తొలకరి చినుకులతో చెరువులోకి నీటి చుక్కలు చేరితే చాలు కప్పలు కుప్పలుగా కప్పలు ఎక్కడ నుండో వచ్చి చేరుతాయి. బెక బెక మంటూ ఒక్కటే రొద పెట్టడం మొదలు పెడతాయి. ఇది కప్పల స్వార్ధం తప్ప చెరువుపై ప్రేమ కాదు.
బెల్లం ముక్క ఉందని తెలిస్తే చాలు చీమలు కుప్పలు తెప్పలుగా వచ్చి చేరతాయి. ఈ మాయదారి చీమలు బెల్లం అయిపోగానే ఎక్కడికి పోతాయో తెలీదు. ఇది చీమల స్వార్ధం తప్ప బెల్లంపై ప్రేమ కాదు.
మాయదారి పాలక పార్టీలు
అలానే ఎన్నికలు వస్తున్నాయి అంటే చాలు మాయదారి పాలక పార్టీలు కాపులు (Kapu) చుట్టూ వచ్చి చేరతాయి. BJP కూడా ఈ రెండు పార్టీలకు నేడు తోడు అయ్యినట్లు ఉంది. కాపుల ఆశల సౌధం అయిన రాజ్యాధికారానికి (Rajyadhikaram) సమాధి కట్టడానికి కంకణం కట్టుకున్నట్లు ఉంది? రిజర్వేషన్ రిజర్వేషన్ (Kapu Reservations) అంటూ ఒక్కటే రొదతో కాపుల మస్థిస్కాలను పాడుచేయడం మొదలు పెట్టేశాయి. ఇది ఈ మూడు పార్టీల స్వార్ధం తప్ప కాపులపై ప్రేమ కాదు.
కసాయి వాడి చేతిలో గొడ్డళ్లు…
కాపులు: కసాయి వాడి చేతిలో గొడ్డళ్లకు బలి అయిన మేకల్లా కాపులు మన కుల పెద్దలకు, కుల నాయకులకు బలి అయిపోతూ వచ్చారు. అయితే గతాన్ని మరిచి రాజ్యాధికారం కోసం కాపులు పాటు పాడడం ఇప్పుడిప్పుడే మొదలు పెట్టారు. పాలక పార్టీలు రిజర్వేషన్ అంటూ కాపులను మోసం చేయడం మళ్ళీ మొదలు పెట్టేశాయి. నేను ముందూ అంటే నేను ముందూ అంటూ మన ఉద్యమ సంఘాలు, కుల నాయకులూ, కులసంఘాలు పోటీ పాడడం మొదలు పెట్టేశాయి.
ఇది కాపులను మోసం చేయడానికి అలానే కాపుల రాజ్యాధికారానికి సమాధి కాట్టడానికే. ఆ సమాధుల పునాదులపై పేలాలు వేరుకోవడానికి మన కుల నాయకులూ, ఉద్యమ నాయకులూ తిట్టుకోవడం మొదలు పెట్టేసారు అనిపిస్తున్నది.
కాపు రిజర్వేషన్ల బీజేపీకి సూటి ప్రశ్నలు:
- కాపుల రిజర్వేషన్ అంశం రాష్ట్రము పరిధిలోనిది. కేంద్రానికి సంబంధం లేదు అని బీజేపీ అంటున్నది. మరి ఇదే అంశాన్ని బీజేపీ ఢిల్లీ పెద్దలు వైసీపీ ప్రభుత్వంపై ఎందుకు వత్తిడి తేవడం లేదు. కాపులను బీసీ ప్రతిపత్తిని పునరుద్ధరించండి అని బీజేపీ ఢిల్లీ పెద్దలు వైసీపీ ప్రభుతాన్ని ఎందుకు డిమాండ్ చేయడం లేదు. ఢిల్లీలో ఒక మాట. గల్లీల్లో మరొక మాటనా? ఇది కాపులను మోసం చేయడం కాదా?
- రాష్ట్ర బీసీ జాబితాలో చేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వానికి హక్కు ఉండవచ్చు. అయితే కేంద్ర బీసీ జాబితాలో చేర్చడానికి కేంద్ర ప్రభుత్వానికే కదా హక్కు ఉంటుంది. మరి కేంద్ర బీసీ/ఓబీసీ జాబితా గురించి బీజేపీ ఎందుకు నోరు మెదపడం లేదు. కారణం ఏమిటి? ఇది కాపులను మోసం చేయడం కాదా?
