CITU Meeting in JangareddygudemCITU Meeting in Jangareddygudem

సిఐటియు 16వ రాష్ట్ర మహాసభలు జయప్రదం చెయ్యాలని సిఐటియు జిల్లా కార్యదర్శి షేక్ సుభాషిని పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెంలో డిసెంబర్ 16 శుక్రవారం రోజున స్థానిక మున్సిపల్ ఆఫీస్ వద్ద పారిశుద్ధ్య కార్మికుల సమావేశం జి వెంకటేష్ అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగినది.

ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి షేక్ సుభాషిని మాట్లాడుతూ, సిఐటియు 16 వ రాష్ట్ర మహాసభలు జనవరి రెండున భీమవరంలో జరుగుతున్నాయని… దీనికి అన్ని రంగాల కార్మికులు హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా సిఐటియు రాష్ట్ర మహాసభలు ఉమ్మడిగా ఉన్నటువంటి పశ్చిమగోదావరి జిల్లాలో జరుగుతున్నందుకు ఆమె హర్షం వ్యక్తం చేశారు. జనవరి రెండో తేదీన 15 వేల మందితో భారీ ర్యాలీ ప్రదర్శన మూడు రోజులపాటు జరుగుతాయని… ప్రధానంగా కార్మికుల సమస్యలపై పనిచేయాలని దశ దిశ నిర్దేశించి… రానున్న మూడు సంవత్సరాల్లో ఏ విధంగా పోరాటాలు ఉండాలి అనేదే ఈ మహాసభ నిర్దేశిస్తుంది అని ఆమె పేర్కొన్నారు.

కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్ర మహాసభలకు హాజరై జయప్రదం చేయాలని ఆమె కోరారు. అనంతరం కార్మికుల నూతన కమిటీ ఏర్పాటు చేశారు. గౌరవ అధ్యక్షులుగా కామ్రేడ్ పి. సూర్యారావు అధ్యక్షులుగా కామ్రేడ్ బర్రె బాలరాజు, కార్యదర్శిగా కామ్రేడ్ గున్నూరి లక్ష్మణ్, మొత్తం 16 మందితో నూతన కార్యవర్గం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నూతన కమిటీకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో మరిన్ని పోరాటాలు చేసి హక్కులు సాధించుకోవాలని ఆమె హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పెంటయ్య, వై సత్యవతి, తులసి, వేల్పుల రాజు పాల్గొన్నారు.

— జంగారెడ్డిగూడెం నుండి గరువు బాబురావు

రంగులు గురించి కాదు రైతుల్ని పట్టించుకోండి: నాదెండ్ల