Chiru as Acharya

ఈ నెల 20 నుంచి షెడ్యూల్

ఆచార్య (Acharya Movie) సినిమా కోసం చిరంజీవి (Chiranjeevi) రంగంలోకి దిగబోతున్నారు . ఇక నుంచి ఏకధాటిగా సినిమా చిత్రీకరణ జరిగేలా ప్రణాళికలు రూపొందించినట్టు తెలుస్తోంది. ఆ మేరకు ఈ నెల 20 నుంచి కథానాయకుడు చిరంజీవి, డిసెంబరు 5 నుంచి కథానాయిక కాజల్‌ (Kajal) చిత్రీకరణకి హాజరు కానున్నారని సమాచారం అందుతున్నది. కరోనా (covid) ప్రభావంతో చిత్రీకరణలు ఆగిపోయాక చిరంజీవి మళ్లీ సెట్స్‌పైకి వెళ్లలేదు. ఇటీవలే చిత్రీకరణ పునః ప్రారంభమైంది. అయితే కొవిడ్‌ – 19 టెస్ట్‌లో చిరంజీవికి పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆయన కెమెరా ముందుకు వెళ్లలేకపోయారు. చిరంజీవికి లక్షణాలేవీ లేకపోవడంతో మరోమారు పరీక్షలు చేయించుకోగా నెగిటివ్‌గా తేలింది. దాంతో ఆయన ఇక కెమెరా ముందుకు వెళ్లేందుకు సన్నద్ధమయ్యారు అని తెలుస్తున్నది. ‘ఆచార్య’లో చిరుతోపాటు ఆయన తనయుడు రామ్‌చరణ్‌ కూడా నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు అన్న విషయం అందరికీ తెలిసిందే.

నవరస నటనాసార్వభౌముడు కైకాల సత్యనారాయణ ఇక లేరు