AP CM JaganAP CM Jagan

ఏపీ సీఎం జగన్ (AP CM Jagan) అవినీతి నిర్ములనకు ఏసీబీ 14400 అనే మొబైల్ యాప్’ని (ACB 14400 Mobile app) ప్రారంభించారు. గ‌తంలో ముఖ్య‌మంత్రి (Chief Minister) వైయ‌స్ జ‌గ‌న్ (YS Jagan) ఆదేశాల మేర‌కు అధికారులు ఏసీబీ యాప్‌ను త‌యారు చేశారు. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో (CM Camp office) స్పంద‌న కార్య‌క్ర‌మంపై స‌మీక్షలో భాగంగా `ఏసీబీ 14400 యాప్‌ను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప్రారంభించారు.

సీఎం జగన్ ఏమన్నారు అంటే…

ఎక్కడా అవినీతి ఉండకూడదనే మాట చాలా స్పష్టంగా మా వైసీపీ ప్రభుత్వం (YCP Government) చెబుతున్నది. ఈ దిశగా అనేక కార్యక్రమాలు చేపట్టాం. చరిత్రలో ఎప్పుడూలేని విధంగా, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రూ.1.41లక్షల కోట్ల మొత్తాన్ని ఎలాంటి అవినీతి లేకుండా, వివ‌క్ష‌, పక్షపాతం లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి అత్యంత పారదర్శకంగా జ‌మ చేశాం. ఎక్కడైనా, ఎవరైనా కూడా.. కలెక్టరేట్‌ అయినా, ఆర్డీఓ కార్యాలయం అయినా, సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీసు అయినా, మండల కార్యాలయం అయినా, పోలీస్‌స్టేషన్‌ అయినా, ఎవరైనా ఎక్కడైనా కూడా లంచం అడిగితే.. ఎవరైనా చేయాల్సింది ఈ యాప్ ద్వారా ప్రభుత్వానికి సమాచారం అందించండి అని సీఎం జగన్ (CM Jagan) అన్నారు.

ఏసీబీ 14400 యాప్‌ను మొబైల్ ఫోన్ లోకి డౌన్లోడ్‌ చేసి.. బటన్‌ ప్రెస్‌చేసి వీడియో ద్వారా కానీ, ఆడియో ద్వారా కానీ సంభాషణను రికార్డు చేయండి.. ఆ డేటా నేరుగా ఏసీబీకి చేరుతుంది. అవినీతిని నిరోధించడానికి మరో విప్లవాత్మకమైన మార్పును తీసుకువస్తున్నాం. ఏసీబీ నేరుగా సీఎంఓకు నివేదిస్తుంది. ప్రతి కలెక్టర్, ఎస్పీకి అవినీతి నిరోధంలో బాధ్యత ఉంది. అవినీతిపై ఎలాంటి ఫిర్యాదు వచ్చినా వెంటనే స్పందించి అంకితభావంతో అవినీతిని ఏరిపారేయాల్సిన అవసరం ఉంది. మన స్థాయిలో అనుకుంటే.. 50శాతం అవినీతి అంతం అవుతుంది. మిగిలిన స్థాయిలో కూడా అవినీతిని ఏరిపారేయాల్సిన అవసరం ఉంది. అవినీతి లేని పాలన అందించడం మన అందరి కర్తవ్యం. ఎవరైనా పట్టుబడితే.. కచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి అని సీఎం జగన్ వివరించారు.

అక్రమ కేసులపై డీజీపీని కలవనున్న జనసేనాని!

Spread the love