- పిల్లి మేడలో గంట కట్టేది ఎవరు అన్నట్లు కాపులను బీసీ జాబితాలో చేర్చేది ఎవరు. రాష్ట్రమున లేక కేంద్రమా? రాష్ట్రము కేంద్రం మీద, కేంద్రం రాష్ట్రము మీద నెట్టుకోవడమేనా మీ ఇద్దరూ మీ మీ జాబితాల్లో కాపులను చేర్చడం ఉందా లేదా. లేక పోతే ఇది కాపులను మోసం చేయడం కాదా?
- బీసీ స్టేటస్ ఇవ్వాల్సిన కాపులకు EWS కోటాలో ఇవ్వడం అంటే కాపులను మోసం చేయడం కాదా? కాపులకు బీసీ హోదాను పునరుద్ధరించడానికి, రాజ్యాంగంలోని 9 వ షెడ్యూలులో పెట్టడానికి వైసీపీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఎందుకు కలిసి పనిచేయడం లేదు. ఇది కాపులను మోసం చేయడం కాదా?
- కాపు తదితర కులాల గణన జరిగితే కాపు రిజర్వేషన్ అంశానికి పునాది దొరుకుతుంది అని అందరికీ తెలుసు. ఈ కుల గణన కోసం బీజేపీ నేటి వరకు తీసికొన్న చర్యలు ఏమిటి? రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తున్న గైడ్ లైన్స్ ఏమిటి? ఎందుకు బీజేపీ మౌనం. ఇది కాపులను మోసం చేయడం కాదా?
కాపు రిజర్వేషన్లపై వైసీపీకి సూటి ప్రశ్నలు:
- రిజర్వేషన్ పునరుద్ధరించండి అనే కాపుల ఉద్యమం న్యాయబద్ధమైనది అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ అధినాయకుడితో సహా వైసీపీ నాయకులూ అందరూ నాడు అన్నారు. ఆ తరువాత వీలు కాదు అన్నారు. ఇది కాపులను మోసం చేయడం కాదా?
- కాపులను రిజర్వేషన్లు ఇస్తాం అని 2014 మరియు 2019 ఎన్నికల మానిఫెస్టోలో వైసీపీ పెట్టిందా లేదా? పెడితే నేడు ఎందుకు మౌనంగా వైసీపీ ఉంటున్నది. ఇది కాపులను మోసం చేయడం కాదా?
- 2004 లో కాపులకు రిజర్వేషన్ ఇస్తాం అని కాంగ్రెస్ పార్టీలోని వైస్సార్ నాడు అన్నారా లేదా? నాడు హామీ ఇచ్చి వైస్సార్ కాపులకు రిజర్వేషన్ ఎందుకు ఇవ్వలేదు. ఇది కాపులను మోసం చేయడం కాదా?
- నేడు వైసీపీలో ఉన్న కాపు నాయకుల్లో ఎక్కువ మంది నిన్నటి ముద్రగడ ఉద్యమానికి మద్దతు నిచ్చారు. కానీ నేడు మౌనం వహిస్తున్నారు. ఇది కాపులను మోసం చేయడం కాదా?
- కాపు తదితర కులాల గణన జరిగితే కాపు రిజర్వేషన్ అంశానికి పునాది దొరుకుతుంది అని అందరికీ తెలుసు. ఈ కుల గణన కోసం వైసీపీ నేటి వరకు తీసికొన్న చర్యలు ఏమిటి? ఇది కాపులను మోసం చేయడం కాదా?
- బీసీ కమిషన్ రిపోర్టు లేకుండా కాపులకు రిజర్వేషన్ ఇవ్వలేను అని వైసీపీ అంటున్నది. మరి ముస్లిం సోదరులకు కమిషన్ రిపోర్ట్ లేకుండా రిజర్వేషన్ ఇచ్చినప్పుడు కాపులకు ఎందుకు వైస్సార్ ఇవ్వలేదు. జగన్ ప్రభుత్వం ఇవ్వడం లేదు. ఇది మోసం కాదా?
