Pantham Nanaji Press meetPantham Nanaji Press meet

పవన్ కళ్యాణ్’ని విమర్శించడమే మంత్రులకు పని
ఉన్నది తమ శాఖ విధులు ఏంటో తెలియని మంత్రులు
ఆంధ్రా థానోస్ జైలుకు వెళ్లే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి
మంత్రి దాడిశెట్టి రాజా దొంగ బంగారం వ్యాపారం,
గంజాయి స్మగ్లింగ్ గురించి అందరికీ తెలుసు
విలేకరుల సమావేశంలో జనసేన పార్టీకి చెందిన పంతం నానాజీ

కల్తీ మద్యం (Spurious Liquor), భూ కబ్జాలు (Land Mafia), ఇసుక దోపిడీ (Sand Mafia), పోలీస్ కేసులు (Police Cases), పన్నుల బాదుడు (Heavy taxes), అప్పుల కుప్పలు (Heavy Loans), నిరుద్యోగ భారం (Un-employement), గుంతల రోడ్లు (No Roads), బూతుల తిట్లు (Bad Language) అనే నవ రత్నాలనే (Nava ratnalu) ప్రజలకు వైసీపీ (YCP) ఇస్తున్నది. ఈ అద్భుతమైన నవరత్నాలను మాత్రమే ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం ప్రజలకు బహుమతి గా ఇస్తోందని జనసేన పార్టీ (Janasena Party) రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు పంతం నానాజీ (Pantham Nanaji) వ్యాఖ్యానించారు. వైసీపీ అమలు చేస్తున్న నవ అరాచకాలు (Nava arachakalu), దౌర్జన్యాలనే నవరత్నాలు (Nava Ratnalu) అని అనుకుంటూ భ్రమ పడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రజలు అభివృద్ధి అంటే ఏమిటో ఎప్పుడో మర్చిపోయారని ఆయన చెప్పారు. కాకినాడలో మంగళవారం పంతం నానాజీ విలేకరులతో మాట్లాడారు.

ఈ సందర్భంగా పంతం నానాజీ మాట్లాడుతూ “రాష్ట్ర క్యాబినెట్లో ఒక్క మంత్రికి కూడా తాను నిర్వహిస్తున్న శాఖ ఏమిటో తెలీదు. ఆ శాఖ విధులు, బాధ్యతలు ఏమిటి అన్నది కూడా అవగాహన లేదు. శాఖల మీద పట్టు పూర్తిగా శూన్యం. ఉన్న మంత్రులు ఉండటం రాష్ట్ర ప్రజల దురదృష్టం. తమ పాలన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎదుటి వారి మీద పడి ఏడవడం వీరికి అలవాటు. పవన్ కళ్యాణ్’కి (Pawan Kalyan) జనంలో పెరుగుతున్న ఆదరణ చూసి మంత్రులకు పిచ్చెక్కుతోంది. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో రకరకాల పిచ్చిపిచ్చి ఆరోపణలు చేసి, చంకలు గుద్దుకుంటున్నారు అని నానాజీ ఆరోపించారు.

తునిలో దాడిశెట్టి రాజా నవరత్నాలు వేరు

పవన్ కళ్యాణ్ ఏదైనా ఒక మంచి పని చేస్తుంటే – చెత్త మీద పన్నులేసే చెత్త బ్యాచ్ ఒకటి తయారై చెత్త వాగుడు వాగుతోంది. ఆ చెత్త బ్యాచ్’లో మంత్రి దాడిశెట్టి రాజా (Dadisetty Raja) ఒకరు. తునిలో మీరు చేస్తున్న దొంగ బంగారం వ్యాపారం, గంజాయి వ్యాపారం మాటేమిటి? నవరత్నాలు అంటే దొంగ బంగారం, గంజాయి, మద్యం, శాండ్ మాఫియా, కబ్జాలు, నకిలీ విత్తనాలుగా అర్ధం మార్చేసిన చెత్త బ్యాచ్ రాజాది అని పంతం నానాజీ ఆరోపించారు.

