Progress ReportProgress Report

జనసేన పార్టీ (Janasena Party) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) డిప్యూటీ సీఎంగా (AP Deputy CM) పదవీ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి అయిన సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎంఓ ఒక ప్రోగ్రెస్ రిపోర్టుని (Progress Report) విడుదల చేసింది. సుపరిపాలనకు ఏడాది సమగ్ర అభివృద్ధి నివేదిక 2024 2025 పేరుతో విడుదల చేసిన నివేదికను పరిశీలిస్తే పవన్ కళ్యాణ్ పాలనా తీరుని అర్ధం చేసికోవచ్చు.

ప్రగతి – పారదర్శకత – సుస్థిరత – జవాబుదారీతనం – గ్రామ స్వరాజ్యంకై ముందడుగు – హరితాంధ్ర సాధనకై మరో అడుగు అనే ఆరు లక్ష్యాలు ఉన్నట్లు తెలిపారు.

గత సంవత్సరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయానికి అండగా నిలబడి, రాష్ట్రాన్ని బానిస సంకెళ్లు నుండి విముక్తి చేసిన ప్రతి ఒక్కరికీ పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలియజేసారు. 2019 నుండి 2024 వరకు ఐదేళ్ల కాలంలో రాష్ట్రం నియంతృత్వ పాలకుల పాలనలో నలిగిపోయింది. అభివృద్ధికి దూరమైంది, శాంతిభద్రతలు క్షీణించాయి, యువత భవిష్యత్తుపై నీలి మేఘాలు కమ్ముకున్నాయి. మహిళలకు రక్షణ కరువైంది, రాష్ట్ర రాజధాని నిర్మాణంలో ఒక్క ఇటుక కూడా కదలకుండా నిర్మానుష్యంగా మారిపోయింది అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన నివేదికలో తెలిపారు.

ఇటువంటి క్లిష్ట సమయంలో రాష్ట్రాన్ని రక్షించేందుకు, రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిపాలనను పునరుద్ధరించేందుకుగాను అధికారంలోకి వచ్చాం. భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ దేశాన్ని ప్రపంచ నాలుగవ ఆర్థిక వ్యవస్థగా నిలిపిన దార్శనికుడు… నవభారత నిర్మాత, గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో మా కూటమి పాలనా మొదలు పెట్టింది. అలాగే నాలుగున్నర దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో బాధ్యతలు చేపట్టాం. ప్రజల పక్షాన ఎల్లవేళలా నిలబడి, కూటమి నాయకుల సమిష్టి సహకారంతో పాలనా మొదలు పెట్టాం. NDA కూటమి 164 అసెంబ్లీ సీట్లను గెలిచి 94% స్ట్రెక్ రేట్ తో చారిత్రాత్మక విజయం సాధించింది.

ఇంతటి గెలుపును అందించిన ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు, మళ్లీ రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టించేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో అహర్నిశలు కృషి చేస్తూ వచ్చింది. సంవత్సర కాలంలోనే గత ఐదేళ్లలో జరగని అభివృద్ధిని చేసి చూపిస్తూ, ప్రజల్లోనే కాకుండా, పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని నింపడానికి కృషి చేశాము. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని, సుపరిపాలనను చూసి నేడు కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారాలు అందిస్తూ వచ్చిఇది. దీనితో రాష్ట్రం అన్ని రంగాల్లో సమిష్టి అభివృద్ధి సాధిస్తూ స్వర్ణాంధ్ర 2047 సాధించే దిశగా అడుగులు వేస్తుంది అని ఏపీ డిప్యూటీ సీఎం అన్నారు.

రాజకీయాల్లో, ప్రభుత్వంలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని నిరంతరం పరితపించే నేను గత సంవత్సర కాలంలో చేపట్టిన శాఖల ద్వారా చేసిన అభివృద్ధిని, సాధించిన విజయాలను ప్రజలందరి ముందు ఉంచడం నా నైతిక బాధ్యతగా భావిస్తున్నాను. డిప్యూటీ సీఎంగా అధికార బాధ్యతలు స్వీకరించి సంవత్సరం అయిన సందర్భంగా ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్నాను అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన ప్రోగ్రెస్ రిపోర్టులో స్పష్టం చేసారు.

పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ; పర్యావరణ, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల ద్వారా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల సమగ్ర నివేదికను విడుదల చేస్తున్నాం. దీన్ని ప్రజలందరూ నిశితంగా పరిశీలించి ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను తెలిసికోగలరు. తద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేయాలనే మా సంకల్పాన్ని గుర్తిస్తారని ఆశిస్తున్నాను అని పవన్ కళ్యాణ్ అన్నారు. రానున్న నాలుగేళ్ల కాలంలో ఇంతకు రెట్టింపు అభివృద్ధి చేపట్టి రాష్టాన్ని అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గా దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని మాటిస్తున్నాను అని డిప్యూటీ సీఎం వివరించారు.

