కర్ణాటక (Karnataka) 20వ ముఖ్యమంత్రిగా (Chief Minister) బసవరాజ్ బొమ్మై (Basavaraj Bommai) ప్రమాణ స్వీకారం చేశారు. కర్ణాటక రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ బొమ్మైతో బుధవారం ప్రమాణ స్వీకారం చేయించారు. మాజీ ముఖ్యమంత్రి యడియూరప్పతో కలిసి ఆయన రాజ్‌భవన్‌కు చేరుకున్నారు.
బసవరాజ బొమ్మై ఎంపికలో మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప కీలకపాత్ర పోషించారు అని తెలుస్తున్నది. యడియూరప్ప అత్యంత ఆప్తుల్లో బసవరాజ బొమ్మై ఒకరు. అందుకే ఆయన నాయకత్వాన్ని దాదాపు అందరూ ఆమోదించారు. యడియూరప్ప అయన పేరును శాసనసభాపక్ష సమావేశంలో ప్రతిపాదించగా. మాజీ ఉపముఖ్యమంత్రి గోవింద కారజోళ ఆమోదం తెలిపారు. మంగళవారం వరకు ఎంతోమంది ఆశావహుల పేర్లు పరిశీలనలో ఉన్నవి. కానీ చివరకు బసవరాజ బొమ్మై పేరును అధిష్ఠానం ఖరారు చేసింది. ముగ్గురు ఉప ముఖ్యమంత్రులను ఇదే సందర్భంగా నియమించారు. ఆర్.అశోక్, బి.శ్రీరాములు, గోవింద కారజోళ ఉప ముఖ్యమంత్రి పదవులకు ఎంపికయ్యారు.