జంగారెడ్డిగూడెం మండలం తాడ్వాయి గ్రామంలో శ్రీదేవి నవరాత్రుల అనంతరం అమ్మవారికి ఘనంగా ఊరేగింపు (Ammavari Procession) కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని 9 రోజులు ఎంతో భక్తిశ్రద్ధలతో కమిటీ సభ్యులు నిర్వహిస్తూ అమ్మవారికి భజన కార్యక్రమాలు అలపిస్తూ పూజా కార్యక్రమాలను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నవరాత్రుల అనంతరం భారీ అన్న సమారాధన ఏర్పాటు చేశారు. తాడువాయి పంచాయతీ సర్పంచ్ ఎర్రమల సత్యవతి, వీరంకి సత్యనారాయణ, పాల రామకృష్ణ, కొప్పుల హనుమంతరావు, కొప్పుల వసంతం, పల్లెల ఆంజనేయులు, పల్లెల శివ, కుందెం శివ, తట్టుకోల సీతారాం, వీరంకి రాంబాబు, కాసారపు నితిన్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.