Raja Shekhar ReddyRaja Shekhar Reddy

ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర (Combined AP) చరిత్రలో వైయస్ రాజశేఖర్ రెడ్డి (Rajasekhar Reddy) కాంగ్రెస్ పార్టీ (Congress Party) నాయకుడిగా ఎదుగుతున్న పరిణామ క్రమంలో ఎన్నో అణచివేతలు ఎదుక్కోన్నారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి (Kotla Vijaya Bhaskara Reddy), మర్రి చెన్నారెడ్డి (Marri Chenna Reddy), నేదురుమల్లి జనార్దన్ రెడ్డి (Nedurumalli Janardhana Reddy) లాంటి అనేక వర్గాలు/గ్రూపులు కాంగ్రెస్ పార్టీలో ఉండేవి. అటువంటి నాయకులు రాజశేఖర్ రెడ్డి ఎదగ నివ్వకుండా ప్రతి విషయంలో ఆటంకాలు కలిగిస్తూ తొక్కి వేసిన సంఘటనలు ఈ రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయి .

కడప జిల్లాలో మాజీ పార్లమెంట్ సభ్యులు సాయి ప్రతాప్ (Sai Pratap) కుటుంబం రాజశేఖర్ రెడ్డికి చాలా సన్నిహితం. రాజశేఖర్ రెడ్డికి, సాయి ప్రతాప్ కుటుంబం ఆ రోజుల్లో చాలా ఆర్థికంగా, అన్ని విధాల సహాయపఢ్ఢారు అని చెబుతారు. సాయి ప్రతాప్ తాత గారు ముగ్గురాళ్ల క్రిష్టప్ప (Mugguralla Krishnappa) పెద్ద మైనింగ్ ఓనర్. కడప జిల్లాలో మంగంపేట, రైల్వే కోడూరు తదితర ప్రాంతాలలో వందల ఎకరాల మైనింగ్ గనులు ముగ్గురాల కిష్టప్ప వారి కుటుంబానివే.

వైయస్ రాజారెడ్డి ఉన్నప్పటి నుండి ముగ్గురాళ్ల కిష్టప్పతో సన్నిహితంగా ఉంటూ ఉండేవారు. కృష్ణప్ప కుటుంబం అండదండలతో రాజారెడ్డి కూడా ఆ వ్యాపారంలో స్థిరపడి ఆర్థికంగా బాగా బలపడింది అనేది కూడా అక్షరసత్యం. ఇది కడప జిల్లాలోని పాత తరం నాయకులకు ,పెద్దలకు తెలుసు.

వంగవీటి మోహన రంగా ఎదుగుతున్న క్రమంలో

ఇది ఇలా ఉండగా, మరొక పక్కన వంగవీటి మోహన్ రంగా (Vangaveeti Mohana Ranga) రాజకీయంగా ఎదుగుతున్నారు. ఈ పరిణామ క్రమంలో మోహన రంగాలో ఉన్న చైతన్యం చూసి రాజశేఖర్ రెడ్డి కూడా వారికి దగ్గరయి విజయవాడ సెంటర్లో సినిమా హాళ్లు, ఆస్తులు కొనుక్కున్నారు అంటారు. రంగాతో స్నేహం చేస్తూ రాజకీయం చేయనారంభించారు.

1988లో విజయవాడ సెంటర్లో జరిగిన వంగవీటి మోహన రంగా (Vangaveeti Mohana Ranga)పై పైశాచిక దాడి, మర్డర్ జరిగింది. 1989 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఈ సంఘటనే చాలా చాలా ఉపయోగపడింది అనేది కూడా అక్షర సత్యం (Akshara Satyam).

రంగా హత్య (Ranga Murder) వెనుక ఏఏ వర్గాలు ఉన్నాయి, ఏఏ పార్టీలు కలిసి చేశాయి అనే ఆరోపణల జోలికి నేను పోవడం లేదు. రంగా హత్య తరువాత కాపుల (Kapu) రాజకీయ గమనంలో అనూహ్యమైన మార్పులు వచ్చాయి అని మాత్రమే చెప్పాలి.

అయితే రంగా మరణాంతరం రాష్ట్రలో ఉన్న కాపులందరూ (Kapulu) ఏకతాటిపైకి వచ్చారు. ఆనాటి తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా కాపులు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారు. ఆ నాటి సంఘటనలు కాపులు రాజశేఖర్ రెడ్డికి (ysr) దగ్గర కావడానికి దోహదపడ్డాయి.

