విష ప్రచారాలు చేసే కుల మీడియాపై (పచ్చ మీడియా-నీలి మీడియా) మెగా బ్రదర్, జనసేన పార్టీ పీఏసీ మెంబెర్ కొణెదల నాగబాబు విరుచుకు పడ్డారు. మీరు చేస్తున్నది జర్నలిజమా లేక బ్రోకరిజమా అని పరోక్షంగా ప్రశ్నించారు. అణగారిన వర్గాలపై పనిగట్టుకొని విష ప్రచారాలు చేస్తున్న కుల మీడియా ప్రజలకు సంజాయిషీ ఇంచుకోవాల్సిన రోజు తొందరోనే ఉన్నది అంటూ నాగబాబు హెచ్చరిక చేసారు.
కొణెదల నాగబాబు లేఖ యధాతధంగా:-
“న్యూస్ చానెల్స్ నిష్పక్షపాతంగా గా ప్రజలకి న్యూస్ అందించాలి. కానీ ఆలా కోరుకోవటం ఈ రోజుల్లో అత్యాశ అవుతుందేమో. పోనీ ఏదో ఒక రాజకీయ పార్టీ కి కొమ్ము కాయటం అనేది వాళ్ళ ఇష్టం. అది వాళ్ళ విజ్ఞత. కొంతమంది నీచ రాజకీయ నాయకులు ఏదో తప్పుడు మాటలు మాట్లాడారంటే అది వాళ్ళ నీచమైన మనస్తత్వం.
కానీ, కనీసం జర్నలిజం విలువలు (Journalistic values) కూడా లేకుండా తప్పుడు వార్తలు వండి వడ్డించే న్యూస్ చానెల్స్’నికానీ పత్రికల్నికానీ ఏ పేరుతో పిలవాలి. మీరు గుడ్డ కాల్చి మొహం మీద వేస్తే అవినీతి రాజకీయనాయకులు ఉక్కిరిబిక్కిరి అవుతారేమో. కానీ ఇక్కడున్నది నిప్పులాంటి పవన్ కళ్యాణ్. పవన్ అంటే నిప్పురా. జాగ్రత్తగా రాతలు రాయండి.
మీరు కూర్చున్న చెట్టు కొమ్మల్ని మీరే నరుక్కుంటే కింద పడి చచ్చేది మీరే జాగ్రత్త. పవన్ కళ్యాణ్ మరో 25 సంవత్సరాలు ప్రజలకోసం యుద్ధం చెయ్యగలడు. మీకు అంత ఓపిక లేదు. మీరు ఓడిపోతే జైలు ఊచలు లెక్కపెట్టే పరిస్థితి లేదిక్కడ.
బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చే నాయకులంటే మీకెంత లోకువ. ఇంకెన్నాళ్లు ప్యాకేజీ. ప్యాకేజీ అంటూ వాగి చస్తారు అదేమాట మిగిలిన రెండు పార్టీ ల నాయకులని అనడానికి మీకు దమ్ములేదు. ప్రజా సేవ కోసం వచ్చిన వాళ్ళు మా ప్రెసిడెంట్. మా లాంటి కార్యకర్తలు ఇలాంటి మాటలని పడతాం. మా ప్రెసిడెంట’ని కార్యకర్తలని వీరమహిళలని నీచంగా మాట్లాడే మీ అందరికి బుద్ధి చెప్పే రోజు ఇంకెంత దూరంలోనే లేదు.
మీరు వాగిన ప్రతి అడ్డమైన వాగుళ్ళకి, రాతలకి సంజాయిషీ ఇచ్చుకునే రోజు దగ్గరలోనే వుంది. ఇంతకన్నా దిగి మాట్లాడ్డం నాకు చేత కాదు” అంటూ కొణెదల బాబు తన లేఖలో పేర్కొన్నారు.
కొసమెరుపు
నిజమైన మీడియా ప్రతినిధులకు నాగబాబు రాసిన లెటర్ అర్ధం కాగలదు. బ్రోకరిజం చేసిన మీడియాకి, మీడియా ప్రతినిధులకు కొణెదల నాగబాబు ఉత్తరం ఒక చెంప పెట్టులాంటిది. అయితే నాగబాబు రాసిన ఈ ఉత్తరం జర్నలిజం పేరుతో బ్రోకరిజం చేస్తున్న వ్యభిచార మీడియాలో మార్పు తీసికొస్తుందా?
కుల మీడియాపై విరుచుకు పడకుండా మార్పు సాధ్యం కాదు అనే నిజాన్ని మెగా సోదరులు ఇప్పటికైనా తెలిసికొని విషపు రాతలు రాసేటువంటి కుల మీడియాపైకూడా తమ పోరాటాన్నిమెగా సోదరులు కొనసాగించగలరా? ఇదే మిలియన్ డాలర్ల ప్రశ్న.