కాపు కాసేది పాలక పెద్దలకా లేక పేదలకా?
మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) కొత్త పార్టీ (New Political Party) దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తున్నది. రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయం (Third alternative) దిశగా ముద్రగడ (Mudragada0 ఆలోచన చేస్తున్నట్లు వార్తలు అందుతున్నాయి. దళిత సంఘ (Dalit sangham) రాష్ట్ర నేత డాక్టర్ ఆర్.యస్ రత్నాకర్, శెట్టి బలిజ సంఘం రాష్ట్ర నేత కుడుపూడి సూర్య నారాయణ ముద్రగడని కలిసి ఆదివారం ముద్రగడ నివాసంలో మంతనాలు జరిపారు.
భావసారూప్యం ఉన్న కులసంఘాలతో కలిపి ముద్రగడ పార్టీ పెడతారు అనే ఊహాగానాల మధ్య నిన్నటి సమావేశం కావడం విశేషం.
గతంలో ముద్రగడ జానారెడ్డి, కే ఈ కృష్ణ మూర్తితో తెలిసి తెలుగునాడు పార్టీ (Telugunadu Party) పెట్టి, వెను వెంటనే దాన్ని మూసేసిన సంగతి తెలిసిందే.
ఆంధ్రాలో రాజకీయంగా గెలుపు ఓటముల్లో సామాజిక సమీకరణాలదే కీలక పాత్ర అనేది తెలిసిందే. అందునా గోదావరి జిల్లాల్లో మెజార్టీ సీట్లు సాధించుకుంటేనే ఏపీలో అధికారం దక్కేది. కాపు ఉద్యమ నేత (Kapu Udyamam Leader), సీనియర్ రాజకీయ నాయకుడు ముద్రగడ పద్మనాభవం కొత్త పార్టీ ఏర్పాటు దిశగా కసరత్తు చేయడం కొత్త కాదు. కొద్ది రోజుల క్రితం వరకు కాపులను బీసీల్లో (BC) చేర్చాలనే డిమాండ్’తో ఆయన ఉద్యమానికి నాయకత్వం వహించారు. కానీ, కొంత కాలం క్రితం నాయకత్వం నుంచి తప్పుకున్నారు. నేడు కొత్త పార్టీతో వస్తున్నారు అనే వార్తలు వస్తున్నాయి. అయన నిర్ణయాలు ఒక పట్టాన అర్ధం కావు. అదే అయన బలం. అదే ఆయన బలహీనత .
కాంగ్రెస్’లో (Congress) ఉన్న కొంతమంది పెద్దల సహకారంతో పార్టీ యోచలో ఉన్నట్లు ఒకరకమైన ఊహాగానాలు వస్తున్నాయి. కాదు కాదు బీజేపీలో (BJP) ఉన్న పెద్దల సహకారంతో అని మరోరకంగా కధనాలు వస్తున్నాయి. అదికాదు వైసీపీకి సహాయం చేయడం కోసమే పార్టీ యోచనలో ముద్రగడ ఉన్నారు అనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఏది ఏమైనా జనసేనకు (Janasena) వ్యతిరేకంగానే పార్టీ యోచనలో కొంతమంది ముద్రగడ ఉన్నట్లు విశ్లేషకుల వాదిస్తున్నారు.
అణగారిన వర్గాల ఓటు బ్యాంకుని విడదీసే విధంగా ముద్రగడ?
ముద్రగడ లాంటి అనుభవజ్ఞులు తన జాతి ప్రయోజనాలకు (Kapu) వ్యతిరేకంగా పార్టీ పెట్టి చెడ్డ పేరు తెచ్చికొంటారు అని అనడం గాని… అవసాన దశలో ఆయన అపఖ్యాతి మూటగట్టుకొంటారు అని భావించడం కూడా సరికాదు. అయన నిర్ణయాలు అణగారిన వర్గాల రాజ్యాధికారానికి (Rajyadhikaram) అనుకూలంగా ఉంటాయా? లేదా పాలకుల కుట్రలకు సానుకూలంగా ఉంటాయా అనేది కూడా నేడు కీలకంగా మారింది. అయితే అణగారిన వర్గాల ఓటు బ్యాంకుని విడదీసే విధంగా ముద్రగడ అడుగులు వేయరని ముద్రగడ అభిమానులు భావిస్తున్నారు.
అయితే ముద్రగడ పెట్టబోయే పార్టీ నిజమైతే, అది ఆ రెండు పాలక పార్టీలకు ప్రత్యామ్నాయంగా నిలుస్తుందా? లేక జనసేన పార్టీని (Janasena Party) అడ్డుకోవడం కోసమే వస్తున్న పార్టీగా ముద్ర వేసికొంటుందా అనే దానికి కాలమే సమాధానం చెప్పాలి.