కాపు రిజర్వేషన్ల అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తిన జీవీఎల్!
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) కాపు (Kapu), బలిజ (Balija), ఒంటరి (Ontari), తెలగ (Telaga) కులాలకు ఓబీసీ రిజర్వేషన్లను (OBC Reservations) వెంటనే అమలు చేయాలని బీజేపీ (BJP) ఎంపీ (MP) జీవీఎల్ నరసింహరావు (G V L Narasimha Rao) డిమాండ్ చేశారు. రాజ్యసభలో (Rajya Sabha) జీరో అవర్’లో కాపు రిజర్వేషన్ (Kapu Reservation) అంశాన్ని జీవీఎల్ (GVL) ప్రస్తావిస్తూ ప్రసంగించారు. ఏపీలోని జగన్ ప్రభుత్వం చొరవ తీసికొని తక్షణమే కాపులకు రిజర్వేషన్లను అమలు చెల్లని కోరారు.
బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు రాజ్యసభలో చేసిన ప్రసంగంలోని ముఖ్యంశాలు:
ఏపీలో కాపు, బలిజ, తెలగ, ఒంటరి తదితర కులాలు సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడి ఉన్నారు.
ఈ కాపులు ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధికి విశేషమైన విశేష కృషి చేశారు. కానీ ఏపీ జనాభాలో 18% ఉన్న కాపులకు అభివృద్ధి ఫలాలు నేటికీ అందడం లేదు.
బ్రిటిష్ కాలం నుండే కాపులకు రిజర్వేషన్లు
కాపులను వెనుకబడిన తరగతులుగా బ్రిటిష్ పాలనలో పరిగణించారు (1915 జిఓ నెం.67 ప్రకారం) కానీ 1956లో శ్రీ నీలం సంజీవ రెడ్డి (Neelam Sanjeeva Reddy) రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీ జాబితా (BC List) నుండి కాపు తదితర కులాలను తొలగించారు అని జీవీఎల్ వివరించారు.
1956 నుండి కూడా కాపులు అధికారానికి దూరంగా ఉన్నారు. రాజకీయంగా, అధికారం లేదన్న కారణంగా అన్ని ప్రభుత్వాలు కూడా కాపులకు అన్యాయం చేశాయి అని జీవీఎల్ అన్నారు.
విద్యాపరంగా, సామాజికంగా ఆర్థికంగా బలహీనంగా ఉన్న కాపులు రిజర్వేషన్ల కోసం ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూనే ఉన్నారు. దశాబ్దాలుగా ఏపీలో కాపు రిజర్వేషన్ల కోసం తీవ్ర రాజకీయ ఆందోళనలు (Political Power) చేస్తూనే వున్నారు అని జీవీఎల్ విశదీకరించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని విద్యాసంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో కాపులకు 5% రిజర్వేషన్లను
2017లో అప్పటి ప్రభుత్వం కల్పించింది. ఆంధ్రప్రదేశ్ కాపు రిజర్వేషన్ బిల్లు, 2017 పేరుతో ఏపీ రాష్ట్ర అసెంబ్లీ (AP Assembly) ఒక బిల్లును కూడా ఆమోదించింది అని జీవీఎల్ వివరించారు.
ఏపీ ప్రభుత్వానిదే బాధ్యత
రాష్ట్రంలో విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులను గుర్తించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంది. అయినప్పటికీ కాపు రిస్సేర్వేషన్ బిల్లు (Kapu Reservation Bill) ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వానికి (Central Government) పంపారు. ఇది అనవసరం. కేంద్ర ప్రభుత్వ అనుమతి అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం (State Government) దీనిపై తనంతట తానుగా చర్య తీసుకోవచ్చు. కాపు తదితర కులాలకు రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వమే కల్పించ వచ్చు అని జీవీఎల్ తెలిపారు.
ముస్లిం రిజర్వేషన్ బిల్లును (Muslim Reservation Bill) నాటి ఏపీ ప్రభుత్వం సమ్మతి కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపలేదు. కాపుల బిల్లును మాత్రం కేంద్ర అనుమతి కోసం పంపారు. ఆ బాధ్యతను కేంద్ర ప్రభుత్వంపై మోపాలన్నదే అప్పటి ఏపీ ప్రభుత్వ ఉద్దేశం అని తెలుస్తున్నది అని బీజేపీ ఎంపీ వివరించారు.
కాపులకు 1956 నుంచి రాజకీయంగా అధికారం లేదన్న కారణంగా అన్ని ప్రభుత్వాలు కాపులకు అన్యాయం చేస్తూనే వచ్చాయి. కానీ కాపు సామాజికవర్గానికి (Kapu caste) చెందిన ఇద్దరిని ఏపీ రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షులుగా నియయించింది. ఆవిధంగా బీజేపీ కాపుల పట్ల ఉన్న తన నిబద్ధతను బీజేపీ చాటుకుంది అని జీవీఎల్ అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో కాపులకు రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. అలా చేయకపోతే రాష్ట్ర ప్రజల ఆగ్రహాన్ని ఏపీ ప్రభుత్వం చూడవలసి వస్తుంది అని జీవీఎల్ హెచ్చరించారు.
Good ……kapu ni cm cheste tappa ee korika tiradu
Good…when kapu cm ….it will be happens
Auto driver
Super ????