రోడ్లు ఈత కొలనులను తలపిస్తున్నాయి
రోడ్ల దుస్థితి తెలిపేలా #GoodMorningCMSir అనే డిజిటల్ క్యాంపెయిన్
రాష్ట్రంలో గోతుల మధ్య రోడ్డును వెతుక్కోవలసిన పరిస్థితి నెలకొంది. రోడ్ల మీద ప్రయాణిస్తున్నప్పుడు ఒకటీఅరా గోతులు కనిపించడం సహజం. కానీ మన ఏపీలో రోడ్ల పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉంది. కొన్ని రహదారులను (Roads) చూస్తుంటే ఏకంగా స్విమ్మింగ్ పూల్స్ ను (Swimming pool) తలపిస్తున్నాయి అని జనసేనాని (Janasenani) ఏపీ ప్రభుత్వాన్ని (AP Government) ఎద్దేవా చేసారు.
రోడ్ల అభివృద్ధి, కనీసం మరమ్మతులు చేయాలనే బాధ్యతను వైసీపీ ప్రభుత్వం (YCP Government) గాలికొదిలేసింది. వారికి బాధ్యత గుర్తు చేయాలనే #GoodMorningCMSir అనే హాష్ ట్యాగ్’తో ఈ నెల 15, 16, 17 తేదీల్లో జనసేన పార్టీ డిజిటల్ క్యాంపెయిన్ (Digital campaign) ప్రారంభిస్తోంది. జులై నెల 15 నాటికల్లా దెబ్బ తిన్న రోడ్ల మరమ్మతు (Repairs of Roads) పనులు పూర్తి చేసి ప్రతిపక్షాల నోరు మూయిస్తామని ముఖ్యమంత్రి ఛాలెంజ్ (Challenge) చేశారు. ఆ ఛాలెంజ్ ను స్వీకరించి రోడ్ల దుస్థితిపై ముఖ్యమంత్రి (Chief Minister Jagan) కళ్లు తెరిపించాలనే ఉద్దేశంతో ఈ డిజిటల్ క్యాంపెయిన్ కు శ్రీకారం చుట్టాం అని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వివరించారు.
దెబ్బ తిన్న రోడ్ల దుస్థితిపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని #JSPForAP_Roads అనే హాష్ ట్యాగ్’తో గత ఏడాది సెప్టెంబర్ 2, 3, 4 తేదీల్లో డిజిటల్ క్యాంపెయిన్ చేశాం అని జనసేనాని గుర్తు చేసారు.
పందుల కోసం రోడ్లు వేయడం మానేశారు
ఆర్ అండ్ బి (R&B) పరిధిలో స్టేట్ హైవేలు (Highway) 14,722 కి.మీ, మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్లు (District Roads) 32,240 కి.మీ, ఇతర రోడ్లు 6100 కి.మీ ఉన్నాయి. ముఖ్యంగా 9,222 కి.మీ పంచాయతీ రోడ్లు (Panchayat Roads) మరమ్మతుల కోసం రూ.1,072 కోట్లు కేటాయించామని ప్రభుత్వం (Government) ఏప్రిల్ నెలలో ప్రకటించింది. దెబ్బ తిన్న రోడ్ల మరమ్మతు పనులు జోరుగా సాగుతున్నాయని చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం మరో రకంగా ఉంది. రోడ్లపై పందులు స్వైర విహారం చేస్తున్నాయి. మూగ జీవాలు కదా.. వాటిని ఎందుకు ఇబ్బంది పెట్టాలి అనుకున్నారో ఏమోగానీ వైసీపీ నాయకులు (YCP Leaders) రోడ్లు వేయడం మానేశారు అని పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని విమర్శించారు.
ఆ నిధులు ఎటు పోతున్నాయ్…?
