Babu and PawanBabu and Pawan

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) చాలా వ్యూహాత్మకంగా జనసేనని (Janasena) దెబ్బకొడుతున్నారు. 2024 ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక (Anti Government Vote) ఓటు జనసేనకి వెళ్ళకుండా వైసీపికి (YCP) టీడీపినే (TDP) ప్రత్యర్ది అని ప్రజల్లోకి తీసుకెళుతున్నారు.

ఏప్పటికప్పుడు జనం (Public) మర్చిపోకుండా 2024లో టీడీపి-జనసేన (TDP-Janasena) కలిసిపోటీ చేస్తాయని తన పార్టీ నాయకులతో ప్రచారం చేపిస్తున్నాడు..ఏదో తెరచాటున కాదు బహిరంగంగానే పార్టీ మీటింగుల్లో చెప్పిస్తున్నాడు. తన మీద నమ్మకం లేక జారిపోతున్న క్యాడర్ (Party cadre), నాయకులని కాపాడుకోవడం వారి ప్రధాన వ్యూహం. జనసేన పార్టీని (Janasena Party) ప్రధాన పార్టీగా లేకుండా చేయడం రెండో వ్యూహం.

రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు

టీడీపి-వైసీపి (TDP-YCP) పొత్తు పెట్టుకున్నా ఆశ్చర్యపోవక్కరలేదు.. 2024లో ఏమి జరుగుతుందో పక్కన పెడితే..2024లో టీడీపితో పొత్తుకి జనసేన నేతలు (Janasena Leaders) ఒప్పుకోకుండా ఇప్పటికే ఉన్న బీజేపీ (BJP) తో కలిసి ఎన్నికలకి వెళితే..చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), తన పెంపుడు కుక్కలాంటి పచ్చమీడియాలు (Media).. జనసేన (Janasena) ఎక్కువ సీట్లు అడిగింది మేము 10 ఎమ్మెల్యే..2ఎంపీ ఇస్తాము అన్నాము, దానికి వాళ్ళు ఒప్పుకోలేదు, ఆ పార్టీకి అంతకన్నా ఇవ్వమని మేమే పొత్తు (Alliance) వద్దన్నాము అంటారు. ఇది జనసేన పార్టీ (Janasena Party) పుచికపుల్లలా తీసిపారేసే ఎత్తుగడ..జనసేన పార్టీని చాల తక్కువగా ప్రజల ముందు ఉంచడం అనేది జనసేనాని గమనించాలి.

రాజకీయాల్లో ఉన్నప్పుడు రాజకీయమే చేయాలి. జనసేన పార్టీ మీద చేస్తున్న కుట్రలని జనసేన అధినేత సమర్దవంతంగా ఎదుర్కోవాలి. నేనో..నువ్వో చెప్తే జనం నమ్మేస్తితిలో నేడు లేరు. జనసేన పార్టీ నుండి ఎదురుదాడి తీవ్రంగా ఉండాలి. ఎంతలా ఉండాలి అంటే ఇంకోసారి పొత్తు అనే మాట పచ్చ శ్రేణులు మాట్లాడకూడదు అనేలా ఉండాలి. కాని జనసేన పార్టీ నుండి నామమాత్రపు ఖండనలే ఉంటున్నాయి తప్ప ప్రతిఘటనలు ఉండడం లేదు.

నెలకొక ప్రెస్ మీటు సరిపోదు?

నేతలంతా ప్రెస్మీట్లు పెట్టి పొత్తు ఎందుకు జనసేనలో టీడీపిని కలిపేయండి లోకేష్ (Lokesh) కి రాష్ట్ర మంత్రి, చంద్రబాబుకి ఎంపీ టికెట్ ఇచ్చి బీజేపి-జనసేనలో పొత్తులో వచ్చే కేంద్ర మంత్రి పదవి చంద్రబాబుకి ఇస్తాము. బాబు, కొడుకులకి సరైన గౌరవం ఇస్తాము అని తీవ్రంగా ఎదురుదాడి ఒక రోజు కాదు వారం రోజుల పాటు చేస్తే..చంద్రబాబు ఇంకోసారి పొత్తు అనే విష ప్రచారం చేపించడు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) టీడిపితో (TDP) పొత్తు అనేదాని మీద ఆలోచన కాని, పొత్తు ప్రస్తావన కాని చేయడం లేదు. టీడీపి నుండి బయట వాగడం తప్ప, జనసేన అధినేత (Janasena President) దగ్గరకి వెళ్ళే సాహసం చేసేవారు లేరు. ఒకసారి మద్దతిచ్చి గెలిపిస్తే ఏమి చేసారో వాళ్ళకి బాగా తెలుసు. పొత్తు అనేది చంద్రబాబు ఆడిస్తున్న నాటకం మాత్రమే. ఇంతకు ముందే చెప్పాను రాజకియాల్లో (Politics) అప్పటి పరిస్తితిని ఎన్నికల ముందు ఏమైనా జరగొచ్చు, ఏ పార్టీలైనా కలవొచ్చు. మిత్రపక్షలుగా కొనసాగే పార్టీలు ఎన్నికల ముందు విడిపోవచ్చు, ప్రత్యర్దులుగా ఉన్న పార్టీలు కలవొచ్చు. కాని ఎన్నికలకి 2 ఏళ్ళ ముందే పొత్తులు (Alliance) అంటూ ఏపార్టీ కూడా ఆలోచించదు.

ఇక వైసీపీ (YCP)  అంటారా?..చంద్రబాబు కన్నా ఒక మెట్టు ఎక్కువే ఉండవచ్చు? దిగజారి తప్పుడు ప్రచారాలు చూపించడంలో ముందే ఉండవచ్చు. 2019లో జనసేన కమ్యూనిస్టులుతో కలిసిపోటీ చేసినా సరే జనసేన టీడీపికి “బి టీం” (B Team) అని నెలల తరబడి విషప్రచారం చేపించాడు అనేది అందరికీ తెలిసిందే. ఎవరు ఎక్కువ. ఎవరు తక్కువ అనేది ముఖ్యం కాదు. ఆ రెండు పార్టీలు జనసేనకు ప్రమాదకారినే అని జనసేనాని ఎంత కొందరగా తెలిసికొంటే అంత మంచిది.

Source : from Prasad Chigilisetty wall

మన జాతులు పుట్టింది పల్లకీలు మోయడానికేనా: ముద్రగడ