Market yardMarket yard

వరిపై Rs 72 – నువ్వులపై Rs 452 పెంపుకు ఆమోదం

రాబోయే సంవత్సరానికి మద్దతు ధరలను (Support Prices) కేంద్ర ప్రభుత్వం (Central Government) ప్రకటించింది. వరికి (Paddy) మద్దతు ధరను రూ.72 లుగా పెంచడానికి కేంద్రం నిర్ణయం తీసుకుంది. రాబోయే వ్యవసాయ సీజన్‌కు (Agriculture season) సంబంధించి వివిధ పంటల కనీస మద్దతు ధర (MSP ) పెంచే ప్రతిపాదనలకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ Cabinet Committee) ఆమోదం తెలియ జేసింది. బుధవారం ఈ కమిటీ ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) అధ్యక్షతన సమావేశమైంది. వరి ధాన్యం కామన్‌ గ్రేడ్‌ ధర ప్రస్తుతం క్వింటాల్‌కు రూ.1,868 ఉండగా, దాన్ని రూ.72 పెంచి రూ. 1,940గా నిర్ధారించింది. వరి ధాన్యం గ్రేడ్‌ ఏ రకం ప్రస్తుతం క్వింటాల్‌కు రూ. 1,888 ఉండగా రూ.72 పెంచుతూ రూ.1,960గా ఖరారు చేయడం జరిగింది.

సహేతుకంగా, న్యాయమైన రీతిలో రైతులకు గిట్టుబాటు ధర లభించేలా గత కేంద్ర బడ్జెట్‌లో చేసిన ప్రకటనకు అనుగుణంగా అఖిల భారత సగటు ఉత్పత్తి వ్యయానికి ఒకటిన్నర రెట్లు ఉండేలా కనీస మద్దతు ధరను నిర్ణయించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలియ జేసింది. దీని ప్రకారం అత్యధికంగా , మినుములకు 65 శాతం, కందులకు 62 శాతం, సజ్జలకు పెట్టుబడిపై 85 శాతం ప్రతిఫలం దక్కుతుందని కేంద్రం పేర్కొంది.

ఈ సీజన్‌లో పప్పు ధాన్యాలు (Pulses), నూనె గింజల (Oil Seeds) ఉత్పత్తి పెంపునకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలియ జేసింది. పప్పు గింజల్లో అత్యధిక ఉత్పాదకత ఉన్న రకాల విత్తనాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు కూడా కేంద్ర తెలియు జేసింది. అదనంగా 6.37 లక్షల హెక్టార్లలో నూనె గింజల సాగుకు ఈసారి ఖరీఫ్‌ సీజన్‌లో ప్రణాళిక రూపొందించినట్లు తెలిపింది. కనీస మద్దతు ధర పెంపుతో రైతుల ఆదాయం పెరగడంతోపాటు వారి జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడతాయని ప్రధాని వ్యాఖ్యానించారు.

Spread the love