Manyam veerudu-Pawan KalyanManyam veerudu-Pawan Kalyan

గడచిన డబ్బై సంవత్సరాల ఆంధ్ర రాజకీయ చరిత్రలో నేటి వరకు 21 మంది ముఖ్యమంత్రులు వచ్చి పోయారు.

సుమారు ఒక తొంబై లక్షల కోట్లు బడ్జెట్ రూపంలో ఖర్చు పెట్టీ వుంటారు.

ఈ 21 ముఖ్యమంత్రులు పేషీల నిర్వహణకు కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టీ వుంటారు.

కొన్ని వేల కోట్ల భూములను వివిధ ప్రైవేట్ వ్యక్తులకు సంస్థలకు ధారాదత్తం చేసి ఉంటారు.

కానీ కానీ కానీ…

55 గిరిజన గ్రామాలకు కేవలం 30 అంటే 30 కోట్ల రూపాయిలను కేటాయించలేక పోయారు. రోడ్లు వేపించలేక పోయారు.

గడచిన 70 సంవత్సరాలలో గిరిజన డోలీలు టీవీ చర్చలకు, అసెంబ్లీ డిబేట్ లకు మాత్రమే ఉపయోగపడ్డాయి. కానీ డోలీలలో మగ్గిపోయిన గిరిజనులకు ఉపయగపడలేదు.

ఒక్క మగాడు…

డిప్యూటీ సిఎం అని చెప్పు కోవడానికే భయపడే రోజుల్లో పవన్ కళ్యాణ్ అనే ఒక మహా శక్తి డిప్యూటీ సిఎం గా అయ్యాడు.

30 కోట్లను కేటాయించి 55 గ్రామాలకు 30 కిలోమీటర్ల రోడ్డు సదుపాయం కల్పించాడు. గిరిజనుల జీవితాల్లో మనకీ ఒక ప్రభుత్వం ఉంది అనే ఒక చిన్న భరోసాను పవన్ కళ్యాణ్ ఆ గిరిజనుల్లో కల్పించాడు.

ఇదే పవన్ కళ్యాణ్ ఆ రెండు కులాల్లో పుట్టి ఉంటే ఈపాటికే మీడియాలో పవన్ కళ్యాణ్ పేరు మారు మొగిపోయేది. సమస్త జాతులు చేతులు జోడించి దండాలు పెట్టడం మొదలు పెట్టి ఉండేవారు.

ఏది ఏమైనప్పటికీ 55 గిరిజన గ్రామాలకు ఏడు దశాబ్దాల అనంతరం రోడ్డు వేపిస్తున్నా జనసేనాని పవన్ కళ్యాణ్ శతమానం భవతి శాతాయుష్ మాన్ భవ.

శభాష్ పవన్ కళ్యాణ్ జీ. శభాష్ అని యావత్తు తెలుగు ప్రజలు మిమ్ముల్ని శ్లాగిస్తున్నారు. మీ ప్రతీ కదలికని యువత స్ఫూర్తిగా తీసికొంటున్నారు. మీరు రాష్ట్ర సీఎం గావాలని యావత్తు సమాజం కోరుకొంటున్నది.

మీ ఈ గొప్పతనం రేపటి ఈ ఆధిపత్య కుల మీడియాలో లోపలి పేజీలకే పరిమితం కావచ్చు. కానీ సమస్త గిరిజనుల గుండెల్లో మాత్రం మీరు ఎప్పటికీ నిలిచి పోతారు.

పవన్ కళ్యాణ్ ద్వారానే మార్పు వస్తుంది అనే వారి లక్ష్యంలో సమ్మిళితమై ఉంటారు.

పవన్ కళ్యాణ్ నాకేమీ చేశాడు. నా పార్టీకి ఏమీ చేశాడు అనే సోదరులారా! పవన్ కళ్యాణ్ అనే శక్తి మారుమూల గిరిజనులకు కూడా అధికార ఫలాలను ఎలా చెరుస్తున్నాడో ఒక్కసారి ఆలోచించండి (It’s from Akshara Satyam)

సీజ్ ద బోట్ కాదు – సీజ్ ద సిస్టం: జనసేనానికి అక్షర సందేశం

Spread the love