Pawan Kalyan at NIT

సమాజానికి సేవ చేయాలనే ధృడ సంకల్పంతోనే రాజకీయాల్లోకి వచ్చాను. సంపాదన కోసమో, పదవులు కోసం కాదని జనసేనాని పవన్‌కల్యాణ్‌ అన్నారు. వరంగల్‌ నిట్‌లో వసంతోత్సవం (Spring Spree) కార్యక్రమాన్ని నిట్ సంచాలకుడు ఆచార్య ఎన్‌.వి.రమణారావుతో ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ కీలకోపన్యాసం చేసారు.

జనసేనాని పవన్ కళ్యాణ్ నిట్, వరంగల్’లో యువతకి ఉత్తేజాన్ని ఇచ్చే, జాతీయ సమగ్రతని పెంచే ఉపన్యాసం ఇచ్చారు. జనసేనాని ప్రసంగిస్తున్నంత సేపు యువత కేరింతలు కొట్టారు. ఊగిపోయారు. పవన్ కళ్యాణ్ ప్రసంగానికి బాటా ప్రభావితులు అయ్యారు అని చెప్పాలి.

‘నేను కళాశాలలు, యూనివర్సిటీలకు వెళ్లలేదు. అయినా నిత్య విద్యార్థిని. ప్రతికూల పరిస్థితులను చూసి వెనకడుగు వేయొద్దు. నేడు విఫలమైనా రేపు తప్పకుండా గెలిచి తీరుతాం. పేటెంట్లు వచ్చినంత మాత్రాన ఆవిష్కరణ గొప్పది కాదు. సమాజానికి అది ఎంతవరకు మేలు చేస్తుందన్నదే ముఖ్యం అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు.

లక్షల మంది కలరా బాధితుల ప్రాణాలు నిలుపుతున్న ‘ఓఆర్‌ఎస్‌’ ద్రావణాన్ని కనుగొన్న డాక్టర్‌ దిలీప్‌ లాంటి వారు చేసిన ఆవిష్కరణలు ఎంతో గొప్పవి’ అని పవన్స్ప కళ్యాణ్ స్పష్టం చేశారు.

న్యూజిలాండ్‌లో స్థిరపడాలనుకొనే రోజుల్లో…

సినిమా వల్ల నాకెంతో పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. ఖుషీ సినిమా తర్వాత న్యూజిలాండ్‌లో స్థిరపడదామని అవసరమైన ఇమ్మిగ్రేషన్‌ కాగితాలను కూడా సిద్ధం చేసుకున్నా. తర్వాత కష్టమైన, నష్టమైనా ఈ దేశంలోనే ఉండాలని అనిపించింది. ఈ దేశంలోనే ఉండి, పుట్టినగడ్డకు నావంతు సేవ చేయాలని నిర్ణయించుకున్నా.

నల్గొండలో ఫ్లోరైడ్‌ బాధితుల కడగండ్లు, ఆదిలాబాద్‌ తండాల్లో గిరిజన తాగునీటి కష్టాలు లాంటి పేద ప్రజలు ఇబ్బందులు నన్ను కదిలించాయి. అలాంటి వారికి సేవ చేయాలని నిర్ణయించుకున్నా అని జనసేనాని పవన్‌ కళ్యాణ్ వివరించారు.

పవన్‌కల్యాణ్‌ ప్రసంగిస్తుండగా ఆయన్ని దగ్గర నుంచి చూసేందుకు విద్యార్థులు పెద్ద సంఖ్యలో వేదిక వద్దకు దూసుకు రావడంతో వారిని కట్టడి చేసేందుకు పోలీసులు స్పల్ప లాఠీఛార్జి చేయాల్సి వచ్చింది.

పోలవరం ప్రాజెక్టుకి శాపంగా మారిన ప్రభుత్వ విధానం: నాదెండ్ల