NimmagaddaNimmagadda

హైకోర్టుని ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరొక్కసారి ఆశ్రయించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన నిధులు అందడం లేదని నిమ్మగడ్డ ఆరోపించారు. రాష్ట్ర ఎన్నికల కమీషనర్ (SEC ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరోసారి రాష్ట్ర హైకోర్టుని ఆశ్రయించారు. ఎన్నికల సంఘం నిర్వహణకు కావాలిసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం నుండి అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్లు ఆయన ఒక పిటిషన్లో పేర్కొన్నారు. ఎస్ఈ సీ వ్యవహారంలో ప్రభుత్వ వైఖిరిని గమనిస్తున్నాము అని న్యాయమూర్తి వ్యాఖ్యానించినట్లు తెలుస్తున్నది. ఏదైనా అవసరం ఉంటే ఎన్నికల కమిషన్ తమను సంప్రదించ వచ్చు అని ప్రభుత్వ న్యాయవాది సూచించగా మేము గమనిస్తే తప్పు ఏమిటని హైకోర్ట్ ప్రశ్నించినట్లు తెలుస్తున్నది. ప్రభుత్వ వైఖిరితో ఎన్నికల సంఘం హైకోర్టుని ఆశ్రయించి రావడం విచారకరం అని బాధాకరం అని న్యాయమూర్తి అభిప్రాయం పడినట్లు తెలుస్తున్నది.

మరో పక్కన ఈ వ్యవహారంలో నిమ్మగడ్డ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రూ 39 లక్షల నిధులు విడుదల చేసినట్లు కూడా తెలుస్తున్నది. పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉంది.