Pawan KalyanPawan Kalyan

“అక్కడ అమ్మాయి (టీడీపీ) ఇక్కడ అబ్బాయి (కాంగ్రెసు)” రహస్య ఒప్పందములో భాగముగా తెలుగు తల్లిని విడగొట్టి నడి రోడ్డున పడేసిన భాధలొంచి పుట్టిన “జనసేన (Janasena)”. (Pawan Kalyan)

పచ్చకులంలో ఉన్న రావణుడిని “గోకులంలో సీత” అంత ప్రవిత్రుడు అని భ్రమించి మద్దతునిచ్చి పచ్చ పార్టీకి వెన్నంటి నిలిచింది.

తొలిసారి స్వతంత్రముగా పార్టీపెట్టిన “తమ్ముడు” “బద్రి” ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథము పడుతూ “తోలి ప్రేమ” చూపుతూ అండగా నిలబడి చంద్రన్నకి అధికారము ఇచ్చారు.

జనసేనుని అండతో వచ్చిన అధికారంతో “ఖుషీ”గా ఉన్న బాబు జనసేనుడిని “జానీ” జానీ ఎస్ పాపా అనే రాజకీయము తెలియని పిల్లాడిలా చూస్తూ అమాయకపు ప్రజలను, వారి సమస్యలను ప్రభుత్వము నిర్లక్ష్యము చేయడము మొదలు పెట్టింది.

“గోపాలా గోపాలా” మమ్ము ఆదుకోవయ్యా అంటూ రాష్ట్ర నలుమూలలనుండి వస్తున్న ప్రజలకు మద్దతుగా జనసేనుడు వస్తున్నప్పుడు…

మా “బాలు” “బంగారము” అని స్తుతిస్తూ ఉంటే “అజ్ఞాతవాసి”గానే ఉంటాడు అని పచ్చ బాబు (Chandra babu) భావించి నిద్రపుచ్చడానికే ప్రయత్నము చేస్తూ ఉండేవాడు.

శారీరకంగా, మానసికముగా ప్రజలని బాధిస్తూ, “జల్సా” చేసికొంటున్న ప్రభుత్వానికి వ్యతిరేకముగా “శంకర్ దాదా జిందాబాద్” వలె తిరిగబడతాడు అని చంద్రన్నగాని చంద్రన్న మీడియా (Pacha Media) గాని ఊహించలేదు.

తన సుఖాలను మరిచి, ప్రజల కష్టాలనే తలుచుకుంటూ, వేదనతో, ఆవేదనతో గుంటూరు సభలో “కొమరం పులి” వలె జనసేనుడు “పంజా” విసిరి పాతుకుపోయిన బాబుని, అతని పరివారాన్ని “తీన్ మార్” డాన్స్ చేపించాడు.

“అజ్ఞాతవాసి”గా ఉంటాడు అనుకొన్న “కాటమరాయుడు” “గుడుంబా శంకర్”వలె చెలరేగిపోతూ, “గబ్బర్ సింగ్” (Gabbar Singh) వలె అవినీతి ప్రభుత్వ పాపపు చిట్టాలను విప్పుతూ తన అప్రతిహత యాత్ర కొనసాగించాడు.

మరొక పక్క “కెమెరామెన్ గంగతో రాంబాబు”లా పాలిత, ప్రతిపక్షాల జాతకాలను బయటపెడుతూ జిల్లాలు తిరుగుతున్న”జనసేనుడు” ఇంతితై వటుడింతై అన్నట్లు నానాటికి పెరుగుతుండడముతో “కాటమ రాయుడు” (Katamarayudu) పార్టీపై వివిధ నాయకుల, ప్రజల చూపులు ఎక్కువ అయ్యాయి.

“అత్తారింటికి దారేది” అన్నట్లు “జనసేన పార్టీకి దారేది” అంటూ సమస్త జనులు, నాయకులు, పార్టీలు “జనసేన” పార్టీవైపు దారి కట్టారు.

నగదు బదిలీ, ఉచిత గ్యాసు, మహిళా రిజర్వేషను అనే హామీలతో “అన్నవరం”లిస్తూ చేస్తున్న అప్రతిహత యాత్ర, మరింత దూకుడుతో కొనసాగిస్తారని, సీఎం కుర్చీ అధిరోహిస్తారని అప్పుడు రాజకీయాల్లో మార్పు తీసికొస్తారని జనసైనికులంతా ఎదురుచూస్తుండగా, అదే మాకు “అన్నవరం” అంటూ జనమహిళలు “సుస్వాగతము” చెబుతున్నారు. “పవరున్న స్టార్” (Power Star) వ్యవస్థలను ప్రక్షాళన చేసిన రోజున, “కళ్యాణవంతమైన పవనాలతో” ఆరోజు ప్రతీరోజు ప్రతిఒక్కరికి పుట్టిన రోజు (Pawan Kalyan Birthday) పండుగనే.

ఆలోచించండి!!! మన పిల్లల భవితకోసం మార్పుకు మద్దతునిద్దాము