ఏటా కనీసం 8 వేల కిమీ రోడ్లు మెయింటినెన్స్, మరమత్తు పనులు చేయాలి. ఇందుకోసం దాదాపు రూ.1500 కోట్లు కేటాయించాల్సి ఉంటుంది. ఇది కాకుండా పీరియాడికల్ మెయింటినెన్స్ (Periodical maintenance), రిపేర్లు చేయాలి. ఇందుకోసం మరో రూ.500 కోట్లు అదనంగా అవసరం ఉంటుంది. నాన్ ప్లాన్ బడ్జెట్లో (Non-budget) చూపిస్తారు. అయితే దీనిపై ప్రభుత్వం దృష్టిపెట్టడం మానేసింది. ఈ మూడేళ్లలో మెయింటినెన్స్, మరమత్తు పనులు చేయకపోవడంతో రహదారులు చాలా వరకు దెబ్బ తిన్నాయి. 30 వేల కిమీ మేర రోడ్లు కనీస మరమ్మతులకు నోచుకోలేక గుంతల మయంగా మారింది. మూడేళ్లుగా పట్టించుకోకపోవడంతో చాలా వరకు కొత్తగా రోడ్డు వేయాల్సిన పరిస్థితి ఉంది అని పవన్ కళ్యాణ్ వివరించారు.
నిధులు లేక రోడ్లను గాలికొదిలేసిన ప్రభుత్వం
మరమ్మతులకే నిధులు లేక రోడ్లను గాలికొదిలేసిన ప్రభుత్వం.. కొత్త రోడ్లు వేయడం అంటే ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితులరీత్యా అసాధ్యమే. ఇప్పుడున్న పరిస్థితుల్లో రోడ్లు కనీస మరమ్మతులు, ఒక లేయర్ వేసి కాస్త ప్రయాణానికి తగ్గ విధంగా చేయాలంటే దాదాపు రూ.7 వేల కోట్లు అవసరమని అంచనా. 8 వేల కిమీ రోడ్లు మెయింటినెన్స్ కోసం బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda) నుంచి రూ.2100 కోట్లు అప్పు తెచ్చారు. వాటితో రిపేర్లు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. అయితే ప్రభుత్వం నుంచి బిల్లులు (Pending Bills) రాకపోవడంతో కాంట్రాక్టర్లు (Contractors) పనులు చేయడం లేదు. రోడ్లు నిర్వహణ కోసం అని పెట్రో సెస్ వసూలు చేస్తున్నారు. ఇది రూ.750 కోట్ల మేర ఏటా ప్రభుత్వానికి చేరుతుంది. ఈ నిధులు ఎక్కడికి వెళ్తున్నాయో ఎవరికి తెలియడం లేదు అని జనసేనాని ఆవేదన వ్యక్తం చేశారు.
నేను పాల్గొంటున్నా… మీరూ పాల్గొనండి
అభివృద్ధి అంటే సంక్షేమ పథకాలు అమలు చేస్తే చాలు రోడ్లు అవసరం లేదు అనే ఆలోచన విధానంతో వైసీపీ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. రాష్ట్ర అభివృద్ధికి మౌలిక సదుపాయాలు ఎంత అవసరమో తెలియజేయడం కోసం #GoodMorningCMSir అనే డిజిటల్ క్యాంపెయిన్’ని జనసేన (Janasena) పార్టీ మొదలు పెడుతున్నది అని పవన్ కళ్యాణ్ వివరించారు.
మీ ఊళ్ళో, మీ చుట్టు పక్కల రోడ్లు ఎంత దారుణంగా దెబ్బ తిన్నాయో.. ఆ రోడ్డు మీద వెళ్లేందుకు ఎంత ప్రయాస పడాల్సి వస్తోంది అనేది చెప్పే ఫోటోలు, వీడియోలు తీయండి. వాటిని #GoodMorningCMSir హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి. ప్రభుత్వ వైఫల్యాలను (Failures of Goverment) తెలియజేయండి. ఈ డిజిటల్ క్యాంపెయిన్’లో నేను కూడా పాల్గొంటాను. మీరు కూడా పాల్గొని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని జనసేనాని (Janasenani) పవన్ కళ్యాణ్ ప్రజలకు పిలుపు నిచ్చారు.