వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్ల పెంపుదలకు ఏపీ కేబినెట్ అంగీకారం తెలిపింది. ముఖ్యమంత్రి వైయస్ జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం మంగళవారం నాడు జరియింది. సచివాలయం మొదటి బ్లాకులో కేబినెట్ సమావేశం నిర్వహించారు. మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు.
ప్రధానంగా పెన్షన్ పెంపుపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రూ. 2,500 ఉన్న పెన్షన్‌ను జనవరి నెల నుంచి రూ. 2,750కి పెన్షన్ పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా 62. 31 లక్షల మంది పెన్షన్‌దారులకు మేలు జరుగుతుంది.
అదేవిధంగా వైయస్ఆర్ పశుబీమా పథకం ప్రతిపాదనలకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. అన్ని ప్రభుత్వ పాఠశాల్లలో వర్చువల్ క్లాస్‌లు, ఫౌండేషన్ స్కూళ్లలో స్మార్ట్ టీవీ రూమ్‌లను నాడు-నేడు ద్వారా నిర్మించే ప్రతిపాదనకు కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఏపీ మంత్రిమండలి సమావేశంలో తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు
మేనిఫెస్టోలో పెన్షన్ల పెంపుదల హామీకి కేబినెట్ గ్రీన్‌సిగ్నల్. ప్రస్తుతం అందిస్తున్న రూ.2500ను రూ.2750 లకు పెంచుతూ నిర్ణయం తీసికుంది.
నవరత్నాలు అమల్లో భాగంగా వివిధ కారణాల వల్ల మిగిలి పోయిన, కొత్తగా అర్హత సాధించిన లబ్ధిదారులకు ఏడాదికి రెండు దఫాలుగా లబ్ధి చేకూర్చే కార్యక్రమంలో భాగంగా వీటి మంజూరుకు కేబినెట్ అంగీకారం తెలిపింది.
అలానే 2.63 లక్షల పెన్షన్లు, 44,543 రైస్ కార్డులు, 14,441 ఆరోగ్యశ్రీ కార్డులు, 14,531 ఇళ్ల పట్టాలు, రూ.65 కోట్ల విలువైన సస్పీసియస్ అకౌంట్‌లో ఉన్న బీమా క్లెయింలు మంజూరు చేసింది.
వ్యవసాయ,సహాకార, మత్స్య శాఖలలో 2022 మే, జూన్ నెలలో అమలు చేసిన సంక్షేమ క్యాలెండర్‌కు కేబినెట్ అంగీకారం తెలిపింది.
సాంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగంలో భాగంగా రాష్ట్రంలో పంప్డ్ స్టోరేజ్, హైడ్రో ప్రాజెక్ట్స్‌ను ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రమోషన్ పాలసీకి 2022 ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
అల్లూరి సీతారామరాజు జిల్లా పెదకోట, విజయనగరం జిల్లాలో రైవాడ ప్రాజెక్టు పరిధిలో మొత్తం 1600 మెగావాట్ల పంప్డ్ హైడ్రో స్టోరేజ్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్‌కు అనుమతులు మంజూరు చేసే నిర్ణయానికి కేబినెట్ ఆమోదం.
వైయస్‌ఆర్ జిల్లా సోమశిల వద్ద 900 మెగావాట్లు, అల్లూరి సీతారామరాజు జిల్లా ఎర్రవరం వద్ద 1200 మెగావాట్ల సామర్ధ్యంతో పంప్డ్ హైడ్రో స్టోరేజ్ ప్రాజెక్టుల ఏర్పాటుకు శ్రీ షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్‌కు అనుమతులు మంజూరు చేసే నిర్ణయానికి కేబినెట్ ఆమోదం.
అల్లూరి సీతారామరాజు జిల్లా సీలేరు వద్ద 1350 మెగావాట్ల సామర్ధ్యంతో అప్పర్ సీలేరు పంప్డ్ స్టోరేజ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు నిర్మాణానికి పరిపాలనాపరమైన అనుమతులు మంజూరుకు కేబినెట్ ఆమోదం.
ముఖ్యమంత్రి వైయస్.జగన్ అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు ఆమోదించిన వైఎస్‌ఆర్ జిల్లా సున్నపురాళ్లపల్లెలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం.
పాఠశాల విద్యాశాఖ పరిధిలో ప్రభుత్వ పాఠశాలల్లో నాడు నేడు ఫేజ్ –1లో పనులు పూర్తయిన స్కూళ్లలో అత్యాధునిక బోధన ఉపకరణాలు ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం.
హైస్కూల్స్ పరిధిలో ప్రతి తరగతి గదిలో ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్స్(ఐఎఫ్‌పీ), పౌండేషన్, పౌండేషన్ ప్లస్ స్కూళ్లలో స్మార్ట్ టీవీ రూమ్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయం.
6 వతరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రతి తరగతిగతిలో దాదాపు 15,694 స్కూళ్లలో 30,230 తరగతి గదుల్లో ఐఎఫ్‌పీలు ఏర్పాటు.
పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం సంతగుడిపాడులో కొత్తగా ఏర్పాటు చేయనున్న పశుసంవర్ధక పాలిటెక్నిక్ కళాశాలకు కేబినెట్ ఆమోదం.
డాక్టర్ వైయస్‌ఆర్ ఉచిత పంటల బీమా, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో సవరణలకు మంత్రిమండలి ఆమోదం.
నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఏర్పాటు చేసిన మేకపాటి గౌతం రెడ్డి వ్యవసాయ కళాశాలలో 52 బోధనాసిబ్బంది, 56 బోధనేతర సిబ్బందితో సహా 108 పోస్టుల ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్.
నేషనల్ లైవ్ స్టాక్ మిషన్‌లో భాగంగా వైయస్‌ఆర్ పశుబీమా పథకం(లైవ్ స్టాక్ ఇన్సూరెన్స్ స్కీంను) పేరు మార్పునకు కేబినెట్ ఆమోదం.
చిత్తూరు జిల్లా సదుంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను 30 పడకల సామర్ధ్యం నుంచి 50 పడకల సామర్ధ్యానికి పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి మంత్రిమండలి ఆమోదం.
తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(తుడా)లో ఎస్‌ఈ పోస్టు ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం.
విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ(వీఎంఆర్‌డీఏ)లో ఎస్‌ఈ పోస్టు ఏర్పాటుకు ఆమోదం.
నరసరావుపేట కేంద్రంగా పల్నాడు అర్భన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం.
పాఠశాల విద్యాశాఖకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రైట్ ఆప్ చిల్డ్రన్ టు ప్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ రూల్స్ –2010కు సవరణలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్.
ఆంధ్రప్రదేశ్ రైట్ ఆప్ చిల్డ్రన్ టు ప్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ రూల్స్ –2010కు రూల్ నెంబరు 30ను జత చేస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం.
ఉపాధ్యాయులను బోధనపనులకు మాత్రమే వినియోగించడం వలన పిల్లలకు మెరుగైన బోధనను అందించగలుగుతారు అన్న విద్యావేత్తల అభిప్రాయల మేరకు… ఈ నిర్ణయం.
దీంతో ఉపాధ్యాయులను కేవలం బోధన సంబంధమైన పనులలో మాత్రమే వినియోగించేందుకు నిర్ణయం.
గతంలో ఉపాధ్యాయులు నిర్వర్తించిన బోధనేతర పనుల కోసం.. ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా అందుబాటులోకి వచ్చిన 1.3 లక్షల మంది సచివాలయ సిబ్బంది.
దీంతో ఉపాధ్యాలను బోధనేతర పనుల నుంచి మినహాయించి పూర్తిగా అకడమిక్ వ్యవహారాలకే పరిమితం చేయాలని నిర్ణయం.
నూతనంగా ఏర్పాటు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ జ్యుడీషియల్ అకాడమీలో వివిధ కేటగిరీల కింద 55 అదనపు పోస్టుల ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్.
ఆంధ్రప్రదేశ్ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్‌బుక్ యాక్టు –1971 సవరణలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్.
ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన 5 జిల్లాల్లో వివిధ ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటుకు అవసరమైన ప్రభుత్వ భూమిని కేటాయించాలన్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం.
పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, విశాఖపట్నం, ఎన్టీఆర్ జిల్లాల్లో భూమి కేటాయింపునకు కేబినెట్ ఆమోదం.
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం నడిమిపాలెం గ్రామంలో సూపర్ స్పెషాలిటీ బ్లాక్(మదర్ అండ్ చైల్డ్ కేర్) ఆసుపత్రి నిర్మాణానికి విశ్వమానవ సమైక్యతా సంస్ధకు 7.45 ఎకరాల భూమి కేటాయించాలన్న ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం.
అనంతపురములో ప్రభుత్వ వైద్య కళాశాల, ప్రభుత్వ వైద్యశాల ఉన్నతీకరణ కోసం అవరసమైన 8.32 ఎకరాల భూమిని ఉచితంగా కేటాయించాలన్న ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం.
ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాల్లో వివిధ ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటుకు అవసరమైన ప్రభుత్వ భూమిని కేటాయించాలన్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం.
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భూమి కేటాయింపునకు కేబినెట్ ఆమోదం.
వైఎస్‌ఆర్ జిల్లా జమ్ములమడుగు మండలం గండికోటలో విండ్ టర్బైన్స్ ఏర్పాటుకు ఐఓసీఎల్‌కు 15 ఎకరాల భూమిని లీజు ప్రాతిపదికన కేటాయించాలన్న ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం.
తిరుమల తిరుపతి దేవస్ధానంలో చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్(సీపీఆర్‌ఓ) నియామకానికి కేబినెట్ ఆమోదం.
గతంలో మూసివేతకు గురైన చిత్తూరు డెయిరీని పునరుద్ధరించేందుకు ప్రభుత్వం చర్యలు. అమూల్ ద్వారా మళ్లీ చిత్తూరు డైయిరీ కార్యకలాపాలు
గతంలో మూసివేతకు గురైన చిత్తూరు డెయిరీ భూములను 99 ఏళ్లపాటు అమూల్‌కు లీజు ఇస్తూ రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం.