Roads in APRoads in AP

సోషల్ మీడియాను హోరెత్తించిన జనసేన
#GoodMorningCMSir కి 3.55 లక్షల ట్వీట్స్

• 218 మిలియన్ల మందికి చేరువైన ఏపీ రోడ్ల దుస్థితిని

#GoodMorningCMSir హ్యాష్ ట్యాగ్’తో (Hashtag) జనసేన పార్టీ (Janasena Party) చేసిన డిజిటల్ క్యాంపెయిన్ (Digital Campaign) సోషల్ మీడియాని (Social media) హోరెత్తించింది. ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో రహదారులు ఎంత అధ్వాన్నంగా ఉన్నాయో రాష్ట్ర ముఖ్యమంత్రికి (Chief Minister) తెలిసేలా #GoodMorningCMSir హ్యాష్ ట్యాగ్ తో డిజిటల్ క్యాంపెయిన్ చేయాలని జనసేన (Janasena) అధ్యక్షులు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పిలుపునిచ్చారు. జనసేనాని ఇచ్చిన ఈ పిలుపుకి విశేష స్పందన లభించింది.

శుక్రవారం ఉదయం 8గం.కు పవన్ కల్యాణ్ కోనసీమలోని (Konaseema) కొత్తపేట దగ్గర ఉన్న రోడ్డు ఛిద్రమై ఉన్న వీడియోను పోస్ట్ చేసి #GoodMorningCMSir అని ట్యాగ్ చేశారు. అలాగే ప్రత్యేక వ్యంగ్య చిత్రాన్ని (Cartoon) ట్వీట్ చేశారు. అప్పటి నుంచి ఈ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో నిలిచింది.

ట్వీట్స్ మొదలైన తొలి రెండు గంటల్లోనే ట్రెండింగ్లో (Trending) 1వ స్థానానికి చేరింది.
తొలి రోజు 3.55 లక్షల ట్వీట్స్ వచ్చాయి. వీటి ద్వారా రాష్ట్రంలోని నలుమూలల నుంచీ గతుకులమయమై నరకప్రాయంగా ఉన్న రోడ్లను చెప్పే ఫోటోలను, వీడియోలను పోస్టు చేశారు. ఈ ట్వీట్స్ 218 మిలియన్ల మందికి చేరువైనట్లు గణాంకాలు తెలుపుతున్నాయి.

ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు (Janasena Leaders), వీర మహిళలు (Veera Mahila), జన సైనికులతోపాటు (Janasainiks) యువత భారీగా పాల్గొన్నారు.

జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) శుక్రవారం ఉదయం మండపేట (Mandapeta) నియోజకవర్గంలో మండపేట నుంచి కోరుమిల్లి, కపిలేశ్వరపురం వెళ్ళే రోడ్డులోని గోతులను చూపిస్తూ ట్వీట్ చేశారు. ఆ తరవాత కోరుమిల్లి – జొన్నాడ రోడ్డునీ, కొత్తపేట నియోజకవర్గంలోని రావులపాలెం-కాకినాడ ప్రధాన రోడ్డు దుస్థితినీ తెలుపుతూ ట్వీట్స్ చేశారు.

సోషల్ మీడియాలో #GoodMorningCMSir ట్రెండింగ్