Jagan from TirupathiJagan from Tirupathi

దక్షిణాది రాష్ట్రాల సమావేశంలో గళమెత్తిన సీఎం జగన్‌

విభజన హామీలను నేవేర్చండి. కష్టాల్లో ఉన్నాం. మా సమ్యస్యలను పరిష్కరించండి అంటూ దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి (South Indian States Regional Council) సమావేశంలో ముఖ్యమంతి (Chief Minister) జగన్ (Jagan) తన ఆవేదన వెలిబుచ్చారు. ఆంధ్రప్రదేశ్‌కు (Andhra Pradesh) ప్రత్యేక హోదా (Pratyeka Hoda) అనే హామీతోనే రాష్ట్ర విభజన (AP Division) జరిగింది. ఏళ్లు గడిచినా కీలకమైన ఆ హోదా హామీని కేంద్రం ఇప్పటికీ నెరవేర్చలేదని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి (Jagan Mohan Reddy) పేర్కొన్నారు.

విభజన చట్టంలో పొందుపరచిన ప్రకారం పోలవరం ప్రాజెక్టును (Polavaram) కేంద్ర ప్రభుత్వమే (Central Government) కట్టాలి. అయితే 2013-14 అంచనాల ప్రకారమే నిర్మాణానికి నిధులిస్తామని కేంద్రం (central) అంటున్నది. మిగిలిన వనరుల్ని రాష్ట్ర ప్రభుత్వమే (State Government) సమకూర్చుకోవాలని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నది. ఇలా చెప్పడమంటే అప్పుడిచ్చిన హామీని (Promises) ఉల్లంఘించడమే. తాగునీటికి సంబంధించిన నిధుల్ని కూడా విడుదల చేయకుండా తప్పుకోవాలని కేంద్రం చూస్తున్నట్లు అనిపిస్తున్నది అని జగన్ (Jagan) విమర్శించారు.

కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Sha) అధ్యక్షతన తిరుపతిలో (Tirupati) ఆదివారం జరిగిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో ముఖ్యమంత్రి జగన్‌ మాట్లాడారు. రాష్ట్ర పునర్విభజన బిల్లు-2014 (AP State Re-organization Bill) ఆమోదం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలను కేంద్రం ఇప్పటివరకు నెరవేర్చలేదు. రాష్ట్ర విభజన జరిగి ఏడేళ్లు కావస్తున్నది. కానీ ఇప్పటికీ వాటిని అమలు చేయకపోవడంతో రాష్ట్రం ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా అనేక సమస్యల్ని ఎదుర్కొంటోంది అని జగన్ తన ఆవేదనని వెలిబుచ్చారు. దేశ సమగ్ర పురోగతికి అంతర్‌రాష్ట్ర సంబంధాల పరిపుష్టి కూడా ఎంతో ముఖ్యం. రాష్ట్రాల మధ్య నెలకొన్న పలు సమస్యలను నిర్ణీత వ్యవధిలో సామరస్యపూర్వకంగా పరిష్కరించేలా కేంద్ర ప్రభుత్వమే ఒక కమిటీని ఏర్పాటు చేయాలి అని కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను జగన్ కోరారు.

ఈ సందర్భంగా జగన్‌ ఏడు ప్రధాన అంశాలను ప్రస్తావించారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా వీటిపై కేంద్ర ప్రభుత్వం అత్యవసర జోక్యం చేసుకోవాలని ఆంధ్ర ముఖ్యమంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు. అయితే కీలమైన అంశాలపై కేంద్రం నుండి సానుకూమైన హామీ వచ్చినట్లు లేదు.

ముగ్గురు సీఎంలు గైర్హాజరు!

సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ భేటీకి తెలంగాణ (Telangana), తమిళనాడు (Tamilnadu), కేరళ (Kerala) ముఖ్యమంత్రులు హాజరు కాలేదు. సమావేశంలో ఆంధ్ర, కర్ణాటక (Karnataka), పుదుచ్చేరి సీఎంలు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి, బసవరాజ్‌ బొమ్మై, రంగసామి, తెలంగాణ గవర్నర్‌, పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమిళి సై, తెలంగాణ హోం మంత్రి మహమూద్‌ అలీ, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, కేరళ ఆర్థికమంత్రి కేఎన్‌ బాలగోపాల్‌, తమిళనాడు ఉన్నత విద్యామంత్రి పొన్ముడి, అండమాన్‌ నికోబార్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అడ్మిరల్‌ డీకే జోషీ, లక్షద్వీప్‌ అడ్మినిస్ట్రేటర్‌ ప్రపుల్‌ ఖోడా పటేల్‌, కేంద్ర హోం కార్యదర్శి అజయ్‌కుమార్‌ భల్లా, అంతర్రాష్ట్ర మండలి సచివాలయ కార్యదర్శి అనూరాధా ప్రసాద్‌, ఏపీ సీఎస్‌ సమీర్‌ శర్మ పాల్గొన్నారు.

ప్రతినిధులకు జగన్‌ విందు

మధ్యాహ్నం 3.10గంటలకు సమావేశం ప్రారంభం అయినది. ఈ సమావేశంలో అంశాల వారీ చర్చ జరిగింది. సాయంత్రం సుమారు 6.45కు భేటీ ముగిసింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం జగన్‌ ఆయా రాష్ట్రాల సీఎంలు, అధికారులకు చక్కటి విందు ఏర్పాటు చేశారు.

కుల సంఘ నాయకులారా! ఈ ప్రశ్నకు బదులివ్వండి