tula imagetula image

అజ్ణానులకి అంజనీపుత్రడు (Pawan Kalyan) అంటే ఒక కోతి లేదా కోతి మూకలకి నాయకుడు. కానీ విజ్ఞులకి అతడొక శక్తి. అంజనీపుత్రుడి శక్తి ఏమిటో అతని గొప్పతనమేమిటో శ్రీరాముడికే తెలుసు. లంకారాజ్యాన్ని తగులబెట్టి రావణ గర్వభంగాన్ని గావించిన అంజనీపుత్రిని శక్తిని రావణుడు తెలిసికోగలిగాడు. అంజనీపుత్రుడు అంటే ఒక మహోన్నతమైన శక్తి అని రాక్షసరాజు అయిన రావణుడు తెలిసికోగలిగాడు. కానీ రాక్షస పరివారము తెలిసికోలేక పోయింది.

అంజనీపుత్రుడుకి రాజ్యసభ లాంటి పదవులు తుచ్ఛము. తెలుగుదేశము పార్టీ రాజ్యసభ సీటు ఇస్తాను అంటే తిరస్కరించిన వాడు అంజనీపుత్రుడు అనేది ఆ కొత్త మీడియా అధిపతి తెలిసికోవడము మంచిది. అంజనీపుత్రుడి మాటలకు వర్గ పిచ్చితో పచ్చ భాష్యాలు చెప్పడము జర్నలిజం అనిపించుకోదు.

ఒక బలమైన కాపు కాసే కులం పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన బాబు అధికారంలోకి వచ్చిన తరువాత అదే కులాన్ని అణచి వేస్తున్నాడు.పాలక వర్గాల బూట్లు పోలిష్ చేపించు కొంటున్నారు.   దళిత సోదరులను మాల మాదిగలుగా విభజించి, ఊచకోతలు కోసి, దళితుల గుడిసెలు తగులబెట్టిన పాలక పార్టీల చెంతనే అరుపు దళాలు చేరి, ఆ పాలక వర్గాలు వేసే వేంగిలి మెతుకుల కోసము అరిసే ఈ పచ్చ ఎమ్మెల్సీ’కి అంజనీపుత్రుడి విలువ ఏమి తెలుసు.

మీరు కుల నాయకులా లేక పాలకులకు బానిసలా?

కనీసము జులై 17, 1985 రోజున కారంచేడు దురాగతము జరిగిన రోజు అని, ఆ రోజున కారంచేడులో అసువులు బాసిన దళిత సోదరులకు నివాళిలునర్పిస్తూ కనీసము ప్రెస్ మీట్ కూడా పెట్టాలని, దళిత జాతికి చెందిన ఈ ఎమ్మెల్సీకి తెలియకపోవడము విచారకరం. కానీ కక్కుర్తి పదవుల కోసము బాధితుల మానాలు, ప్రాణాలు కంటే తమ పాలక వర్గాల కుర్చీలకే విలువనిచ్చే ఇటువంటి నాయకులు ఉన్నా ఒక్కటే, లేక పోయినా ఒక్కటే.

అది చెవిటి వాడు ముందు శంఖము వూదినట్లే!

మీడియా ప్రాపకం కోసము వెంపర్లాడే కొంత మందిని వెంటబెట్టుకొని పవనుడిని విమర్శిస్తూ పచ్చ వ్యాఖ్యానాలు చేస్తున్నారు. దీనికి బదులు, పచ్చపార్టీలో చేరి తమ స్వామి భక్తిని చూపుకోవడము ఆ మీడియా అధిపతులకు మంచిదేమో. రైతులు జనసేనుడుపై తిరగబడ్డారా, లేక రైతులు జనసేనుడి సహాయము కోసము వెంటపడ్డారా అనేది పల్లెలో ఉన్న పండు ముదుసలిని అడిగితే చెబుతుంది. కానీ నిజానిజాలను తొక్కిపెట్టి, పచ్చభాష్యాలను మాత్రమే ప్రచారముచేసే మహా అందజ్యోతిలు ఈనాడు 9 లేదా 5 ఏపీలో ఉన్నా సమాజానికి ఏమి ప్రయోజనము. నేటి మన మీడియా ముందు నిజాలు ఎన్ని చెప్పినా అది చెవిటి వాడు ముందు శంఖము వూదినట్లే అవుతున్నది. 

Spread the love