బీసీల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన బిందేశ్వరి ప్రసాద్ మండల్ (BP Mandal) విగ్రహావిష్కరణ దిమ్మెను రాత్రికి రాత్రి గుర్తు తెలీని వ్యక్తులు కూల్చివేశారు. విగ్రహావిష్కరణ దిమ్మెను కూల్చేసి బీసీల ఆత్మ గౌరవాన్ని (Self respect of BCs) దెబ్బతీసిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి (Jagan Reddy) తీరుకు నిరసనగా ఈ రోజు అమరావతి రోడ్డులో జనసేన పార్టీ (Janasena Party) తరుపున నిరసన కార్యక్రమం జరిగింది.
ప్రభుత్వం తక్షణమే కూల్చిన దిమ్మెను పునర్నిర్మాణం చేయాలని జనసేన నాయకులు (Janasena Leaders) డిమాండ్ చేసారు. లేనిపక్షంలో బీసీల పక్షాన జనసేన పార్టీ పెద్దఎత్తున ఆందోళనలు చేపడుతుందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ , జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి, మైనారిటీ నాయకులు షేక్ నాయబ్ కమాల్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.