గుడివాడలో మెరుగైన రోడ్డు ఒక్కటైనా చూపించగలరా?
సొంత ఇల్లు ఉన్న వీధికి కూడా రోడ్డు వేయించలేదు
అన్ని రాష్ట్రాల్లో 10 శాతం రోడ్లు బాగోవు…
మన దగ్గర 10 శాతం మాత్రమే బాగుంటాయి
గుడ్ మార్నింగ్ సీఎం సార్ అనగానే సీఎం వెన్నులో వణుకు
గుడివాడ విలేకరుల సమావేశంలో బూరగడ్డ శ్రీకాంత్
‘ఏ రాష్ట్రంలో అయినా రోడ్లు (AP Roads) 10 % మేర అధ్వానంగా ఉంటాయి.. కానీ మన రాష్ట్రంలో మాత్రం 10 శాతం మేర మాత్రమే రోడ్లు (Roads in AP) బాగుంటాయి. ఈ విషయాన్ని ప్రభుత్వానికి తెలపడం కోసమే జనసేన పార్టీ (Janasena Party) ఆధ్వర్యంలో గుడ్ మార్నింగ్ సీఎం సార్ కార్యక్రమాన్ని నిర్వహించామని గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు (Janasena Party Leaders) బూరగడ్డ శ్రీకాంత్ అన్నారు.
ఈ వాస్తవాన్ని జీర్ణించుకోలేక వెన్నులో వణుకు పుట్టిన వైసీపీ (YCP) అధినేత తన బూతుల ఎమ్మెల్యే కొడాలి నానితో అవాకులు చవాకులు పేలిస్తున్నారు అని శ్రీకాంత్ వ్యాఖ్యానించారు. గుడివాడలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “గత మూడు సంవత్సరాలుగా అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్లు, సలహాదారులు ముఖ్యమంత్రికి (Chief minister) గుడ్ మార్నింగ్ సీఎం సార్ అని చెప్పి ఉండవచ్చు. మూడు రోజులపాటు జనసేన (Janasena) పార్టీ చేపట్టిన గుడ్ మార్నింగ్ సీఎం సార్ మాట వింటేనే ముఖ్యమంత్రికి (Chief Minister) వెన్నులో వణుకు పుట్టుకొచ్చింది. రాష్ట్రంలో రోడ్లు పరిస్థితిని జనసేన పార్టీ కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నా, ఈ ప్రభుత్వంలో చలనం లేదు. దబాయింపులు, బూతులు తప్ప వైసీపీ నాయకులకు మరో పని లేదు అని బూర్లగడ్డ శ్రీకాంత్ దుయ్యబట్టారు.
కొడాలి ఎన్ని రోజులు గుడివాడలో ఉంటారు?
మాట్లాడితే పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హైదరాబాదులో ఉంటారని చెప్పే గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని (Kodali Nani) ఎన్ని రోజులు నియోజకవర్గంలో ఉంటున్నారో కోడలి నాని చెప్పగలరా? నాని తన కుటుంబాన్ని హైదరాబాదులో ఎందుకు పెట్టారో కూడా చెప్పగలరా? నిత్యం హైదరాబాదులో గడిపే కొడాలి నాని కూడా పవన్ కళ్యాణ్ ‘ని అనడం ఏమిటి? కోడలి నాని పవన్ కళ్యాణ్ గురించి అనడానికి ఏ మాత్రం సరిపోరు శ్రీకాంత్ తెలిపారు.
మేము అడిగిన రోడ్ల పరిస్థితి మీద సమాధానం చెప్పండి. గుడివాడ నియోజకవర్గంలో ఏ రోడ్డు బాగోలేదు. ఆఖరికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని గుడివాడ లోఇల్లు ఉండే రాజేంద్రనగర్ రోడ్డు కూడా అత్యంత దారుణంగా ఉంది. గుడివాడలో ఏ రోడ్డయినా మెరుగ్గా ఉందా? బాగుంది అని ఒక్క రోడ్డు చూపించినా మేం గుడివాడ వదిలి వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. అస్తవ్యస్తంగా అధ్వానంగా ఉన్న రోడ్ల సమస్య మీద మాట్లాడమంటే వ్యక్తిగత దూషణలు తప్ప మీకు పాలన చేతకాదునా అని బూర్లగడ్డ శ్రీకాంత్ సూటిగా ప్రశ్నించారు.
బ్లాక్ మద్యం మాఫియా నాయకుడు ఎవరు?
ఎంతో గొప్పగా నవరత్నాలు (Nava Ratnalu) అమలు చేశామని కోడలి నాని చెబుతున్నారు. ప్రతి సంవత్సరం అదే నవరత్నాల లబ్ధిదారుల (beneficiaries list) సంఖ్యను ఎందుకు తగ్గిస్తున్నారో చెప్పగలరా? రూ.100 ఉండే మద్యం క్వార్టర్ బాటిల్ రూ.300లకు పెంచేసి ఎందుకు అమ్ముకొంటున్నారో చెప్పగలరా? కల్తీ మద్యం మరణాలు రోజువారి చోటు చేసుకుంటున్నా ఈ ప్రభుత్వానికి పట్టడం లేదు. యథేచ్చగా కల్తీ మద్యం అమ్ముతూ ఎందరో మృతికి కారణం అవుతున్న ఈ ప్రభుత్వం చేస్తున్న హత్యలను కచ్చితంగా ప్రశ్నిస్తాం అని శ్రీకాంత్ స్పష్టం చేసారు.
నాని! ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమి అయ్యాయి?
ఎన్నికలవేళ ఎన్నో హామీలు ఇచ్చిన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని వాటిని పూర్తిగా మర్చిపోయారు. విజయవాడ-బందరు రోడ్డు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఫ్లైఓవర్ ప్రారంభం అన్నారు ఇప్పటివరకు అది లేదు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీను నెరవేర్చని మీరు పవన్ కళ్యాణ్’ని విమర్శించడానికి ఏమాత్రం సరిపోరు. మీ ప్రభుత్వం అన్ని మాఫియాలను అణచివేయడంలో విఫలం అయ్యింది. దానిమీద చర్చిద్దాం ముందుకు రండి అని శ్రీకాంత్ అన్నారు.
మట్టి మాఫియా (Matti mafia), ఇసుక మాఫియా (Sand Mafia), రేషన్ బియ్యం మాఫియా (Ration Rice mafia), విద్యుత్ ఛార్జీలు (Electricity prices), బస్సు ఛార్జీలు (Bus ticket rates), ఇంటి పన్ను (Property taxes) పెంపు, చెత్త పన్ను (Chetha tax) గురించి కూడా మాట్లాడదాం రండి. మీ పార్టీ తట్టెడు మట్టి రోడ్డుపై పోయదు. కానీ తట్టెడు కేసుల్లో ఉన్న నాయకుల్ని జనసేనపైకి ఉసిగొల్పుతుంది. నీతి నిజాయితీ ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ ‘ని (Honest leader) విమర్శిస్తే ప్రజలే తగిన విధంగా బుద్ధి చెబుతారు జాగ్రత్త ” అని బూర్లగడ్డ శ్రీకాంత్ హెచ్చరించారు.