Chiru at GodFather meet

గాడ్ ఫాదర్ ప్రెస్ మీట్’లో చిరు సంచలన వ్యాఖ్యలు

నా తమ్ముడి నిబద్ధత, నిజాయితీ గురించి నాకు తెలుసు. అలాంటి నిబద్ధత ఉన్న పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) లాంటి నాయకుడు మనకు రావాలి. దానికి కచ్చితంగా నా సపోర్ట్ (Chiru support) ఉంటుంది అంటూ మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) కీలక వ్యాఖ్యలు చేసారు. బుధవారం ‘గాడ్‌ఫాదర్‌’ (GodFather) సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో చిత్రబృందం ప్రెస్‌మీట్‌ (Press meet) ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు చిరంజీవి ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు.

భవిష్యత్‌లో తన తమ్ముడు, జనసేన అధినేత (Janasena President) పవన్‌కల్యాణ్‌కు తన మద్దతు ఉంటుందని చిరంజీవి స్పష్టం చేసారు. ఆంధ్రప్రదేశ్‌కు (Andhra Pradesh) అంకితభావం కలిగిన పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు నాయకుడు అవసారం. ఆ అవకాశాన్ని ప్రజలు పవన్‌కు ఇస్తారని భావిస్తున్నట్లు చిరు తెలిపారు.

తానొక పక్కన, తమ్ముడు మరొక పక్కన ఉండేకంటే నేను తప్పుకొని ఉంటేనే తమ్ముడు కళ్యాణ్’కి ఎదిగే అవకాశం వస్తుంది అని మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేసారు.

భుజాలు తడుముకుంటే నేనేమీ చేయలేను…

ప్రస్తుత రాజకీయ నేతలపై ‘గాడ్‌ ఫాదర్‌’ సినిమాలో ఎలాంటి సెటైర్లు వేయలేదని మరొక ప్రశ్నకు చిరంజీవి సమాధానం చెప్పారు. ప్రస్తుత రాజకీయ నేతలపై ‘గాడ్‌ ఫాదర్‌’ సినిమాలో ఎలాంటి సెటైర్లు వేయలేదని స్పష్టం చేశారు. గాడ్‌ఫాదర్‌ సినిమాలో మాతృక అయిన ‘లూసిఫర్‌’ (Lucifer) కథ ఆధారంగానే డైలాగులు ఉన్నట్లు చిరు తెలిపారు. ఇటీవల సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రాజకీయం (Politics) నుంచి నేను దూరంగా ఉన్నాను. కానీ నా నుంచి రాజకీయం దూరం కాలేదు అంటూ ఓ డైలాగ్‌ను చిరంజీవి ట్వీట్‌ చేసారు. ఈ నేపథ్యంలో ఆ డైలాగులను మీడియా ప్రతినిధులు ప్రస్తావించారు. ఎవరైనా ఆ డైలాగులు విని భుజాలు తడుముకుంటే తానేమీ చేయలేనని చిరంజీవి కీలక వ్యాఖ్యానించారు.

నన్ను గొప్ప శిల్పంగా మలిచింది నటీనటులు, దర్శకనిర్మాతలు, ఇతర సాంకేతిక బృందం. వాళ్లందరి కృషి వల్లే నాకు ఈ ఇమేజ్‌ వచ్చింది అది గుర్తు పెట్టుకొంటూనే సింపుల్ గా ఉంటూ ఉంటాను. ఒకే తరహా సినిమాలు చేయడం కంటే ఏదైనా కొత్తగా చేయాలనే నాలో ఉన్న తపనని చరణ్‌ గమనిస్తుండేవాడు. అందుకే లూసిఫర్‌ చేయడానికి చరణ్ (Ram Charan) నిర్ణయించాడు అని చిరంజీవి అన్నారు. కథని ఎంతో పకడ్బందీగా మోహన్ రాజా తెరెకెక్కించారు. ఈ సినిమాను తప్పకుండా మీరు ఆదరిస్తారు అని నమ్ముతున్నా అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు.

దర్శకులు మోహన్ రాజా మాట్లాడుతూ…

గాడ్ ఫాదర్ సినిమా అవకాశం నాకు వచ్చేలా చేసిన ఎన్వీ ప్రసాద్‌, చరణ్‌, చిరంజీవికి ధన్యవాదాలు. రేపు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్నందులకు ఎంతో ఆనందంగా ఉంది. లూసిఫర్‌ గురించి మాట్లాడేవారందరికీ నేను చెప్పేది ఒక్కటే చెబుతున్నాను. నేను ఆ సినిమాకి పెద్ద అభిమానిని. నా మనసులో ఆ చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంది. ఏడాదిన్నర పాటు వర్క్‌ చేసి ఈ సినిమాని రూపొందించా. దీనికి ‘గాడ్‌ఫాదర్‌’ అనే టైటిల్‌ పెట్టడానికి తమన్‌ ముఖ్య కారణం. ఆయన అందించిన మ్యూజిక్‌ మరో స్థాయిలో ఉంది. ఇంటర్వెల్‌ సీన్‌కు మంచి రెస్పాన్స్ వస్తుంది. కేవలం చిరు కళ్ల కోసమే మూడు సీన్స్‌ చేశాం. చిరుపై అంటే నాకెంత ప్రేమ ఉందో గాడ్ ఫాదర్ సినిమాలో చూపించా. ఇది కేవలం ఆయన ఇమేజ్‌ కోసం రాసిన స్క్రీన్‌ప్లే అంటూ గాడ్ ఫాదర్ దర్శకులు మోహన్ రాజా (Director Mohan Raja) అన్నారు.

మొత్తం మీద గాడ్ ఫాదర్ సినిమా విడుదల ముందు రోజు సినీ బృందం ఏర్పాటు చేసిన ప్రెస్ రిలీజ్’లో చిరంజీవి చేసిన వ్యాఖ్యలు దుమారం చేయబోతున్నాయి అనేది అక్షర సత్యం.

జనసేనాని! మార్పుకి మద్దతు పొందాలంటే…