స్వప్రయోజనాల కోసం సీమను వాడుకుంటున్నారు
కడప జిల్లాలో 187 మంది కౌలు రైతుల ఆత్మహత్యలు
పులివెందులలోనే 45 మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు
కౌలు రైతు భరోసా యాత్రకు వెళ్లనీయకుండా రైతుల కుటుంబాలకు బెదిరింపు
దమ్ముంటే సొంత నిధులతో రైతు కుటుంబాలను ఆదుకోవాలి
సిద్ధవటం రచ్చబండ కార్యక్రమంలో నాదెండ్ల మనోహర్
జగన్ రెడ్డి (Jagan Reddy) ముఖ్యమంత్రి (Chief Minister) అయ్యాక రాష్ట్రంలో దాదాపు 3 వేల మంది కౌలు రైతులు (Kaulu Rythulu) ఆత్మహత్యలకు పాల్పడ్డారని జనసేన పార్టీ (Janasena Party) రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జిల్లా అయిన కడపలో (Kadapa) 187 మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. సొంత నియోజకవర్గమైన పులివెందులలో (Pulivendula) 45 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని నాదెండ్ల అన్నారు. కడప జిల్లాలో 187 మంది కౌలు రైతులు చనిపోయినట్లు సొంత పేపర్ అయినా సాక్షి (Sakshi) న్యూస్ పేపర్ లో ప్రచురించారని నాదెండ్ల గుర్తు చేశారు. జనసేన కౌలు రైతు భరోసా యాత్రలో (Kaulu Rythu Bharosa yatra) భాగంగా శనివారం సిద్ధవటంలో (Siddavatam) రచ్చబండ (Rachabanda) కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “కడప జిల్లా నుంచి ఒక శాసనసభ్యుడు ముఖ్యమంత్రి అయ్యాడని ఈ ప్రాంత ప్రజలు సంతోషపడి ఉంటారు. జగన్ ముఖ్యమంత్రి అయితే ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుంది, సస్యశ్యామలంగా మారుతుందని ఇక్కడి ప్రజలు ఆశపడ్డారు. కానీ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక వ్యవసాయ రంగానికి (Farming Sector) కనీస తోడ్పాటు అందించలేకపోయారు అని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు.
బంధువులకే కౌలు రైతు కార్డులు (Rythu Cards) ఇచ్చుకున్నారు
వైఎస్ రాజశేఖర్ రెడ్డి (Y S Rajashekar Reddy) పాలన ఎలా ఉండేది… ఇప్పుడు జగన్ పాలన (Jagan Governance) ఎలా ఉంది? ఒక్కసారి ప్రజలు ఆలోచించాలి. ఈ ముఖ్యమంత్రికి వ్యవసాయం (Farming) గురించి తెలియదు. ఇక్కడ రైతాంగం కేసీ కెనాల్ (KC canal) పై ఆధారపడి వ్యవసాయం (Cultivation) చేస్తారు. దాదాపు లక్ష ఎకరాలు సాగు జరుగుతుంటే జిల్లా వ్యాప్తంగా కేవలం 2 వేల మంది కౌలు రైతులకే సీసీఆర్సీ కార్డులు (CCRC Cards) ఇచ్చారు. అదీ కూడా జగన్ బంధువులకే ఇచ్చుకున్నారు. ఇలాంటి ముఖ్యమంత్రికి కౌలు రైతుల ఆత్మహత్యలకు ఆధారాలున్నాయా అని అడిగే హక్కు ఉందా? రాష్ట్రవ్యాప్తంగా 31 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారని చెప్పిన ప్రభుత్వం.. సీసీఆర్సీ కార్డులు ఇచ్చింది మాత్రం లక్ష 41వేల మందికి మాత్రమే అని నాదెండ్ల మనోహర్ అన్నారు.
లక్ష కోట్లు సంపాదించారు… ఆదుకోవచ్చు కదా
భారతదేశంలో (India) ఏ రాజకీయ పార్టీ చేపట్టని విధంగా జనసేన పార్టీ (Janasena Party) కౌలు రైతు భరోసా యాత్ర (Kaulu Rythu Barosa Yatra) చేపట్టింది. అన్నం పెట్టే రైతు కుటుంబాలకు అండగా ఉండాలనే సదుద్దేశంతో తన వంతు సాయం అందించాలని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తన సొంత సొమ్ము రూ. 5 కోట్లు విరాళంగా అందించారు. ఆయన కుటుంబం మరో కోటి రూపాయలు ఇచ్చింది. ఎంతోమంది దాతలు ఎంతో గొప్ప మనసుతో కౌలు రైతు కుటుంబాలకు ఆదుకోవాలని విరాళాలు అందించారు. రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న ఈ గొప్ప కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి కొందరు దుర్మార్గమైన ప్రయత్నం చేశారు అని నాదెండ్ల మనోహర్ తెలిపారు.
పులివెందుల (Pulivendula) నియోజకవర్గంలో 45 మంది కౌలు రైతులు చనిపోయారు. బాధిత కుటుంబ సభ్యులను సభకు రానివ్వకుండా గ్రామాల్లో బెదిరింపులకు దిగారు. దాదాపు 19 మందిని సభకు రానివ్వకుండా ఆపగలిగారు. వీళ్ల బెదిరింపులకు భయపడి ఆగిపోయిన వాళ్లలో చాలా మంది నిరుపేదలు ఉన్నారు. తినడానికి తిండి లేనివాళ్లు, ప్రభుత్వ సాయం అందని వాళ్లు ఉన్నారు.
పవన్ కళ్యాణ్ నిర్వహించిన సభకు వెళ్తే ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ. 7 లక్షలు నిలిపి వేస్తామని బెదిరించి సభకు రాకుండా అడ్డుకున్నారు. సీఎం సొంత జిల్లా అయిన కడప జిల్లాలో ఆత్మహత్యలకు పాల్పడిన 187 మంది కౌలు రైతు కుటుంబాలకు తక్షణమే రూ. 7 లక్షల చొప్పున నష్టపరిహారం అందించాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది.
సీమను అక్షయ పాత్రగా వాడుకుంటున్నారు
ఇక్కడ కొంత మంది నాయకులు తమ ఉనికిని కాపాడుకోవడానికి సీమను (Rayala seema) అక్షయ పాత్రగా (Akshaya Patra) వాడుకుంటున్నారు. కౌలు రైతుల కుటుంబాలు కష్టాలు చూసి చలించి పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బును విరాళంగా అందిస్తున్నారు. లక్ష కోట్లు సంపాదించిన జగన్ రెడ్డి దానిలోంచి కొంత సొమ్ము కౌలు రైతు కుటుంబాలకు ఖర్చు చేయవచ్చు కదా” అని నాదెండ్ల అన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ పి.ఎ.సి. సభ్యులు పంతం నానాజీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు బొలిశెట్టి సత్య, చిలకం మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు తాతంశెట్టి నాగేంద్ర, ముకరం చాంద్, కార్యక్రమాల నిర్వహణ కమిటీ ఛైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్, పార్టీ నేతలు పి.వి.ఎస్.మూర్తి, హసన్ బాషా, పందిటి మల్హోత్రా, వివేక్ బాబు, వేగుళ్ళ లీలాకృష్ణ, శెట్టిబత్తుల రాజబాబు, రాందాస్ చౌదరి, అతికారి వెంకటయ్య, దినేష్, అతికారి కృష్ణ, ఎంవీ రావు, రాట్నాం రామయ్య, శ్రీమతి కె.సంయుక్త తదితరులు పాల్గొన్నారు.