కేంద్ర మాజీ మంత్రి వర్యులు, సినీ కథానాయకులు కృష్ణం రాజు (Cine Hero Krishnam Raju) సంస్మరణ సభ ఘనంగా జరిగింది. ఏలూరు మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా (West Godavari District) ప్రభాస్ ఫ్యాన్స్ అధ్యక్షులు పి. శ్రీనివాస రాజు (Srinivasa Raju) ఆధ్వర్యంలో మండల కార్యాలయంలో ఈ సంస్మరణ సభ ఈరోజు ఉదయం జరిగింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) నాయకులు, అసెంబ్లీ స్థానాల పెంపు సాధన సమితి జాతీయ కన్వీనర్ డాక్టర్ పొలిమేర హరికృష్ణ (Polimera Krishnam Raju) పాల్గొని మాట్లాడుతూ…. పచ్చని పశ్చిమ గోదావరి జిల్లా బిడ్డ కళామతల్లి ముద్దుబిడ్డ కృష్ణంరాజు నటుడిగా, రాజకీయ నాయకుడిగా రెండు పాత్రలు పోషించి మెప్పించారని అన్నారు. సినీ రంగానికి ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు గార్లు ఏ .ఈ. ఐ. ఓ. యు లాంటివారని కొనియాడారు ఆయన లేని లోటు సినీ రంగానికి కాకుండా, తెలుగు ప్రేక్షకులకు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు తీరని లోటన్నారు.
కృష్ణంరాజు కాంస్య విగ్రహాన్ని ఏలూరు జిల్లా ముఖ్య కేంద్రం ఏలూరు (Eluru) నగరంలో నెలకొల్పాలని చెప్పగా వెంటనే వేదిక పైనున్న పాకా ప్రభాకర్ గారు రెండు లక్షల రూపాయలను విరాళంగా ప్రకటించారు.
తొలుత కృష్ణoరాజు చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించి, మౌనం పాటించి, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన అభిమానులు, ప్రభాస్ అభిమానులు, సినీ హీరోల వివిధ అభిమాన సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.