ఆనాటి రోజులలో ముద్రగడ పద్మనాభం (Mudragada) కాపులకు వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ (BC Reservation) కల్పించాలని ఉద్యమ బాటి పట్టి సైకిల్ యాత్ర చేస్తూ రాష్ట్రమంతా కాపులను ఏకం చేసే ప్రయత్నం చేశారు. వారు చెసిన ఉద్యమం కూడా రాజశేఖర్ రెడ్డి (Y S Rajashekar Reddy) ముఖ్యమంత్రి కావడంలో ఉపయోగపడింది అని చెప్పాలి.

రాజశేఖర్ రెడ్డికి బాసటగా కాపులు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ (Congress Party) లో ఉన్న అప్పటి రెడ్డి నాయకులు (ఆ స్థాయి నాయకులు) అందరూ రాజశేఖర్ రెడ్డిని ఎదగనివ్వకుండా అడ్డుకోనేవారు. అటువంటి సమయంలో రాజశేఖర్ రెడ్డికి కాపులు బాసటగా నిలిచారు. వారిలో ముఖ్యంగా ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham), కన్నా లక్ష్మీనారాయణ (Kanna Lakshminarayana), సంగీతం వెంకటరెడ్డి (Sangeetham Venkata Reddy), జక్కంపూడి రామ్మోహన్ రావు (Jakkampudi), వట్టి వసంత కుమార్, అంబటి రాంబాబు (Ambati Rambabu), బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) లాంటి కాపు నాయకులు రాజశేఖర్ రెడ్డికి అండగా నిలిచారు. వైస్సార్ ముఖ్యమంత్రిగా ఎదగడానికి మెజారిటీ కాపు నాయకులు సాయం చేసారు. చేయూత నిచ్చారు. మెజారిటీ కాపు నాయకులూ, కాపు ఉద్యమ నాయకులు, కాపులు వైస్సార్ వెంట నడిచారు. వైస్సార్ సీఎంగా ప్రమోట్ అవ్వడానికి ప్రధాన కారకులు కాపు నాయకులు, కాపులే అని చెప్పాలి.

సీఎంగా ప్రమోట్ చేసిన కాపులకు వైస్సార్ ఏమి చేసారు అంటే?

అయితే రాజశేఖర్ రెడ్డి (YSR) ముఖ్యమంత్రి (Chief Minister) అయిన తర్వాత పరిస్థితులు మారడం మొదలు అయ్యింది. సీనియర్ కాపు నాయకులను పక్కకు నెట్టి, సబ్ జూనియర్ నాయకులను చేరదీయడం మొదలు పెట్టారు. కాపుల చిరకాల కోరిక అయిన రిజర్వేషన్ (Reservations) అంశాన్ని కూడా వైస్సార్ పక్కకు నెట్టడానికి ప్రణాళికలు వేయడం మొదలు పెట్టారు.

ఆ సమయంలోనే వైస్సార్’కి అండదండలుగా ఉన్న కాపు నాయకులందరూ కాపులకు బి సి రిజర్వేషన్ కల్పించమని అప్పుడప్పుడు వత్తిడి చేసేవారు. కాపులు ఒత్తిడి చేసినా కూడా వైస్సార్ లెక్క చేయలేదు. కాపు (Kapu) నాయకుల్లో ఏదో కొంతమందికి మంత్రి పదవులు ఇచ్చి, వారిని వ్యక్తిగతంగా సమాధానపరిచి పంపించేవారు.

కాపులకు రిజర్వేషన్ (Kapu Reservation) అందకుండా ఉండడం కోసం, ఏ నాడు అడగని ముస్లిం (Muslims) సోదరులకు 4% రిజర్వేషన్ వైస్సార్ కల్పించారు. ఇది చట్టానికి, రాజ్యాంగానికి వ్యతిరేకంగా కేవలం ముస్లిం మైనారిటీ ఓట్ల కోసం, తన వ్యక్తిగత ప్రాబల్యం పెంచుకోవడం కోసమే నాడు వైస్సార్ చేశారు అని అంటుంటారు.

2006 లో ఏర్పాటు అయిన దాళ్వా సుబ్రహ్మణ్యం కమీషన్ (Dalva Subramanyam Commission) పనిచేయడానికి అవసరమైన నిధులను కూడా రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం నాడు ఇవ్వలేదు అనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కమీషన్ 14 కులాలపై నివేదిక ఇచ్చింది. అయితే కాపు, తెలగ, బలిజ, ఒంటరి మినహాహించి మిగిలిన 9 కులాలను వైస్సార్ బీసీల్లో చేర్చారు. కానీ రాజశేఖర్ రెడ్డి ఉద్దేశ పూర్వకంగానే కాపులను బీసీల్లో చేర్చకుండా వదిలేశారు అని అంటారు. వీటిపై కాపు నాయకులూ, కాపు సంఘాలు (Kapu sanghalu) నోరు ఎట్టకపోవడం విచారం.

