తమ్ముడు పవన్’పై అన్నయ్య చిరు ఆవేదనలో నిజమెంత?
తన తమ్ముడు అంటే నాన్నకి పట్టలేని ప్రేమ: వాల్తేర్ వీరయ్య (Waltair Veeraiah) సక్సెస్ మీట్’లో రామ్ చరణ్ (Ram Charan).
నా తమ్ముడు కళ్యాణ్ మీద ఉన్న ప్రేమనే వూహించుకొంటూ వాల్తేర్ వీరయ్య చేశా. నా తమ్ముడు కష్టాలను తలుచుకొంటూనే నటించా. రవితేజ కష్టాల్లో నా తమ్ముడి కష్టాలను ఊహించుకున్నా. నా తమ్ముడి కష్టాలను వూహించుకొంటేనే నా కళ్ళలో గ్లిజరిన్ లేకుండానే కన్నీటి చుక్కలు వచ్చేవి: వాల్తేర్ వీరయ్య సక్సెస్ మీట్’లో అన్నయ్య చిరంజీవి (Chiranjeevi).
కలియుగ ధర్మరాజు లాంటి ఆచార్య చిరంజీవి గారిని 18 నెలల క్రితం అక్షర సత్యం (Akshara Satyam) కలిసి సుమారు 3 గంటల పాటు చర్చించడం జరిగింది.
తమ్ముడిని సీఎంగా చూడడం కోసం మనం ఏమి చెయ్యాలి. అన్నయ్యగా నేను కళ్యాణ్’కి (Kalyan Babu) ఏమి చెయ్యాలి చెప్పు అని చిరంజీవి గారు నాతో ఆరోజు అన్నప్పుడు చిరుగారి మాటల్లో జీర కనిపించింది.
తమ్ముడిపై చిరు ఎంత మదన పడుతున్నారో, తమ్ముడి భవితపై చిరు ఎంత వేదన పడుతున్నారో అనేది ఆరోజు నేను కళ్లారా చూసాను. చెవులారా విన్నాను.
తమ్ముడి కోసం నేను ఎప్పుడూ సిద్దమే అని ఆ రోజు చిరంజీవి గారు నాకు మాట ఇచ్చారు కూడా. ఈ మాట నా కోసం కాదు. అణగారిన వర్గాల రాజ్యాధికారం సాధన కోసం అని అన్నయ్య అక్షర సత్యంతో ఆరోజే చెప్పారు.
అన్నయ్య చిరు తమ్ముడిపై ఉన్న ప్రేమపై ఆరోజే ఒక వీడియో కూడా చేయడం జరిగింది.
ఆ వీడియో లింక్: https://www.youtube.com/watch?v=BReVt2NnPqc
ఆ తరువాత అనేక వ్యాసాలలో కూడా ఒక ఆశావాదిగా ఇదే విషయాన్నీ ప్రస్తావించాను.
వాల్తేర్ వీరయ్య సినిమాలో చిరు మనోవేదనపై కొద్దీ రోజుల క్రితం ఒక వ్యాసం కూడా రాసాను.
ఆ వ్యాసం లింక్: https://aksharasatyam.com/sampadakeeyam/message-from-megastar-chiranjeevi-to-pawan-kalyan/
తమ్ముడిని సీఎం చేయాలి అంటే అన్నయ్యగా నా బాధ్యత
ఆచార్యలో గాని, గాడ్ ఫాదర్’లో గాని, నిన్నటి వాల్తేర్ వీరయ్యలో గాని లేక నిన్నటి వరంగల్ లో చిరు మాట్లాడిన మాటల్లో గాని ఉన్న ఆవేదనను ఒక్కటే. తమ్ముడిని సీఎం చేయాలి అంటే అన్నయ్యగా నా బాధ్యత ఏమిటి. నేను ఏమి చెయ్యాలి.
కానీ అన్నయ్య చిరంజీవి గారి ఆవేదనను, తమ్ముడిని సీఎం చెయ్యాలి అనే చిరు గారి ఆకాంక్షను తమ్ముడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గారు అర్ధం చేసుకోలేక పోతున్నారా అనిపిస్తున్నది.
రామ లక్ష్మణులు లాంటి చిరంజీవి-కళ్యాణ్ బాబులు ఒకరి కోసం ఒకరు ప్రాణం పెడతారు. అటువంటి అన్నయ్య చిరంజీవి తమ్ముడుపై ఉన్న ప్రేమను అమ్మ చాటున కాకుండా సక్సెస్ మీట్లలో మాత్రమే చెప్పుకోవడం కాస్త బాధాకరమే. దీనికి ఇద్దరూ బాధ్యులే. దీన్ని అన్నయ్య, తమ్ముడు ఇద్దరూ అంగీకరించాలి. మెగా కుటుంబాన్ని నమ్ముకొన్న కోట్లాది ప్రజల కోసం అయినా విష్ణు-తత్వాలు రెండూ కలిసి పనిచేయాలి.
అసలు కళ్యాణ్ గారు చిరంజీవిగారి ఆకాంక్షని అర్ధం చేసికోలేక పోతున్నారా లేక అర్ధం చేసికోకుండా ఎవరైనా అడ్డుకొంటున్నారా అనేది ఆ మనోహరుడుకే తెలియాలి.
ఆలోచించండి… చిరులోని సహనం పవన్’లో ఆవేశం కలిస్తేనే రాజ్యాధికారం సాధ్యం అనేది అక్షర సత్యం ఆవేదన మాత్రమే కాదు. మార్పు కోరుకొనే ప్రతీ ఒక్కరి ఆకాంక్ష కూడా ఇదే. (It’s from Akshara Satyam)