ఏపీ జేఏసీ అమరావతి, ఏపీ జేఏసీ ఉమ్మడి ప్రకటన
ఏపీ ఉద్యోగుల (AP Employees) సమస్యలను పరిష్కరించకపోతే పోరాటం చెయ్యడానికి సిద్ధమని ఏపీ ఉద్యోగ సంఘాలు (AP Employees Unions) హెచ్చరించాయి. మా ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతాలు, విశ్రాంత ఉద్యోగులకు ఏడో తేదీకి కూడా పింఛన్లు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఏపీ ప్రభుత్వం (AP Government) ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్ని, కరోనాను (Carona) దృష్టిలో పెట్టుకుని ఇంతకాలం ఓపికతో ఉన్నాం. ప్రభుత్వంతో సహకరిస్తూ వచ్చాం. మా ఉద్యోగుల ప్రయోజనాల్ని ఇంకెంత వరకు మేము తాకట్టు పెట్టాలి?’ అని ఉద్యోగ సంఘాలు (Employees unions) ప్రభుత్వాన్ని నిలదీశాయి. తమ సహనాన్ని పరీక్షించడం భావ్యం కాదని హెచ్చరించాయి.
మా కష్టాలు వినడానికి ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వంలో ఎవరికి గోడు వెళ్లబోసుకోవాలో తెలియని అయోమయ పరిస్థితుల్లో మా ఉద్యోగ సంఘాలు ఉన్నాయి అని ఉద్యోగ సంఘాలు ధ్వజమెత్తారు. జీతాలు సకాలంలో అందడంలేదు అనే తీవ్ర మనోవేదనతో ఉద్యోగులు ఉన్నారని… ఇప్పటికైనా ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించకపోతే సమైక్యంగా పోరాడతామని… ఉమ్మడి పోరాటానికి కార్యాచరణ ప్రకటిస్తామని ఉద్యోగ సందేహాలు స్పష్టం చేశారు.
ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు:
వివిధ శాఖల ఉద్యోగులు, పొరుగుసేవల ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు జీతాలు, పింఛన్లు, ఉద్యోగులు, పోలీసుల సరెండర్ లీవులు, పదవీ విరమణ చేసిన, చేయబోతున్నవారి ఆర్థిక బకాయిలు, ఉద్యోగులు దాచుకున్న జీపీఎఫ్, ఏపీజీఎల్‌ఐ, ఇతర ఆర్థికపరమైన చెల్లింపుల విషయంలో AP Employees Union Warning to Jagan Government“>ఆర్థికశాఖ తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం.
మా పాలిట గుదిబండలా మారిన సీఎఫ్‌ఎంఎస్ విధానాన్ని తక్షణం రద్దు చేయాలి.
వైకాపా (YCP) అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఇచ్చిన హామీలు అమలు కాలేదు. ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విశ్రాంత ఉద్యోగులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న డీఏ బకాయిల్ని, పీఆర్‌సీ సిఫారసుల ప్రకారం ఇవ్వాల్సిన ప్రయోజనాల్ని సంక్రాంతిలోగా చెల్లించాలి.
సీపీఎస్‌ను (CPS) రద్దు చేసి పాత పింఛను విధానాన్ని అమలు చేయాలి.
ఉద్యోగుల ఆరోగ్య పథకానికి మా జీతాల నుంచి కోట్ల రూపాయల చందా వసూలు చేస్తున్నారు. అయినా కూడా, సరైన వైద్య సేవలందించడం లేదు. ప్రైవేటు ఆస్పత్రుల్లో లక్షల రూపాయలు ఖర్చు పెట్టలేక నానా అవస్థలు పడుతున్నాం. ఈ సమస్యను ప్రభుత్వం నిర్దిష్ట వ్యవధిలో పరిష్కరించాలి. లేకపోతే ఈ పథకాన్ని రద్దు చేసి మా చందాను, ప్రభుత్వ చందాను కార్పొరేట్ బీమా సంస్థలకు అప్పగించి మెరుగైన వైద్యసేవలందించాలి.
డీఎస్సీల (DSC) ద్వారా ఎంపికైన కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని వెంటనే క్రమబద్ధీకరించాలి. దశలవారీగా మొత్తం కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని క్రమబద్ధీకరించి, ఆ వ్యవస్థను రద్దు చేయాలి.