నిందలు భరిస్తూ సమస్యని పరిష్కరించిన చిరు
సినిమా టికెట్ ధరల (Cinema Ticket Rates) సమస్యని పరిస్కారంలో చిరంజీవి (Chiranjeevi) చూపిన చొరవ అమోఘం. ఈ విషయమై ఏపీ సీఎం జగన్‌ని (AP CM Jagan) సినీ రంగ ప్రముఖులు కొందరు కలిసి వచ్చిన తర్వాత చిరంజీవిని చాలా మంది చాలా రకాల మాటలన్నారు. మాలాంటి వారిని నెగ్గించడానికి చిరంజీవి గారు ఓ మెట్టు తగ్గి ఈ మాటలన్నీ పడ్డారు. చిరంజీవి గారే నిజమైన మెగాస్టార్ (Megastar). సినీ పరిశ్రమకి (Cinema Industry) పెద్ద అనిపించుకోవటం మీకు ఇష్టం ఉండదు. పరిశ్రమ బిడ్డగానే ఉంటానని అంటూ ఉంటారు. కానీ ఆయనే మా అందరికీ, సినీ పరిశ్రమకి పెద్ద. మేమంతా వారికి ఎంతో రుణపడి ఉంటాం అని దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి (S S Rajamouli) అన్నారు.
ఎన్టీఆర్ (NTR), రామ్‌చరణ్ (Ram Charan) హీరోలుగా రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం (RRR Movie) ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శనివారం రాత్రి చిక్‌బళ్లాపూర్‌లో ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేదికపై రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మా సినిమా బడ్జెట్, త్రీకరణ సమయంలో పడ్డ కష్టాల గురించి వివరించగానే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సినిమా టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చారు. ఇదంతా విజయం దిశగా ముందుకెళ్లడానికి మెగాస్టార్ చిరంజీవిగారే ప్రధాన కారణం. ఆయన చొరవ తీసుకుని సీఎం జగన్’తో మాట్లాడటం వల్లే సమస్యకి పరిస్కారం జరిగింది. సినిమాకు నష్టం కలగకుండా, ప్రేక్షకులకు భారం కాకుండా చక్కని ధరలతో ఏపీ ప్రభుత్వం ఒక జీవోని పాస్ చేశారు దర్శకుడు రాజమౌళి అన్నారు.
తెలంగాణ ప్రభుత్వంతో (Telangana Government) కూడా ఆయనే మాట్లాడారు. పెద్ద తరహాగా సమస్యను పరిష్కరించారు అని రాజమౌళి మెగాస్టార్ చిరంజీవిని కీర్తించారు.