ఏడాది కాలంలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల నివేదిక

  1. గత సంవత్సర కాలంలో దాదాపు 1,312 కిలోమీటర్ల మేర 449 BT రోడ్ల పనులను పూర్తి చేయడం జరిగింది. వీటిలో 344 రోడ్లు 419 ప్రాంతాలకు కలుపుతూ వారికి తొలిసారిగా రోడ్డు సౌకర్యం కల్పించడం జరిగింది.
  2. రూ 649.26 కోట్ల నిధులను పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ అభివృద్ధి పనులకు వెచ్చించడం జరిగింది.
  3. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా వివిధ కార్యక్రమాలకు అందుకున్న నిధులు మొత్తం – రూ 589.52 కోట్లు
    A. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన (PMGSY) ద్వారా అందుకున్న నిధులు – 475 కోట్లు
    B. RCPLWEA – *73.32 కోట్లు
    C. ప్రధాన మంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (PM JanMAN) ద్వారా
    అందుకున్న నిధులు – రూ 41.20 కోట్లు.
  4. PM JanMAN మరియు పంచాయతీరాజ్ రిఫార్మ్స్ – ట్రైబల్ సబ్ ప్లాన్ ద్వారా 258 గిరిజన గ్రామాలను కలుపుతూ 215 రోడ్ల నిర్మాణ పనులు చేపట్టి 661.55 కిలోమీటర్ల రహదారిని పూర్తి చేసేందుకు రూ 605.34 కోట్లతో మొదలు పెట్టడం జరిగింది. రానున్న రెండు సంవత్సరంలో ఈ పనులు పూర్తికానున్నాయి.
  5. రాష్ట్రంలో ఎంతోకాలంగా శిథిలావస్థకు చేరి గుంతలమయంగా మారిన 402 రోడ్లను గుర్తించి, 1,202.60 కిలోమీటర్ల రోడ్ల మరమ్మత్తుల కోసం నాబార్డ్ నిధుల నుండి రూ 557.22 కోట్లను విడుదల చేయడం జరిగింది.

గత సంవత్సర కాలంలో MGNREGS ద్వారా సాధించిన అభివృద్ధి వివరాలు

  1. రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలలో రహదారుల సౌకర్యాన్ని మెరుగుపరుస్తూ 4 వేల కిలోమీటర్ల సిసి రోడ్ల నిర్మాణం పూర్తి చేయడం జరిగింది.
  2. వివిధ గ్రామాలను, ప్రాంతాలను కలిపేలా 276 కిలోమీటర్ల బీటీ రోడ్ల నిర్మాణం పూర్తి చేయడం జరిగింది.
  3. గ్రామాల్లో వ్యవసాయనీటి అవసరాలు తీర్చేందుకు, భూగర్భ జలాల శాతం పెంచేందుకు, మత్స్య సంపదను పెంచేందుకు అనువుగా రాష్ట్రవ్యాప్తంగా 78,776 వ్యవసాయ నీటి కుంటలు నిర్మాణం పూర్తి చేయడం జరిగింది.
  4. గ్రామాల్లో పాడి పశువులకు నీడను కల్పించేందుకు, వాటిని ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు, పాడి ఉత్పత్తిని పెంచి రైతులకు ఆదాయం పెంచేలాగా వాటి సంరక్షణకై 22,500 గోకులాల నిర్మాణాన్ని పూర్తి చేయడం జరిగింది.
  5. మూగజీవాలకు వేసవి త్రాగునీటి సమస్యను తీర్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా 15,000 పశువుల నీటి తొట్టెలు నిర్మాణం చేపట్టడం జరిగింది.
  6. MGNREGA ద్వారా ఇప్పటివరకు గత సంవత్సరం కాలంలో దాదాపు 3,429 లక్షల పని దినాలను ఉపాధి శ్రామికులకు కల్పించడం జరిగింది.
  7. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 46.94 లక్షల మంది ఉపాధి శ్రామికులకు ఉపాధి కల్పించడం జరిగింది.
  8. దాదాపు 13,578 నివాస ప్రాంతాలకు రహదారుల సౌకర్యం కల్పించడం జరిగింది.
  9. దాదాపు 1,877 నివాస ప్రాంతాలకు తొలిసారిగా రహదారి సౌకర్యం కల్పించడం జరిగింది.
  10. 1,137 గిరిజన గ్రామాలకు రహదారుల సమస్యను పరిష్కరించి వారికి డోలీ వెతలు చెరిపేసి, అభివృద్ధిని చేరువ చేస్తూ, విద్యా, వైద్య, ఉపాధి సౌకర్యాలను చేరువ చేయడం జరిగింది.

MGNREGS నిధుల – వ్యయ నివేదిక

వేతనాలు: అందుకున్న నిధులు -రూ 5,254.75 కోట్లు చెల్లింపు వ్యయం – రూ 6,722.06 కోట్లు

మెటీరియల్: అందుకున్న నిధులు – రూ 2,293.90 కోట్లు చెల్లింపు వ్యయం – రూ 3,464.68 కోట్లు

అడ్మినిస్ట్రేషన్: అందుకున్న నిధులు – రూ 4,84.2 కోట్లు వ్యయం – రూ 385.49 కోట్లు

మొత్తంగా గత సంవత్సర కాలంలో కేంద్ర ప్రభుత్వ MGNREGS ద్వారా కేంద్ర వాటా, మరియు రాష్ట్ర వాట కలిపి రూ 8,032.85 కోట్లు నిధులు అందుకోగా, రూ 10,572.23 కోట్ల వ్యయం అభివృద్ధి కార్యక్రమాలపై వెచ్చించడం జరిగింది. వ్యత్యాసం ఉన్న కొంత మొత్తం పెండింగ్ నిధులు త్వరలో అందుకోనున్నాము.

ప్రగతి పథంలో పిఠాపురం

పిఠాపురం MLA, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో మోడల్ నియోజకవర్గంగా రూపుదిద్దుకుంటున్న పిఠాపురం.