మీరెన్ని మాటలు చెప్పినా మేము ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలతో ముందుకు వెళుతూనే ఉంటాం. వారి తరుపున పోరాడుతూనే ఉంటాం. మొన్నటి వరకు వైసీపీలో మొరిగిన బ్యాచ్ వెళ్లి… ఇప్పుడు కొత్త బ్యాచ్ దిగింది. ఆయా పరిస్థితులను బట్టి కొత్త బ్యాచ్లు దింపడం వైసీపీకి అలవాటే. ఇలాంటి వారి మొరుగుళ్లకు మేం భయపడేది లేదు. వీరిని గడపగడపకు వెళ్తుంటే ప్రజలే తరిమి తరిమి కొడుతున్నారు అని పంతం నానాజీ ఆరోపించారు.

కాకినాడ రూరల్’లో (Kakinada Rural) ఉన్న ఇండస్ట్రీలు అన్ని రాబోయే పది రోజుల్లో తమ పరిశ్రమల్లో భద్రతా పరమైన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయకపోతే జనసేన పోరాటానికి సిద్దమవుతుంది. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు సూట్ కేస్’లు జాగ్రత్తగా దాచుకో వాలి. లేదంటే మళ్ళీ ఏదో ఒక టీమ్ వచ్చి సూట్ కేసులు పట్టుకుపోతారు అని నానాజీ ఆరోపించారు.

వైసీపీకి కార్యాలయం ఎందుకు? చంచల్ గూడ జైలు ఉందిగా..!

ఈ ముఖ్యమంత్రి ఎంత కాలం బయట ఉంటారో అర్థం కాని పరిస్థితి వైసీపీ నాయకులది (YCP Leaders). రోజుకో కొత్త స్కామ్’లో రాష్ట్ర నాయకుల పేర్లు బయటకు వస్తున్నాయి. నరరూప రాక్షసుడు (Rakshasa) థానోస్ (Thanos) రాష్ట్రంలో బయటే తిరుగుతున్నాడు అని ప్రజల భయపడుతున్నారు. మా పార్టీ అధికారికంగా బీజేపీతో (BJP) కలిసి పయనిస్తోంది. కానీ వైసీపీ మాత్రం రహస్యంగా దానిని కొనసాగిస్తోంది. ఆంధ్ర థానోస్ ఇంకా ఎక్కువ కాలం బయట ఉండడు. అతడికి జైలే గతి. కాబట్టి వైసీపీ కార్యాలయాలను ఆయా జైళ్లకు మార్చుకోవడం ఉత్తమం అని నానాజీ హెద్దేవా చేసారు.

విశాఖపట్నంలో ఓడిపోయిన ముఖ్యమంత్రి (Chief Minister) తల్లిని కూడా వైసీపీ మంత్రులు (YCP Ministers) అవహేళన చేస్తున్నారు. ఓడిపోయారు అంటూ ప్రతిసారి ఆమెను నొప్పిస్తున్నారు. 151 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చిన పాపానికి పాలన పూర్తిగా మర్చిపోయిన వైసీపీ నాయకులు, ప్రజలకు మంచి చేసే వారిపై దిగజారి మాట్లాడి మరింత ప్రజల్లో చిన్నబోతున్నారు. గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో వీరికి పడుతున్న చెప్పు దెబ్బలు, చీపురు దెబ్బలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈసారి జనం వద్దకు ఓటు వేయమని వెళితే కచ్చితంగా వీరికి మూడినట్లే. రాష్ట్ర ప్రజలంతా వైసీపీని తరిమికొట్టడానికి, వైసీపీ విముక్త ఆంధ్ర ప్రదేశ్ ను చూడడానికి సిద్ధంగా ఉన్నారు” అని పంతం నానాజీ తీవ్రమైన ఆరోపణలు చేసారు.

దీనిపై వైసీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Special Poojas at Maddi Anjaneya Swamy temple

Spread the love