వచ్చే ఎన్నికల్లో విశాఖపట్నం లోక్‌సభ స్థానం (Visakhapatnam parliament) నుంచి మాత్రమే పోటీలో ఉంటానని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ (J D Lakshminarayana) స్పష్టం చేసారు.
తన ఆలోచనలు, ఆశయాలకు అనుగుణంగా ఉన్న ఏ పార్టీ నుంచినైనా పోటీ చేస్తానని కూడా జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు.
నా ఆశయాలకు ఈ పార్టీ సరిపోకపోతే, అప్పుడు స్వతంత్రంగా అయినా బరిలో నిలుస్తానని జేడీ లక్ష్మీనారాయణ అన్నారు.
ఏ పార్టీ నుంచి పోటీ చేయాలనే విషయంపై ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. త్వరలో వివరిస్తానని జేడీ లక్ష్మీనారాయణ స్పష్టం చేసారు.
— టి వి గోవిందరావు, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్