సంవత్సర కాలంలో రికార్డ్ స్థాయిలో రూ 308.35 కోట్ల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల వివరాలు:

1. ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలో రైల్వే ROB నిర్మాణానికి అనుమతులు: రూ 98 కోట్లు.
2. అమృత్ 2.0 పథకం ద్వారా పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలో స్వచ్ఛమైన త్రాగునీరు
అందించేందుకు నిధులు విడుదల: రూ 57 . 37 కోట్లు.
3. పిఠాపురం పరిసర ప్రాంత ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించేలా అన్ని రకాల వైద్య సదుపాయాలతో 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను 100 పడకల ఏరియా ఆసుపత్రిగా అభివృద్ధి పనులకు శ్రీకారం: రూ 34 కోట్లు.
4. MGNREGS నిధుల ద్వారా నియోజకవర్గంలో 294 BT & CC రోడ్ల నిర్మాణం పూర్తి:
కొత్తపల్లి PHC లో వెయిటింగ్ హాల్ నిర్మాణం, 3 కాంపౌండ్ వాల్స్ నిర్మాణం పూర్తి
రూ 24 . 24 కోట్లు.
5. ఇప్పటికే రోడ్ల నిర్మాణానికి అనుమతులు లభించి నిర్మాణ పనుల దశలో ఉన్న MGNREGS పనులు రూ 20 . 58 కోట్లు
6. మహిళలకు స్వయం ఉపాధి కల్పించేలా 3,456 కుట్టు మిషన్లు పంపిణీ: రూ 8 . 64 కోట్లు.
7. గుంతలు లేని రహదారులుగా పిఠాపురం నియోజకవర్గంలో 24 రోడ్ల మరమ్మత్తుల పూర్తి: రూ 6 . 8 కోట్లు.
8. రెండు మేజర్ R & B రహదారుల అభివృద్ధి: రూ 5 . 5 కోట్లు.
9. పిఠాపురం & గొల్లప్రోలు మున్సిపాలిటీల అభివృద్ధికై నిధుల విడుదల: రూ 4 . 78 కోట్లు..
10. గొల్లప్రోలు లోని మొగలి సూరీడు చెరువు సుందరీకరణ పనులు: రూ 04 . 06 కోట్లు..
11. 49 వ్యవసాయ నీటి కుంటలు, 33 పశువుల నీటి తొట్టెలు, 459 ఇంకుడు గుంతలు, 5 . కంపోస్ట్ గుంతల నిర్మాణం: రూ 64 . 75 కోట్లు.
12. గొల్లప్రోలు హౌసింగ్ కాలనీ పరిధిలో డబల్ లైన్ రోడ్ బ్రిడ్జ్ (DLRB) నిర్మాణం  3.05 కోట్లు.
13. పాడి పశువులకు నీడను కల్పించేందుకు, వాటికి మంచి వాతావరణం, పాడి రాబడి పెంచేందుకు 189 మినీ గోకులాల నిర్మాణం – 3.02 కోట్లు

14. పిఠాపురంలో 33/11 KV విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణం – 2.94 కోట్లు
15. పిఠాపురం నుండి దొంతమూరు వరకు 33KV విద్యుత్ లైన్ ఏర్పాటు – 1.84 కోట్లు
16. గొల్లప్రోలు, చేబ్రోలు లోని చారిత్రక సీతారామ స్వామి ఆలయాల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు – 1.8 కోట్లు
17. వ్యవసాయ సహకార కార్యక్రమాలు 18. 36 అదనపు ట్రాన్స్ఫార్మర్స్ పంపిణీ  1.68 కోట్లు
18. 36 అదనపు ట్రాన్సఫమోర్స్ పంపిణీ 1 . 58 కోట్లు
19. పేదలకు తక్కువ ఖర్చుతో వివాహాలు జరుపుకునేందుకు ఉప్పాడ కొత్తపల్లి లో నూతన TTD కళ్యాణ మండపం నిర్మాణం – 2 కోట్లు
20. వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా కొనపపేట మత్స్యకార గ్రామం అభివృద్ధి చేసేలా నిర్ణయం – 2 కోట్లు
21. గత సంవత్సరం సంభవించిన వరదల కారణంగా జరిగిన నష్టాన్ని భర్తీ చేసేలా మరమ్మత్తుల పనులు 2 కోటు
22. పిఠాపురం పరిథిలో మినీ జూ అభివృద్ధి చేసేలా నిధులు, అనుమతుల మంజూరు: 1 కోటి
23. పిఠాపురంలో సకలేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి నిధుల మంజూరు:  1 కోటి

24. పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలోని జగ్గయ్య చెరువు ప్రాంత అభివృద్ధి పనులు: 1 కోటి
25. పిఠాపురంలో నగర వనం ఏర్పాటు రూ 95 లక్షలు
26. ప్రాంతాలలో ధ్వంసమైన కరెంట్ స్తంభాలను తొలగించి, వాటి స్థానంలో నూతన స్థంభాల ఏర్పాటు – రూ 92 . 98 లక్షలు
27. గొల్లప్రోలు అర్బన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ పెండింగ్ పనుల పూర్తి – 88.98 లక్షలు
28. తీరంలో వేటకు వెళ్ళే మత్స్యకారులకు రక్షణ కల్పించేలా, వారికి ప్రమాద హెచ్చరికలు, రేడియో సిగ్నల్స్ పంపించేలా ట్రాన్స్ పాండర్ల మంజూరు – 86.73 లక్షలు
29. పిఠాపురం పట్టణంలోని టీటీడీ కళ్యాణ మండపం మాడ వీధులు మరియు మరమ్మత్తుల అభివృద్ధి పనులు: రూ 79 . 00 లక్షలు
30. గొల్లప్రోలు నగర పంచాయతీకి నీటి సరఫరా పెండింగ్ పనుల మరమ్మతుల పూర్తి: రూ 72 . 75 లక్షలు
31. నియోజకవర్గ పరిధిలో 39 పాఠశాలల కాంపౌండ్ వాల్స్ నిర్మాణం: రూ 3 . 17 కోట్లు
32. పిఠాపురం పశువుల సంత నిర్మాణం; రూ 1 . 35 కోట్లు
33. పిఠాపురంలో నూతన ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు: రూ 1 . 1 కోట్లు
34. చేబ్రోలు, కొమరిగిరి ప్రాంతాల్లో పబ్లిక్ హెల్త్ యూనిట్ ల ఏర్పాటు: రూ 1 కోట్లు
35. పిఠాపురం ఇంటిగ్రేటెడ్ సాంఘిక సంక్షేమ బాలిక హాస్టల్ లో మరమ్మత్తుల పనులు: 36 . 5 లక్షలు
36. ఉప్పాడ కొత్తపల్లి మండలం, రవీంద్రపురం గ్రామ MPPS స్కూల్ భవన నిర్మాణం: 32 లక్షలు
37. తహసీల్దార్ కార్యాలయం నిర్మాణ పెండింగ్ పనుల పూర్తి; రూ 28 . 5 లక్షలు
38. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను వర్షాల నుండి రక్షించేందుకు 2,000 టార్పాలిన్ల పంపిణీ: 26 లక్షలు
39. సురంపేట లో నిర్మాణ మద్యలో ఆగిపోయిన బ్రిడ్జి పనుల పూర్తి: 24 లక్షలు
40. గొల్లప్రోలు ZPHS పాఠశాల స్లాబ్ లీకేజ్ మరమ్మత్తులు, నీటి సరఫరా ఏర్పాటు పనులు; 23 లక్షలు
41. పిఠాపురం శ్రీ BMR బాలికల హైస్కూల్ లో క్రీడాస్థలం అభివృద్ధి: 10 . 5 లక్షలు
42. ఉప్పాడ కొత్తపల్లి మండలం, మూలపేట గ్రామం సాంఘిక సంక్షేమ వసతి గృహం మరమ్మత్తుల పనులు: 10.5 లక్షలు
43. పిఠాపురం హైవే వద్ద బస్ షెల్టర్ నిర్మాణం: 10 లక్షలు

44. పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని 10 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (PHC) RO ప్లాంట్ల ఏర్పాటు – 10 లక్షలు
45. పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని 33 పాఠశాలల్లో సైన్స్ ల్యాబ్స్ అధునాతన సామాగ్రి అందచేత 9.9 లక్షలు
46. పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని 25 ZPHS పాఠశాలలకు క్రీడా సామగ్రి కిట్ల పంపిణీ – 16 లక్షలు
47. ఉప్పాడ కొత్తపల్లి మండలం, ఇసుకపల్లి MPPS పాఠశాల భవన నిర్మాణం:  16 లక్షలు
48. ఉప్పాడ కొత్తపల్లి మండలం, శొంటివారిపాకలు 1. MPPS పాఠశాల భవన నిర్మాణం:  16 లక్షలు
49. ఉప్పాడ కొత్తపల్లి మండలం, నిదానందొడ్డి MPPS పాఠశాల భవన నిర్మాణం: 16 లక్షలు
50. పిఠాపురం నియోజకవర్గంలో ఎలక్ట్రిషియన్లను విద్యుత్ షాక్ ప్రమాదాల బారిన పడకుండా 323 మంది ఎలక్ట్రిషియన్లకు సేఫ్టీ కిట్స్ పంపిణీ: 16.5 లక్షలు
51. గొల్లప్రోలు అన్నా క్యాంటీన్ ఆధునీకరణ: 17 లక్షలు

52. నాగులపల్లి సమగ్ర రక్షిత నీటి పంపిణీ వ్యవస్థ ఆధునీకరణ: 50 లక్షలు
53. చేబ్రోలు సాంఘిక సంక్షేమ మహిళల వసతి గృహం, మరియు ఉప్పాడ కొత్తపల్లి మండలం. కలువల దొడ్డి, వెంకట్రాయ పురం MPPS పాఠశాలల్లో R.O ప్లాంట్ల ఏర్పాటు: 2 . 9 లక్షలు
54. గొల్లప్రోలు ప్రాధమిక పాఠశాలలో R.O ప్లాంట్ ఏర్పాటు: 4 లక్షలు
55. కొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో (PHC) వాటర్ ప్యూరిఫైర్, గీజర్ ఏర్పాటు: 45 వేలు
56. నాగులపల్లి ZPHS, గొల్లప్రోలు MPPS మరియు గొల్లప్రోలు ప్రభుత్వ జూనియర్ కళాశాల పెండింగ్ పనుల పూర్తి: 3 . 85లక్షలు
57. 42 మంది అనాధ పిల్లలకు తన జీతం నుండి నెలకు 75,000 సాయం 4 . 2 లక్షలు
58. ఉత్తమ సేవలు అందిస్తున్న 8 మంది నర్సులను సన్మానించి వారికి 25 వేల చొప్పున ప్రోత్సాహకం: 2 లక్షలు
59. ఉప్పాడ కొత్తపల్లి మండలం PHC ఔట్ పేషంట్ బ్లాక్ నిర్మాణం: 5 లక్షలు
60. ఉప్పాడ కొత్తపల్లి మండలం, రవీంద్రపురం MPPS స్కూల్ భవన నిర్మాణం: 32 లక్షలు

ఇలా అన్ని విభాగాలలో అభివృద్ధి పురోగతి సాధిస్తూ, అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమాభివృద్ధి చేరువ చేస్తూ మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

త్రాగునీటి సమస్య లేని గ్రామాలను సాధించడమే లక్ష్యంగా పనిచేస్తున్న గ్రామీణ నీటి సరఫరా శాఖ

