Pawan and babuPawan and babu

అణగారిన వర్గాలకు (Suppressed Classes) అధికార సాధన
కోసం సేనాని (Janasenani) పెట్టుకొన్న పొత్తులు
ఉభయులకూ అవసరం.
మన రాజ్యాధికార (Rajyadhikaram) సాధనకు పొత్తులు అవసరం.

అందుకే పొత్తులు తప్పు కాదు.
అయితే ఆ పొత్తుల వల్ల జనసేనపార్టీకి (Janasena Party)
కలిగే ప్రయోజనం ఏమిటి అనేది వివరించి
చెప్పలేక పోవడమే అనుమానాలకు తావిస్తున్నది.

అలానే…

బ్రహ్మ రాకాసి పార్టీ అంతానికి పొత్తులు అవసరం
అని జనసైనికులు కూడా తెలిసికోలేక
పోవడం కూడా ఆవేదన కలిగిస్తున్నది.
వారిని ఆక్రందన వైపు నడిపిస్తున్నది.
కొందరిని కన్నీళ్లతో అలక పానుపు ఎక్కిస్తున్నది

వెరసి సస్పెన్షన్ కి దారితీపిస్తున్నది.
శివసైనికులు లాంటి కొందరి జనసైనికులను కూడా
దూరం పెట్టాల్సిన పరిస్థితి వస్తున్నది.
పార్టీ క్రమశిక్షణకు ఇది అవసరమే కావచ్చు.

కానీ ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి…

సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే వచ్చి
బాబుకు మద్దతు నివ్వండి అని
చెప్పినా బాబుకి మద్దతు ఇచ్చే పరిస్థితులు కొన్ని వర్గాల్లో నేటికీ లేవు.

బాబు చేసిన పాపాలు, కుల పెద్దలు రేపిన వైషమ్యాలు
అలానే మనోహరమైన చైనా గోడలు
అన్నీ కూడా దీనికి కారణమే. అందరూ కారకులే.

కమ్మ వ్యతిరేకుల్లో సమూల మార్పుకి మరికొంత సమయం పడుతుంది.
పవనేశ్వరుడి మీద ప్రేమ-బాబు మీద ఉన్న అనుమానం
రెండూ నిజమే. అక్షర సత్యాలే. అయితే
రగిలిపోతున్న కొంతమంది కమ్మ వ్యతిరేకుల్లో
మార్పు తేవడానికి మరికొంత నేర్పు అవసరం
నేర్పరి సంఘాలు ఏర్పాటు కూడా అవసరం.

సంయమనంతో వీరికి చెప్పగలిగితే మంచిదేమో
అంతే గాని మందలింపు ఉత్తరాలు వల్ల ఆ రాక్షస పార్టీకే లాభం.

పొత్తులు ద్వారా మనం
రాజ్యాధికారం సాధించ బోతున్నాం అని
ఆ పవనేశ్వరుడు చెప్పాల్సిన సమయం ఆసన్నం అయ్యింది.

అలానే మార్పుని కోరుకొనే ప్రతీ జనసైనికుడు కూడా నీలి-పచ్చ మీడియాల ప్రభావానికి లోనై, మన ఆశలను నీరు గార్చకండి.

ఆలోచించండి… సేనానిపై నమ్మకం ఉంచండి. రాజ్యాధికార సాధన అనేది పవన్ కళ్యాణ్ గారి వల్లనే సాధ్యం. పొత్తులు అనేవి ఆ రాజ్యాధికార సాధనకు ఒక ఉపకరణం మాత్రమే.(It’s from Akshara Satyam)

అంజనీపుత్రా! స్పష్టత కరువవుతోంది: అక్షర సందేశం