జంగారెడ్డిగూడెం (Jangareddygudem) మండలం లోని 76వ స్వాతంత్రదినోత్సవ (Independence Day) వేడుకలు ఆగష్టు 15 సోమవారం ఘనంగా నిర్వహించారు. 75వ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్బంగా దేశప్రధాని నరేంద్రమోడీ (Modi) రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిల (Jagan Mohan Reddy) ఆదేశాల మేరకు అమృతోత్సవ స్వాతంత్ర దినోత్సవాన్ని పండగ వాతావరణంలా ఏర్పరుచుకుని గ్రామపెద్దలు, నాయకులు జాతీయగీతాలు ఆలపించారు.
తాడువాయిలో …
గ్రామ పంచాయితీ , సచివాలయం వద్ద సర్పంచ్ యరమల సత్యవతి, ఆధ్వర్యంలో జిల్లాపరిషత్ పాఠశాల్లో ప్రధానోపాధ్యాయులు పి రాములు ఆధ్వర్యంలో .. ప్రాధమిక ఆరోగ్యకేంద్రంలో వైద్యులు లావణ్య ఆధ్వర్యంలో తాడువాయి పీఏసీఎస్ (సొసైటీ) లో కార్యదర్శి అయిలూరి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఈ జెండా వందనాన్ని సర్పంచ్ యరమల సత్యవతి, తో పాటుగా ్రగామపెద్ద సత్రం లక్షణరావులు జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు పెద్దలు మాట్లాడుతూ జెండా గొప్పతనం గురించి, దేశంకోసం పాటుపడి ప్రాణాళర్పించిన నాయకులు గురించి విద్యార్ధులకు వివరించారు.
ప్రధానోపాద్యాయులు రాములు మాట్లాడుతూ విద్యాఅభివృద్ది కమిటీ చైర్మన్‌గా ఉన్న రాసాబత్తుల రాంబాబు పాఠశాల విద్యాఅభివృద్దికి ఎంతో దోహదపడ్డారని కొనియాడారు. ఈ జెండా వందనాల అనంతరం తాడువాయి పీఏసీఎస్ (సొసైటీ) వద్ద జెండాను ఆవిష్కరించారు. గతంలో సొసైటీ అధ్యక్షులుగా కొనసాగిన కనికళ్ళ ప్రసాద్‌బాబు, బుద్దాల పాపారావు తదితరులకు సన్మానకార్యక్రమాన్ని ప్రస్తుత అధ్యక్షులు వీరంకి సత్యన్నారాయణ మూర్తి చేతుల మీదగా కార్యదర్శి అయిలూరి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో చేసారు. ఈ కార్యక్రమంలో పల్లా గంగాధర్‌రావు, బుద్దాల సత్యన్నారాయణ, పిన్నమనేని నాని, ఉప్పునూతుల రాఘవేంద్రరావు, చీధిరాల నాగేశ్వర్రావు, మోరపాకల శివరామ్, తదితరులు పాల్గొన్నారు.
–జంగారెడ్డిగూడెం నుండి గరువు బాబూరావు 9948175358