ప్రతీ ఇంటికి రక్షిత మంచినీరు అందించడమే లక్ష్యంగా, కేంద్ర ప్రభుత్వ జల్ జీవన్ మిషన్, హర్ ఘర్ జల్ పథకాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకునేలా ప్రణాళిక బద్దంగా వ్యవహరిస్తున్న గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి పవన్ కళ్యాణ్

అధికారంలోకి వచ్చిన తొలి 3 నెలల్లోనే పూర్తిస్థాయిలో అధ్యయనం చేపట్టి కేంద్ర ప్రభుత్వతో చర్చలు జరిపి, గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలను పునరావృత్తం జరగకుండా పథకాలను అమలు చేస్తామని అనుమతులు తీసుకుని 2028 వరకు పథకాన్ని పొడిగించేలా కేంద్రానికి ప్రతిపాదన చేశారు. ఈ మేరకు కేంద్రం కూడా సానుకూలంగా గత బడ్జెట్ లో స్పందించింది.

గత సంవత్సర కాలంలో గ్రామీణ నీటి సరఫరా శాఖ (RWS) చేపట్టిన కార్యక్రమాల వివరాలు

1. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, పల్నాడు (గుంటూరు), ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో రక్షిత త్రాగునీటి సరఫరా అందించేలా 7,910 కోట్ల భారీ వ్యయంతో బహుళ గ్రామాల పథకాల (MVS) ఏర్పాటుకు నూతనంగా పనులు మొదలు పెట్టేందుకు శంకుస్థాపనలు చేశారు.
2. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 3,778 పనులు జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా పూర్తి చేసారు.
3. రాష్ట్రవ్యాప్తంగా 54,352 గృహాలకు త్రాగునీటి కుళాయి సదుపాయాన్ని కల్పించి మంచినీటిని అందిస్తున్నారు.
4. జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా దాదాపు 1,191.10 కోట్లు త్రాగునీటి సదుపాయం కోసం వెచ్చించడం జరిగింది.
5. ఉద్దానం ప్రాంతానికి రక్షిత మంచినీటిని అందించే బహుళ గ్రామాల పథకం (MVS) పూర్తి చేయడం జరిగింది.
6. YSR కడప జిల్లా పులివెందుల ప్రాంతానికి త్రాగునీటి సౌకర్యం కల్పించేందుకు 480 కోట్ల అంచనా వ్యయంతో
భారీ బహుళ గ్రామాల పథకం (MVS) అలాగే కర్నూలు జిల్లా, డోన్ ప్రాంతంలో 351 కోట్ల అంచనా వ్యయంతో
మరో బహుళ గ్రామాల పథకం (MUS) పనులు పూర్తి దశలో ఉన్నాయి. వీటి ద్వారా దాదాపు 0.81 లక్షల కుళాయి
కనెక్షన్లు అందించనుంది.
7. ఇప్పటికే కొనసాగుతున్న జల్ జీవన్ మిషన్ పథకం పనులకు )26,824 కోట్లు) తోడుగా మొత్తంగా దాదాపు
84,750 కోట్ల భారీ వ్యయంతో పనులు చేపట్టారు. వీటితో పాటుగా 43 ఉపరితల నీటి వనరులతో 56 నూతన బహుళ గ్రామాల పథకాలు (MVS) మొదలుపెట్టారు.
8. కుప్పం నియోజకవర్గ పరిధిలో 110.21 కోట్ల వ్యయంతో చేపట్టనున్న 451 డ్రెయిన్ పనులకు ఆమోదం తెలపడం జరిగింది. ప్రస్తుతం టెండర్ల దశలో ఉన్నాయి.

ఈ 5 ఏళ్ల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా 95.44 లక్షల గ్రామీణ ప్రాంతాల్లోనివాసాలకు కుళాయి కనెక్షన్లు అందించి, సగటున ప్రతీ మనిషికి రోజుకు కనీసం 55 లీటర్ల స్వచ్ఛమైన రక్షిత త్రాగునీటి అందించాలనే ధృడ సంకల్పంలో గ్రామీణ నీటి సరఫరా శాఖ పనిచేస్తుంది.

వృక్షో రక్షతి రక్షితః

అటవీ, పర్యావరణ, సైన్స్ & టెక్నాలజీ శాఖ
హరితాంధ్ర ప్రదేశ్ గా – జీవి వైవిధ్యానికి నిలయంగా మారుతున్న ఆంధ్రప్రదేశ్