- 1994 లో కోట్ల విజయ భాస్కర రెడ్డి ప్రభుత్వం కాపు రిజర్వేషన్లుపై తీసికొచ్చిన జీఓలో 14 కులాలను బీసీ జాబితాలో చేర్చమని కోరగా కాపు, తెలగ, బలిజ, ఒంటరి, కులాలను తప్పించి మిగిలిన 9 కులాలను బీసీల్లో చేర్చారు. కాపులను మాత్రం బీసీ జాబితాలో చేర్చలేదు. కారణం ఏమిటి?నాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు గాని, వైస్సార్ ప్రభుత్వం గాని, నేటి జగన్ ప్రభుత్వంగాని ఎందుకు కాపులను మోసం చేస్తున్నది.
కాపు రిజర్వేషన్లపై టీడీపీకి సూటి ప్రశ్నలు:
- నాటి ముఖ్యమంత్రి కోట్ల విజయ భాస్కర రెడ్డి కాపులకు రిజర్వేషన్లపై ఒక జీఓ తీసికొచ్చారు. ఆ జీఓను కొట్టివేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానికి నాటి హై కోర్టు వదిలి వేసింది అని చరిత్ర చెబుతున్నది. ఆ తరువాత ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు ఆ జీఓని ఎందుకు అమలు చేయలేదు. కాపులకు రిజర్వేషన్లను ఎందకు పునరుద్ధరించలేదు. ఇది కాపులను మోసం చేయడం కాదా?
- 2014 టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో కాపు రిజర్వేషన్ అంశాన్ని పెట్టి కాపులకు ఎందుకు రిజర్వేషన్లను పునరుద్దరించ లేక పోయారు. కాపు రిజర్వేషన్లపై ఎందుకు అంత రాద్ధాంతం చేసారు. ఇది కాపులను మోసం చేయడం కాదా?
- కాపు రిజర్వేషన్లపై మంజునాధ్ కమిషన్ వేసి కమిషన్ ఛైర్మెన్ సంతకం లేకుండా కమిషన్ రిపోర్ట్ కేంద్రానికి పంపితే అది చెల్లదు అని చంద్రబాబుకి తెలీదా. తెలిసి ఎందుకు అలా చేసారు. కుల అప్రతిపాదికపై ఎందుకు జనాభా గణనకి ప్రయత్నించలేదు. ఇది కాపులను మోసం చేయడం కాదా?
- కాపులను రిజర్వేషన్ ఇవ్వాలని మీ ప్రభుత్వ చివరి రోజుల్లో మీ టీడీపీ ప్రభుత్వం కేంద్రానికి నివేదిక పంపింది. ఆ నివేదికపై కేంద్రం వేసిన కొర్రీకి మీ టీడీపీ ప్రభుత్వం నాడు ఎందుకు సమాధానాలు ఇవ్వలేదు. కారణాలు ఏమిటి? ఇది కాపులను మోసం చేయడం కాదా?
- బీసీ రిజర్వేషన్ ఇస్తాను అని హామీ ఇచ్చి EWS రిజర్వేషన్ ఇవ్వడానికి టీడీపీ ప్రభుత్వం నాడు తీర్మానం చేయడం కాపులను మోసం చేయడం కాదా?
- 1994 లో కోట్ల విజయ భాస్కర రెడ్డి ప్రభుత్వం కాపు రిజర్వేషన్లుపై తీసికొచ్చిన జీఓలో 14 కులాలను బీసీ జాబితాలో చేర్చమని కోరగా కాపు, తెలగ, బలిజ, ఒంటరి, కులాలను తప్పించి మిగిలిన 9 కులాలను బీసీల్లో చేర్చారు. కాపులను మాత్రం బీసీ జాబితాలో చేర్చలేదు. కారణం ఏమిటి?
- చంద్రబాబు ప్రభుత్వంగాని, నేటి జగన్ ప్రభుత్వంగాని ఎందుకు కాపులను మోసం చేస్తున్నది. ఉద్యమ సంఘాలు, కాపు నాయకులు, కాపు కుల సంఘాలు దీనిపై ఎందుకు ప్రశ్నించడం లేదు.
