Vedavathi_refuses_RavanaVedavathi_refuses_Ravana

మహిషాసురుడు (Mahishasurudu) వంశములో పుట్టిన ఋరువు అనే రాక్షసుడు సమాజములోని తన వారిని తప్పించి మిగిలిన వారినందరిని పట్టి పీడిస్తుండేవాడు. అప్పుడు బ్రహ్మ (Brahma) సలహా ప్రకారము ఆ ఋరువుని సంహరించడానికి ధనుర్మాసము అంతా పూజ చేసి ఆఖరి రోజున భోగిమంటలు (Bhogi) వేసి ఆ మంటలతో ఆ ఋరువు అనే రాక్షసుడిని, రాక్షస పాలనని దహించివేశారు. ఆవిధంగా రాక్షస పాలన పీడని వారు తొలగించుకొన్నట్లు మన పురాణాలు చెబుతున్నాయి.

మన సమాజములో లౌకిక వ్యామోహాలు, వర్గ, కుల వాత్సల్యాలతో బలవంతులైన “పెద్దన్నల పార్టీలు” ఆధిపత్యం వహిస్తున్నారు. తమ ఆధిపత్య అహంకారంతో ఆ పెద్దన్నలు తన వారిని తప్పించి మిగిలిన తాడిత పీడిత భాదిత వర్గాలకు (Suppressed classes) చెందిన వారిని పరి పరి విధాలుగా హింసిస్తున్నారు. అలానే బాధిస్తూ, అణగారిన వర్గాల (Weaker sections) ఆర్ధిక మూలలను దెబ్బతీయడానికి ప్రయత్నాలు చేయడం చూస్తున్నాం.

పవిత్ర ఆలయాలలో క్షుద్ర పూజలు, విగ్రహాల ద్వంశం లాంటివి చేస్తున్న విద్రోహులు పట్టు పడడం లేదు. కానీ శాంతి హోమాలు చేసిన వారిని, ప్రజా సేవ చేస్తున్న జన నాయకులు లాంటివారిని తమ గ్లోబల్ ప్రచారము ద్వారా మానసికముగా వేధిస్తూ ఉండడము కూడా చూస్తున్నాము.

తమ అవినీతితో, దోపిడీతో వెనకేసికొన్న కోట్లతో “పెద్దన్నలు” వ్యవస్థలను తమ చెప్పు చేతల్లో పెట్టుకొంటున్నారు అనే ఆవేదన సమాజాన్ని ఆవరించింది. మన “పేదన్నలు” మాత్రం చెప్పులు చేతుల్లో పట్టుకొని జీ హుజూర్ అంటూ తాయిలాలు కోసం ఎగబాకుతున్నారు. వీరికి వీరి పాపిష్టి మీడియా, కక్కుర్తి మేధావులు, బానిస కులనాయకులు వత్తాసు పలుకుతున్నారు? అంటూ యువత నిస్తేజంలో ఉంటున్నది.

చచ్చుబడ్డ వ్యవస్థలను బ్రతికించాలి. తాయిలాల కోసం రాజీపడుతూ అవినీతి నాయకులను ఎన్నుకొంటున్న ప్రజలను జాగృత పరచాలి. ప్రజల్లో చైతన్యం తేవాలి అని వస్తున్న నాలాంటి వారు మాత్రం “మార్పు అనే పండగ” ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు.

ఆ రోజుల్లో ఆ భోగి మంటలలో ఆ రాక్షసుడుని దహించి, అతని పీడని వదిలించుకొన్నట్లే… నేటి సమాజాన్ని పట్టి పీడిస్తున్న పాపిష్టి మీడియా, కక్కుర్తి మేధావులు, బానిస కులనాయకుల పక్షపాత వైఖిరి కూడా భోగిమంటల్లో దహింప బడాలి? ఇదే మన అందరి ధృడ సంకల్పము అయితే దానికి ఆ భగవంతుని ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి అనేది అక్షర సత్యం (Akshara Satyam).

నేటి పెద్దన్నల పార్టీలు తమ స్వార్ధంతో సృష్టిస్తున్న “సంకుల సమరాన్ని” భోగిమంటల్లో దహించిన తరువాత వచ్చేదే నిజమైన సంకురాత్రి (సంక్రాంతి) . అది కొందరిది మాత్రమే కాదు అందరిదీ అవుతుంది. అదే జరిగిన రోజున సకల జనులకు ప్రతీ రోజు సంక్రాంతే.

భోగి, మరియూ మకర సంక్రాంతి (Sankranti) సందర్భముగా మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ భోగ భాగ్యాలు, ఆరోగ్యం, ఆ ఈశ్వరుని అనుగ్రహము ఎల్లవేళలా కలగాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకొంటూ…..

మీ Akshara Satyam

పరిశ్రమ పెద్దగా కాదు బిడ్డగా వచ్చా: చిరు