1. రాష్ట్రంలో పచ్చదనాన్ని 2047 నాటికి 50% పెంచాలనే ధృడ సంకల్పంతో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ
జూన్ 2025 నాటికి 1,62,923 చదరపు కిలోమీటర్ల మేర పచ్చదనాన్ని 30.05 శాతానికి పెంచింది. దీనిలో అటవీ శాఖ పరిధిలోని భూమి 22.96 శాతం ఉండగా, 7.09 శాతం ఇతర ప్రాంతాలలో వ్యాపించి ఉంది.
2. మానవులు – ఏనుగుల మధ్య తరచుగా జరుగుతున్న ఘర్షణ వాతావరణాన్ని తగ్గించేందుకు, రైతుల పంట
నష్టాన్ని, ప్రాణ నష్టాన్ని తగ్గించేందుకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంతో చారిత్రక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ అవగాహన ఒప్పందం (MoU) లో భాగంగా రాష్ట్రానికి 6 కుంకీ ఏనుగులు ఇచ్చేందుకు కర్ణాటక ప్రభుత్వం ఒప్పుకుంది. ఇప్పటికే 4 ఏనుగులు మే 21 న అప్పగించగా త్వరలో మరో 2 ఏనుగులు అందించనున్నారు.
3. ఈ MoU లో భాగంగా కుంకీ ఏనుగులతో పాటుగా, పలు కీలక అంశాలైన ఎర్ర చందనం, శ్రీ గంధం అక్రమ రవాణా అరికట్టడం, సాంకేతికత సహాకారం అందించడం, వన్య ప్రాణులను సంరక్షించడం, వేటగాళ్ళను నియంత్రించడం వంటి అంశాలపై ఇరు రాష్ట్రాలు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి.
4. చిత్తూరు జిల్లా పలమనేరు రేంజ్ పరిధిలో ముసల్లమడుగు ప్రాంతంలో ఏనుగుల క్యాంప్ ఏర్పాటు, శిక్షణ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది.
5. రాష్ట్రంలో భూ, తేమ పరిరక్షణ, అటవీ భూములను సరక్షించడంలో భాగంగా 715 క్యూబిక్ మీటర్ల రాక్ ఫిల్డ్ డ్యామ్స్ (RFD), 67,324 RMT కాంటౌర్ ట్రెంచుల నిర్మాణం, 57 చెక్ డ్యాముల నిర్మాణం, 1,064 మినీ పెర్కొలేషన్ ట్యాంకుల, పెర్కొలేషన్ ట్యాంకుల నిర్మాణం చేపట్టారు.
6. రాష్ట్ర వ్యాప్తంగా 662.24 లక్షల విత్తనాలు నాటడం ద్వారా 96,799 హెక్టార్ల పరిధిలో మొక్కల పెంపకం చేపట్టి
అటవీ విస్తీర్ణం పెంచేందుకు కృషి చేశారు.
7. గ్రీన్ క్లైమేట్ ఫండ్ ప్రాజెక్ట్ లో భాగంగా 63.17 లక్షల వ్యయంతో దాదాపు 468 హెక్టార్ల.విస్తీర్ణంలో మడ అడవులు
పునరుద్ధరించడం జరిగింది.
8. 2024-2025 సంవత్సరంలో MGNREGS పథకం ద్వారా 26 జిల్లాల పరిధిలో 540.14 లక్షల విత్తనాలు సేకరించడం
ద్వారా, ఈ సంవత్సరం మొక్కల పెంపకానికి వినియోగించేందుకు దోహద పడనున్నాయి.

వన్యప్రాణుల సంరక్షణ

1. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 3 జాతీయ పార్కులు, 13 వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాలతో పాటుగా దేశంలోనే అతిపెద్ద నాగార్జునసాగర్ – శ్రీశైలం టైగర్ రిజర్వ్ ప్రాంతాలలోని వన్యప్రాణులను సంరక్షించేందుకు చర్యలు చేపట్టడం జరిగింది.
2. 2018 సమయంలో 48 గా ఉన్న పెద్దపులుల సంఖ్య ప్రస్తుతం 83% పెరిగి 88 కి చేరుకుంది. రాష్ట్ర అటవీ శాఖ
చేపడుతున్న చర్యలతో పెద్ద పులుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది.
3. తీర ప్రాంతంలో అరుదైన ఆలివ్ రిడ్లీ తాబేళ్లు సంరక్షణకు ప్రత్యేక చొరవ తీసుకుంది.
4. వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ WWF తో సహకార ఒప్పందం
• పాపికొండ జాతీయ పార్కులో పులులు ఇతర వన్యప్రాణుల పరిరక్షణ కోసం డబ్ల్యూ డబ్ల్యూ ఎఫ్ తో అవగాహన ఒప్పందం చేసుకోవడం జరిగింది. TIGER
ఐదు సంవత్సరాల పాటు వారి విశేషాలు అనుభవంతో స్థానికుల జ్ఞానాన్ని కలుపుకుంటూ పెద్దపులుల సంఖ్య పెంచేందుకు, దాడులను పసిగట్టేందుకు, ప్రజలను మమేకం చేసేందుకు, అటవీ శాఖ అధికారులు సామర్థ్యం పెంచేందుకు వారు సహకారం అందించనున్నారు.

జూ పార్కుల అభివృద్ధి

5. తిరుపతి లోని ఎస్వీ జూలాజికల్ పార్క్ నందు 80 లక్షల సిఎస్ఆర్ నిధులతో వైట్ టైగర్ సఫారీ ఏర్పాటు చేయడం ద్వారా వీక్షకుల అనుభూతి పెంచడంతోపాటుగా వన్యప్రాణుల పరిరక్షణకు చర్యలు చేపట్టారు.

6. ఎస్వీ జూలాజికల్ పార్క్ లో అనేక కొత్త జంతువులను ప్రవేశ పెట్టి ప్రేక్షకులకు కొత్త అనుభూతి అందించేందుకు
చర్యలు చేపట్టారు. వన్యప్రాణుల దాడిలో చనిపోయిన వారికి చెల్లించే పరిహారాన్ని 75 లక్షల నుండి 10 లక్షలకు పెంచడం జరిగింది. తీవ్ర ప్రమాదానికి గురైన వారికి ప్రమాద పరిహారం కింద 72 లక్షలతో పాటుగా వైద్య ఖర్చులు అందిస్తున్నారు.

* పాడి పశువులు మరణిస్తే సరిహద్దు రాష్ట్రాలతో సమానంగా మార్కెట్ వాల్యూ రైతులకు అందిస్తున్నారు.
• పంట నష్టం జరిగిన సమయంలో పంట నష్ట తీవ్రతను బట్టి కనిష్టంగా 1.25 లక్షల వరకు పరిహారాన్ని అందిస్తున్నారు.

