New Maharasthra CMNew Maharasthra CM

డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం

మహారాష్ట్ర సీఎంగా ఏక్‌నాథ్ శంభాజీ షిండే (Eknath Shinde) ప్రమాణం స్వీకారం చేసారు. డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Padnavis) ప్రమాణ స్వీకారం చేసారు. దీనితో మహారాష్ట్రలో (Maharashtra) గత కొన్ని రోజులుగా నెలకొన్న రాజకీయ అస్థిరతకు తెరపడింది. మహారాష్ట్ర గవర్నర్ (Maharashtra Governor) సమక్షంలో నూతన ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్ శంభాజీ షిండే, ఉప ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. మహారాష్ట్రలో బీజేపీ, శివసేన రెబల్ ఎమ్మెల్యేల సంకీర్ణ ప్రభుత్వం పాలన సాగించనుంది.

1980లో శివసేన (Shiv Sena) మాజీ అధ్యక్షుడు ఆనంద్ డిగే ప్రోత్సాహంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఏక్‌నాథ్ షిండే ప్రవేశించారు. శివసేనలో చేరి కార్పొరేటర్‌గా గెలిచారు.

మాస్ లీడర్‌గా మంచి ఆదరణ సంపాదించుకున్న డిగే అడుగుజాడల్లో నడిచి ఏక్‌నాథ్ షిండే బలమైన నేతగా ఎదిగారు. 2004, 2009, 2014, 2019లో వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా కూడా ఎన్నికయ్యారు. కొప్రి-పచ్‌పఖాడి నియోజకవర్గం నుంచి షిండే ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.

ఇక డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన బీజేపీ (BJP) నేత దేవేంద్ర ఫడ్నవీస్ గతంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా (Maharashtra CM) పనిచేశారు. నాగ్‌పూర్ సౌత్ వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఫడ్నవీస్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

జీపీఎఫ్ డబ్బులు మాయం చేయడమంటే మోసగించడమే