సమీక్షా సమావేశంలో పశ్చిమ గోదావరి ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ
ఇతర జిల్లాల నుండి జిల్లాలోకి వస్తున్న గంజాయి (Ganja) అక్రమ రవాణాను (Illicit Transport) అరికట్టేందుకు జిల్లా పోలీస్ (District Police) సిబ్బంది ముమ్మర వాహన తనిఖీలు (vehicles checking) నిర్వహించాలని జిల్లా ఎస్పీ సూచించారు. ఏలూరు పోలీస్ ప్రధాన కార్యాలయం (Eluru Police Head quarters) సమావేశం మందిరములో పశ్చిమ గోదావరి జిల్లా (West Godavari District) ఎస్పి రాహుల్ దేవ్ శర్మ తన సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఉన్న స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు, పోలీస్ సిబ్బందితో నేర సమీక్షా సమావేశమును (Review meeting) బుధవారం నాడు నిర్వహించారు.
సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ గంజాయి రవాణా చేయాలoటేనే రవాణా దారుల గుండెల్లో వణుకు పుట్టే విధముగా సిబ్బంది విధి నిర్వహణలో చురుకుగా పని చేయాలని అన్నారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో టాస్క్ ఫోర్స్ (Special Enforcement task force) అధికారులు అందరూ ఎప్పటికప్పుడు ఆకస్మిక తనిఖీ లు నిర్వహించాలని ఆయన తెలిపారు. ప్రజల యొక్క ప్రాణాలకు ముప్పు కలిగించే నాటు సారాయి తయారీ కేంద్రములపై, అక్రమ రవాణా దారులపై దాడులు నిర్వహించాలని ఎస్పీ చెప్పారు.
ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వము (Government) వారు నిషేధించిన గుట్కా (Gutka), ఖైనీ (Khaini), పాన్ పరాగ్ (Pan Parag) అమ్మకము దారులుపై (Sellers) దాడులు నిర్వహించాలని ఆదేశించారు. అలాగే ఉద్యోగ నిర్వహణలో ఉన్న అధికారులు అవినీతికి పాలుపడరాదని, నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని కోరారు. సిబ్బంది యొక్క సంక్షేమం కొరకు అధిక ప్రాధాన్యత ఇస్తామని కూడా ఎస్పీ ఈ సమావేశంలో తెలిపారు. అదనపు ఎస్పీ మాట్లాడుతూ అవినీతికి పాల్పడే అధికారులను ఉపేక్షించేది లేదని శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులులకు హెచ్చరికలు జారీ చేసినారు. ఈ సమావేశంనకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు ఎస్పీ శ్రీ సి.జయ రామరాజు, ఎస్.ఇ.బి అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ చౌదరి, జిల్లాలో ఉన్న అన్ని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు హాజరు అయ్యారు.