నగర వనాల అభివృద్ధి

7. రాష్ట్రవ్యాప్తంగా కేంద్ర సహకారంతో, 61 కొత్త నగర వనాలు ఏర్పాటు చేసేందుకు పట్టణాల్లో పచ్చదనంతో
పాటుగా ఆహ్లాదం పెంచేందుకు చర్యలు చేపట్టారు. వీటికోసం మొత్తం 11,220.09 లక్షలు వ్యయం కానుండగా, ఇప్పటికే 9,913.93 లక్షలు విడుదల. చేయడం జరిగింది.
8. మరో 20 నూతన నగర వనాలను ఏర్పాటు చేసేందుకు కేంద్రానికి నివేదికలు పంపించడం జరిగింది.

ఎకో టూరిజం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు

9. రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధి చేసేందుకు వనవిహారి పథకం ద్వారా ఎకో టూరిజం ప్రాంతాల అభివృద్ధి చేపట్టడం జరిగింది.

10. ప్రత్యేకంగా రాష్ట్ర ఎకో టూరిజం పాలసీని రూపకల్పన చేసి పర్యాటకులను ఆకట్టుకునేలా చర్యలు చేపట్టడం జరిగింది.
11. రాష్ట్రంలో ఎకో టూరిజం సెంటర్లను పెంచేలా గత సంవత్సర కాలంలో 16 నూతన సెంటర్లు ప్రారంభించి వీటి సంఖ్యను 48 కి తీసికెళ్ళారు.

అటవీ సంరక్షణ & ఆక్రమణల అరికట్టడం

12. అటవీ శాఖ పలు జాయింట్ ఆపరేషన్ల ద్వారా ఎర్ర చందనం అక్రమ రవాణా ముఠాలను పట్టుకోవడమే కాకుండా ఆక్రమణదారుల నుండి, వాటిని తిరిగి అటవీ శాఖకు అప్పగించడం జరిగింది.
13. అటవీ సరిహద్దులను పూర్తి స్థాయిలో డిజిటలైజేషన్ చేపట్టి వాటి సంరక్షణకు చర్యలు చేపట్టడం జరిగింది.
14. గతంతో పోలిస్తే గత సంవత్సర కాలంగా అటవీ శాఖ చేపట్టిన చర్యలతో అగ్ని ప్రమాదాల తీవ్రత గణనీయంగా తగ్గింది. GIS, MIS టూల్స్ సహకారంతో ప్రమాద తీవ్రత ఉన్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి వాటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో వీటిని తగ్గించగలిగారు.
15. భారీ అటవీ అగ్ని ప్రమాదాలు 1,159 నుండి 881 కి (24% తగ్గుదల), చిన్నపాటి ప్రమాదాలు 18,441 నుండి 10,949 (41% తగ్గుదల) కి తగ్గించడం జరిగింది.

తీర ప్రాంతాల రక్షణ ప్రణాళికలు

16. రాష్ట్రవ్యాప్తంగా తీర ప్రాంతాల పరిరక్షణకు ప్రత్యేక ప్లాన్ సిద్దం చేయడం జరిగింది. అలాగే కాకినాడ జిల్లా, పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడ బీచ్ పరిరక్షణకు DPR సిద్ధం చేయడం జరిగింది.

వన మహోత్సవం

17. అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ 5, 2025 న వన మహోత్సవం పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు కోటి మొక్కలు,రానున్న సంవత్సర కాలంలో 5 కోట్ల మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

18. విద్యార్థులకు స్కూల్ దశ నుండే సైన్స్ పట్ల ఆసక్తి కలిగించేలా స్పేస్ కిడ్స్ ఇండియా సంస్థ ప్రతినిధులతో చర్చించారు.

సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం

19.విద్యార్థులకు అంతరిక్ష రంగంపై అవగాహన పెంపొందించేందుకు స్పేస్ పార్క్ ఏర్పాటు చేసే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
20.రష్యాకు చెందిన ప్రముఖ వ్యోమగామి శ్రీ సెర్గి కోర్సకొవ్ తో పలు అంశాలపై చర్చించారు.
21.జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా శ్రీహరికోట లోని ఇస్రో షార్ అంతరిక్ష కేంద్రంలో జరిగిన వేడుకల్లో అతిథిగా పాల్గొని శాస్త్రవేత్తలతో పలు అంశాలపై చర్చించారు.
22.శ్రీహరికోట వైపు వెళ్లే 17 కిలోమీటర్ల మేర రోడ్డు దెబ్బతిన్న విషయం దృష్టికి రాగానే ఐదు రోజుల్లో సమస్యను పరిష్కరించారు.
23.క్యాంపు కార్యాలయంలో ఇస్రో విజయాలను గుర్తు చేసుకునేలా మినీయేచర్ శిల్పాలు చిత్రాలతో మ్యూజియం తరహా ఏర్పాటు చేయడం జరిగింది.
24.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సైన్స్ & టెక్నాలజీ కౌన్సిల్ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర హకారంతో సైన్స్ గ్యాలరీ, మినీ ప్లానిటోరియం, సైన్స్ పరికరాలు, ప్రముఖ శాస్త్రవేత్తల విగ్రహాలు, రోబోటిక్స్ & వర్క్ షాప్ మరియు ఆడిటోరియం సదుపాయాలతో రాజమండ్రిలో సబ్ రీజినల్ సైన్స్ సెంటర్ ప్రారంభించడం జరిగింది. ఇది గోదావరి జిల్లాలు, అల్లూరి సీతారామరాజు జిల్లా విద్యార్థులకు ఎంతో ఉపయోగపడనుంది.

