AP DGPAP DGP

గుంటూరులో టెన్నిస్ టోర్నమెంట్ ప్రారంభించిన సీఐడీ చీఫ్ సునీల్ కుమార్
సీఐడీ వ్యవస్థను అందరికీ తెలిసేలా చేశారన్న మీడియా ప్రతినిధి
పరిస్థితుల వల్లే సీఐడీ వెలుగులోకి వచ్చిందన్న డిజిపి సునీల్ కుమార్

ఏపీ సీఐడీ చీఫ్, డిజిపి (AP DGP) పి.వి.సునీల్ కుమార్ ( P V Sunil Kumar) శనివారం గుంటూరు పోలీసు కార్యాలయంలో ఇన్విటేషన్ డబుల్స్ టెన్నిస్ టోర్నమెంట్’ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనను మీడియా (AP Media) ముచ్చడించింది.

“సీఐడీ వ్యవస్థను వెలుగులోకి తెచ్చారు… ఏమనిపిస్తోంది సార్? గతంలో పోలీసులు అంటే తెలిసేది… ఇప్పుడు సీఐడీని కూడా పబ్లిక్ కి తెలిసేలా చేశారు” అంటూ సునీల్ కుమార్ ను ఓ రిపోర్టర్ అడిగారు. అందుకు సునీల్ కుమార్ నవ్వుతూ బదులిచ్చారు. తాను వచ్చాక సీఐడీ తెరపైకి రాలేదని, పరిస్థితుల వల్లే సీఐడీ వెలుగులోకి వచ్చిందని అన్నారు.

ప్రభుత్వంపై విమర్శలు చేస్తే చాలు… సునీల్ కుమార్ అక్రమ కేసులు బనాయిస్తున్నాడని టీడీపీ నేతలు అంటున్నారు… దీనిపై మీరేమంటారని ఆ మీడియా ప్రతినిధి అడగ్గా… “అందరూ ఏవేవో మాట్లాడు తుంటారు… ఆ కేసులు అక్రమమో, సక్రమమో తేల్చడానికి కోర్టులు ఉన్నాయి కదా?” అని సునీల్ కుమార్ వ్యాఖ్యానించారు

— T V Govinda Rao, High court Advocate, Hyderabad

ప్రజావ్యతిరేక ప్రభుత్వంపై యువత తిరుగుబాటుకు సిద్ధం!

Spread the love