రిజర్వేషన్ కావాలి అని అడగడానికి వెళ్లిన కాపులకు కాలేజీ ఫి రేయింబర్సుమెంట్’తో రాజశేఖర్ రెడ్డి సరిపెట్టారు. అయితే ఆ ఫి రీయింబర్సుమెంట్ కాపులతో పాటు అందరికీ వర్తించింది. కాపులకు రిజర్వేషన్ మాత్రం లేదు.

కాపులకు రిజర్వేషన్ కల్పిస్తే???

ఎందుకంటే కాపుల యొక్క బలం శక్తి వైస్సార్’కి తెలుసు. రాష్ట్రంలో కాపులు ఉన్న జనాభా నిష్పత్తి దృష్ట్యా కాపులకు రిజర్వేషన్ కల్పిస్తే (Kapu Reservations) పాలక వర్గాలకు రాజకీయ మనుగడ కష్టం అని వైస్సార్ భావించి ఉండవచ్చు? కాపులు ఆర్ధికంగా ఎదిగితే కాపులను రాజకీయంగా పట్టలేము. రాజకీయంగా ఎదిగిపోతారు. బలపడిపోతయారు. రాజకీయంగా కూడా మనకు అడ్డమయిపోతారు అనే దృక్పథంతో, ఉద్దేశంతో కాపులకు బీసీ రిజర్వేషన్ (Reservations) కల్పించకుండా ఎగ్గొట్టారు . మోసం చేశారు. ఇది రాజశేఖర్ రెడ్డి కాపులకు చేసిన ద్రోహం కాదా?

కాపులకు బీసీ రిజర్వేషన్ (BC Reservation) కల్పిస్తే చాలా చాలా మంచిది అనేదే నా వ్యక్తిగత ఉద్దేశం. కాని రిజర్వేషన్ వస్తుందో రాదో? ఇస్తారో ఇవ్వరో? ఇవ్వగలరొ? ఇవ్వలేరో కూడా కాపులకు తెలియదు. అటువంటి పరిస్థితులలో కాపులు రాజకీయంగా ఎదగడానికి ప్రయత్నం చెయ్యాలి. రాష్ట్రంలో 27% వరకు కాపు, తెలగ,బలిజ, ఒంటరి కులస్థులు ఉన్నారని ఒక అంచనా.

కేవలం రెండు వర్గాలు లేక కొన్ని కుటుంబాలు మాత్రమే అధికార ఫలాలను అనుభవిస్తున్నారు. వీరే అనాదిగా రాజకీయ అధికారాన్ని అడ్డం పెట్టుకొని, కాపులు తదితర మిగిలిన వర్గాలను అణచివేస్తున్నారు అన్న విషయం మనకు అందరికి తెలిసిందే. నేడు ఒక్కొక్క వర్గం ఒక్కొక్క పార్టీకి అండదండగా ఉన్న విషయం కూడా కాదనలేని సత్యం .

మెజారిటీ వర్గమైన కాపులు దేశ, రాష్ట్ర రాజకీయ పరిస్థితులను ఇప్పటికైనా అర్ధం చేసికోవాలి. వీరిని అణచివేస్తున్న వర్గాల లేదా పార్టీల కొమ్ముకాయడం మంచిది కాదు అని తెలిసుకోగలగాలి. పల్లకీలు మోపించుకొనే పార్టీలకు బదులుగా పల్లకీలు ఎక్కించే పార్టీలకు మద్దతుగా నిలవడం కాపులు నేర్చుకోవాలి. జనసేన-బీజేపీ లాంటి పార్టీలకు అండగా ఉంటే ఈ వర్గాలకు మంచిదేమో? తద్వారా ప్రభుత్వ పగ్గాలు (Political Power) చేపట్టే అవకాశం దక్కుతుందేమోనని వీరు అంతా ఇప్పటికైనా ఆలోచించుకోవాలి.

— కరణం భాస్కర్ (Karanam Bhaskar), బిజెపి రాష్ట్ర నాయకులు.
మొబైల్ నెంబర్ 7386128877

One thought on “వైయస్సార్ క్రౌర్య కౌగిలిలో కాపులు: కరణం భాస్కర్”

Comments are closed.