జగన్ – బాబులు (Jagan – Babu) వెనుక అధికారంతో వచ్చిన వ్యవస్థలు (Government Systems),
అధికారాన్ని (Politica Power) అడ్డుపెట్టుకొని సంపాదించిన సంస్థలు,
వాళ్ళు వేసే బోరికలకు ఆశపడి చుట్టూ చేరిన అనుచర గణాలు
ఉన్నాయి తప్ప ఈ ఇద్దరు బాబులు వెంట జనాలు లేరు.
కానీ జనసేనాని (Janasenani) చుట్టూ లక్షలాది మంది యువత ఉన్నారు.
మహిళలు, వృద్దులు ఉన్నారు.
కర్షకులు, కార్మికులు, విద్యార్థులు, ఉద్యోగులు ఉన్నారు.
బాబు అరెస్టు నేపథ్యంలో మీ కోసం రాత్రికి రాత్రే
వచ్చిన జన సందోహాన్నిచూస్తే ఇదే నిరూపితం అయ్యింది.
పరిస్థితులను అనుకూలంగా మార్చుకొందాం అన్నా అంటూ ఆవేదన చెందుతున్నారు.
జగన్ – బాబుల అరెస్టుల డ్రామాల్లో మా అన్న ఎక్కడ నలిగిపోతాడో
అని మన జనసైనికులు తల్లడిల్లి పోతున్నారు.
పాలకుల పెరట్లోని మన పాలికాపులు విసురుతున్న
మాటల తూటాలకు మన సైనికులు కుమిలిపోతున్నారు.
జనసేన ఎదుగుదలను చూసి ఓర్వలేని పాలకులు ఇద్దరూ
“ఆడుతున్న అరెస్టుల నాటకాల్లో మనం బలి కావద్దు.
అవినీతి కేసులతో జైళ్లు కెళ్లిన జగన్ – బాబులు ఇకపై మాకొద్దు.
నీతికి-నిజాయితీ మారుపేరు అయిన పవన్ కళ్యాణ్ మాత్రమే కావాలని
యావత్తు ఆంధ్రులు కోరుకొంటున్నారు. నీ క్షేమం కోసమే పరితపిస్తున్నారు.
పవన్ అన్నా! మీ ద్వారానే మార్పు సంభవిస్తుంది అని సేనాని కోసం ఎదురు చూస్తున్నారు.
ఆలోచించండి… బలమైన రాక్షసుడ్ని ఓడించడానికి ముమ్మాటికీ పొత్తులు అవసరమే. మీ ఎత్తులు సక్రమమే కావచ్చు. కానీ ఆ పొత్తుల ఎత్తులలో మా పవన్ అన్న చిత్తూ అవుతాడేమో అని మీ అనుచరులు బెంగ పెట్టుకొని చస్తున్నారు. జరా! సముదాయించండి.(It’s from Akshara Satyam).