. ఈ మందు వినియోగం వల్ల కళ్లకు హాని కలుగుతున్నట్లు నివేదికలు వచ్చాయని రాష్ట్ర ప్రభుత్వం (State Government) హైకోర్టుకి వివరించింది. ఈ వివరాలను హైకోర్టు పరిగణనలోకి తీసుకున్నది. ఆ పరీక్షలకు సంబంధించిన నివేదికలను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.

ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్‌ అరూప్‌ కుమార్‌ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్‌ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం సంబంధిత ఉత్తర్వులు ఇచ్చింది.

నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన బి.ఆనందయ్య కరోనా చికిత్సకు నాలుగు రకాల మందులతో పాటు కంటి చుక్కల మందును కూడా తయారు చేశారు. ఈ మందుల వినియోగానికి అనుమతినిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఆనందయ్య (Anandaiah) తో పాటు మరికొందరు గతంలో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. కంటి చుక్కల మందు మినహా మిగిలిన 4 రకాల మందుల వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని పరీక్షల్లో తేలడంతో.. ప్రభుత్వం వాటి వినియోగానికి అంగీకరించింది.