Nagababu at PitapuramNagababu at Pitapuram

రూ. 16.38 లక్షలు సి.ఎం.ఆర్.ఎఫ్. చెక్కులు పంపిణీ
రూ. 8 లక్షలు ఎల్.ఓ.సీ. చెక్కు అందజేత

ఆంధ్ర ప్రదేశ్ శాసన మండలి సభ్యులు (MLC) కొణిదెల నాగబాబు (Konidela Nagababu) చేతుల మీదుగా లబ్దిదారులకు సి ఎం ఆర్ ఎఫ్ మరియు ఎల్ ఓ సీ చెక్కులు పంపిణీ జరిగింది. జనసేన పార్టీ (Janasena Party) ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు గారు చేతుల మీదుగా పిఠాపురంలోని (Pitapuram) గోకులం గ్రాండ్ లో నిర్వహించిన కార్యక్రమంలో 22 మంది లబ్దిదారులకు రూ. 16.38 లక్షలు సి.ఎం.ఆర్.ఎఫ్. చెక్కులను శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో నాగబాబు మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గం శాసన సభ్యులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రతీ సందర్భంలో, ప్రతీ విషయంలో ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో ఉంటారు. కష్టాల్లో ఉన్నవారిని కాపాడుకోవాలనే మానవతా దృక్పథంతో ఆలోచిస్తారని స్పష్టం చేశారు.

పవన్ కళ్యాణ్ సిఫార్సుతో కేటాయించిన సి.ఎం.ఆర్.ఎఫ్. చెక్కులను లబ్ధిదారులకు, ప్రత్యేకంగా రూ. 8 లక్షలు ఎల్.ఓ.సీ. చెక్కును అందజేయడం జరిగిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం నియోజకవర్గం ఇంచార్జి మర్రెడ్డి శ్రీనివాస్, మాజీ శాసన సభ్యులు పెండెం దొరబాబు, స్థానిక నాయకులు, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.

ఇల్లు కాలిన బాధితులకు ఆర్థిక చేయూత

పిఠాపురంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో పూర్తిగా ఇల్లు కాలిపోయిన బాధితుడు చల్లా శివకుమార్ కుటుంబానికి ఎన్.ఆర్.ఐ. అనిశెట్టి స్వామి మిత్ర బృందం అందజేసిన రూ. 3 లక్షలు, కాపు అభ్యుదయ సంఘం నాయకులు అందజేసిన రూ. 1 లక్ష… మొత్తం రూ. 4 లక్షలు చేయూతను కె. నాగబాబు గారు చేతుల మీదుగా చెక్కు రూపంలో అందజేశారు.

పదవ తరగతి ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన పిఠాపురం విద్యార్థులకు అభినందన

పిఠాపురంలోని రాపర్తి జెడ్.పీ.హెచ్.ఎస్. పాఠశాలలో చదువుకున్న దేశనీడి మణిక్యాలరావు కుమార్తె డీ.ఎస్.ఎన్.వి.పూజ 580/600, నక్కా దొరబాబు కుమారుడు ఎన్.జె.వి. రవితేజ 580/600 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచారు. అందుకుగాను కొణిదెల నాగబాబు వారిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆర్య సూర్నీడి, కీర్తి చంటి పాల్గొన్నారు.

సర్వశ్రేష్ఠ రాజధానిగా అమరావతి: పవన్ కళ్యాణ్

Spread the love