కాపు రిజర్వేషన్లపై ఉద్యమ నాయకులకు సూటి ప్రశ్నలు:
- నాటి ముఖ్యమంత్రి కోట్ల విజయ భాస్కర రెడ్డి కాపులకు రిజర్వేషన్లపై ఒక జీఓ ఇచ్చారు. దాన్ని అమలు జరపండి అని చంద్రబాబుని గని ఆ తరువాత వచ్చిన ముఖ్యమంత్రులపై ఎందుకు వత్తిడి తేలేదు. కారణాలు ఏమిటి. Kapu Leaders కాపులను మోసం చేయం కాదా?
- కాపులకు రిజర్వేషన్ ఇస్తాం అని కాంగ్రెస్ ప్రభుత్వం 2004 హామీ ఇచ్చి వైస్సార్ సీఎం అయ్యారు. మరి నాటి వైస్సార్ పై కాపు రిజర్వేషన్లపై ఎందుకు వత్తిడి తేలేదు. ఈ మౌనం వెనుక ఉన్న కారణాలు ఏమిటి? ఇది కాపులను మోసం చేయడం కాదా?
- కాపులు రిజర్వేషన్ ఇవ్వని పార్టీ టీడీపీ. కాపులను రిజర్వేషన్ ఇవ్వలేను అన్న పార్టీ వైసీపీ. కాపులకు రిజర్వేషన్ ఇస్తాను అని మానిఫెస్టోలో పెట్టిన పార్టీ జనసేన. మరి జనసేన పార్టీని కాదని టీడీపీకి వైసీపీకి ఎందుకు మీరు అంతా మద్దతు నిచ్చారు. ఇది కాపులను మోసం చేయడం కాదా?
- మన ఉద్యమ సంఘాలు, కుల నాయకులు, కుల సంఘాలు అందరూ కలిసి కాపులకు రిజర్వేషన్ ఇవ్వని పార్టీలకు దశాబ్దాలుగా ఎందుకు మద్దతు నిచ్చారు. ఆ పార్టీలకు మీకు ఉన్న సంబంధం ఏమిటి? మీకు తప్ప కులానికి ఒనగూరిన ప్రయోజనం ఏమిటి? దశాబ్దాలుగా కాపులకు రిజర్వేషన్ ఇవ్వని పార్టీలకు, పాలక కుటుంబాలకు మద్దతు నిచ్చారు. కారణం ఏమిటి. ఇది కాపులను మోసం చేయడం కదా?
- 1994 లో కోట్ల విజయ భాస్కర రెడ్డి ప్రభుత్వం కాపు రిజర్వేషన్లుపై తీసికొచ్చిన జీఓలో 14 కులాలను బీసీ జాబితాలో చేర్చమని కోరగా కాపు, తెలగ, బలిజ, ఒంటరి, కులాలను తప్పించి మిగిలిన 9 కులాలను బీసీల్లో చేర్చారు. కాపులను మాత్రం బీసీ జాబితాలో చేర్చలేదు. ఉద్యమ సంఘాలు, కాపు నాయకులు, కాపు కుల సంఘాలు దీనిపై ఎందుకు ప్రశ్నించడం లేదు.
ఇంతకీ కాపులను మోసం చేసింది పాలక పార్టీలు కాదు. మన ఉద్యమ సంఘాలు, వివిధ పార్టీల్లో ఉంటున్న మన కుల నాయకులూ, కుల సంఘాలు కలిసి మోసం చేస్తూ వచ్చారు. కాదంటారా? నిజమైతే ఇంకా ఎంత కాలం అని కాపు రిజర్వేషన్ల పేరుతో కాపులను మోసం చేస్తారు?
కాపు రిజర్వేషన్లపై మోసం చేసింది ఎవరు? అనే అంశాలపై బహిరంగ చర్చ పెట్టే ధైర్యం మన పాలక పార్టీలకు గాని, ఉద్యమ సంఘాలకు గాని ఉందా? కులనాయకులకు గాని ఉందా? మీ మీ చిత్త శుద్ధిని నిరూపించుకొనే సాహసం చేయగలరా?
ఆలోచించండి…. ఎన్నికల ముందు కాపులు పేదోళ్లు. వీరికి కాపు రిజర్వేషన్లు అంటూ ఎన్నికల అనంతరం కాపులు అవేశపరులు. సహనం అవసరం. కాపురిజర్వేషన్ సాధ్యం కాదు అంటూ మోసం చేయడం ఇంకెన్నాళ్లు (Akshara Satyam)