ఉప ముఖ్యమంత్రిగా నిర్విరామంగా భాద్యతలు

25. ఒకవైపు మంత్రిత్వ శాఖలను అధికార యంత్రాంగంతో సమన్వయం చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తూ, మరోవైపు ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్ర పరిపాలనలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి చేదోడుగా ఉంటూ ఎప్పటికప్పుడు సమర్థవంతమైన పాలన అందించేందుకు మంత్రులు, ఎంఎల్ఎ లు, అధికారులతో సంప్రదింపులు జరుపుతూ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.
26. 9 నెలల క్రితం తప్పిపోయిన ఆడబిడ్డను పవన్ కళ్యాణ్ ఆదేశాలతో 9 రోజుల వ్యవధిలో ఆచూకీ కనిపెట్టడం, అక్రమంగా దేశం దాటుతున్న బియ్యాన్ని పౌర సరఫరాల శాఖ సమన్వయంతో అడ్డుకోవడం, గంజాయి పై ఉక్కుపాదం మోపేలా హోమ్
శాఖ తో సమన్వయం, సనాతన సాంప్రదాయాలు కాపాడేలా దేవాదాయ శాఖతో సంప్రదింపులు, రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర పెద్దలతో చర్చలు జరుపుతూ, ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలపై స్పందిస్తూ కర్తవ్య నిర్వహణ సాగిస్తున్నారు.

ఏడాది కాలంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యక్తిగత హోదాలో ప్రజలకు అందించిన విరాళాల వివరాలు

1. గత సెప్టెంబర్ నెలలో రాష్ట్రంలో సంభవించిన వరదల కారణంగా జరిగిన నష్టానికి చలించిన ఆయన 6 కోట్ల రూపాయలను వరద సహాయ కార్యక్రమాలకు విరాళంగా ప్రకటించారు.
• ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి 1 కోటి విరాళం
• తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి 1 కోటి విరాళం
• వరదల కారణంగా నష్టపోయిన 400 గ్రామ పంచాయతీలకు 4 కోట్ల రూపాయలు విరాళం ( ఒక్కో పంచాయతీకి లక్ష రూపాయల సాయం)
2. రైల్వేకోడూరు నియోజకవర్గంలోని, మైసూరావారిపల్లి గ్రామంలో విద్యార్థులకు ఆటస్థలం ఏర్పాటు చేసేందుకు 60 లక్షలతో భూమిని కొని గ్రామానికి అందించారు.
3. తలసేమియా రోగులకు సహాయపడేందుకు NTR ట్రస్ట్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని 50 లక్షల విరాళం అందించారు.
4. కర్నూలు జిల్లా లో తన ఇంటి పేరు మీద ఉన్న కొణిదల గ్రామ అభివృద్ధి కోసం 50 లక్షల విరాళం అందించారు.
5. ఇటీవల జమ్మూ & కాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిలో మరణించిన సోమిశెట్టి మధుసూదన రావు గారి కుటుంబానికి 50 లక్షల సాయం అందించారు.
6. అదే విధంగా ఉగ్రవాదులతో ఆపరేషన్ సింధూర్ లో పాల్గొని యుద్ధంలో అమరుడైన పుట్టపర్తి జిల్లాకు సంబంధించిన అగ్నివీర్ జవాన్ మురళి నాయక్ కుటుంబానికి 25 లక్షల ఆర్ధిక సాయం అందించారు.
7. విజయనగరం జిల్లా గుర్ల గ్రామంలో కలుషిత త్రాగునీటి కారణంగా డయేరియాతో చనిపోయిన 11 మందికి లక్ష రూపాయల చొప్పున 11 లక్షల ఆర్థిక సాయం అందించారు
8. అల్లూరి సీతారామరాజు జిల్లా, అనంతగిరి మండలం, కోరపర్తి గ్రామ MPP స్కూల్ అభివృద్ధికి 8 లక్షల విరాళం అందించి పూర్తిచేశారు.
9. పిఠాపురం శ్రీ పాద గయ క్షేత్ర అభివృద్ధికి, బయో టాయిలెట్ల ఏర్పాటు కోసం 6.84 లక్షల విరాళం.

10. తనపై ఎంతో ప్రేమ చూపించిన అరకు నియోజకవర్గం కురుడి గ్రామ అభివృద్ధి కోసం 5 లక్షల విరాళం

11. చదువులో ప్రతిభ చూపించి MBBS సీట్ సాధించిన పిఠాపురం నియోజకవర్గం, నవఖండ్రవాడ గ్రామానికి చెందిన పేద విద్యార్థినికి 4 లక్షల ఆర్ధిక సాయం.
12. కాకినాడ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు విద్యార్థుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున 4 లక్షల ఆర్ధిక సాయం.
13. పిఠాపురం నియోజకవర్గంలోని 42 మంది అనాధ పిల్లల బాధ్యతలు చూసుకోవడానికి తనకు ప్రభుత్వం నుండి వచ్చే జీతాన్ని ప్రతీ నెల ఒక్కొక్క విద్యార్థికి 5 వేల చొప్పున 2.10 లక్షలు, మిగిలిన జీతం వారి బాగోగుల కోసం అందించారు.
14. విశాఖపట్నం కు చెందిన సూరద ధనాయమ్మ అనే మత్స్యకార మహిళకు 1 లక్ష రూపాయల ఆర్ధిక సాయం. 

15. తన విజయం కోసం ప్రార్థనలు చేసి అభిమానాన్ని చూపించిన పోతుల పేరంటాలు అనే మహిళకు 1 లక్ష రూపాయల ఆర్ధిక సాయం.

అంచనాలకు ఆమడ దూరంలో జనసేనాని?: అక్షర సందేశం

Spread the love