AP GovernmentAP Government

సినిమా టికెట్ల (Cinema Tickets) ఆన్‌లైన్‌ విక్రయాలకు (online sales) రాష్ట్ర ప్రభుత్వం (State Government) ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలుస్తున్నది. దీనికోసం ప్రత్యేకంగా ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాం (online Flatform) అందుబాటులోకి రానుంది. ఇది రైల్వే టికెట్లు విక్రయించే ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) తరహాలో ఉండబోతున్నది. ఆన్‌లైన్‌ టికెట్ల అమ్మకాల బాధ్యతలను ‘ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫిల్మ్, టెలివిజన్, థియేటర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌’కి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఏపీ ఫిల్మ్‌ చాంబర్‌ (AP Film Chamber) ఆన్‌లైన్‌ టికెట్‌ విక్రయాలు జరపాలని కోరడంతో ప్రభుత్వం పలుమార్లు చర్చించిన విషయం తెలిసిందే. సినీ నిర్మాతలు, ఏపీ ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ (AP Film Chamber of commerce) ప్రతినిధులు, ఇతర సినీ రంగానికి సంబంధించిన వారి అభిప్రాయాలు తీసుకొని వివాదాస్పద నిర్ణయాన్ని తీసికోంది.

రాష్ట్రములో అన్నింటి ధరలు భగ్గుమంటున్నగాని ఒక్క సినిమా టిక్కెట్ల ధరలు మాత్రమే తగ్గించడం ఏమిటి అని విమర్శలు వస్తున్న మాట కూడా వాస్తవమే.

మద్ది హనుమ దేవస్థానంలో వైభవంగా మహా పూర్ణాహుతి