Shanthi prasad singaluriShanthi prasad singaluri

కాపు (Kapu) కుల పెద్దలము (Kula Peddalu) అంటూ కోందరు వ్యక్తులు ఈ మథ్యన బయలుదేరారు. రాజకీయంగా విపరీతమైన హడావిడి కూడా చేస్తున్నారు. ఏమిటయ్యా అసలు విషయం అంటే, తమను ఒక రాజకీయ పార్టీ (Political) గుర్తించటం లేదు అంటున్నారు. తమ పార్టీలోకి రెడ్ కార్పెట్ (Red Carpet) వేసి వీరిని ఆహ్వానం పంపటం లేదు, కాబట్టి మేమంతా కలసి, బహూళ జనులను కలుపుకోని ఒక రాజకీయ పార్టీ (Political Party) పెడతాము అంటూ విపరీతమైన ప్రచారం చేస్తున్నారు. ప్రచారం కోసం పచ్చ (Pacha Media), నీలి మీడియాలకు (Neeli Media) వార్తలు అనే మెత కూడా వేస్తున్నారు. ఆయా మీడియాలతో పాటు, పలు ఇతర మీడియా కూడా దీనిపైన చర్చాకార్యక్రమం పెట్టేలా చేస్తున్నారు.

ఇక్కడే ఒక విచిత్రం కూడా ఉన్నది. అదేమిటంటే కోందరు సదరు నాయకులకు అ పార్టీ ఘనంగా ఆహ్వానించినది. పోటీ చేయమని కోందరినీ, పార్టీ కార్యకలాపాలు చేయమని మరి కోందరిని అడిగింది. అయితే 2019 ఎన్నికలు ఫలితాలు వచ్చిన తరువాత సదరు వ్యక్తులు పార్టీ నుంచి వెళ్ళిపోయినా విషయం తెలిసిందే. వారిలో కొందరు స్తబ్దతతో కోందరు ఉన్నారు. వీరికి మరలా ఆహ్వానించి ఘనమైన స్థానంలో పెట్టలేదని అలుక వహించారు. మరి కోందరికి సదరు పార్టీ అథినేత తన పార్టీ లోకి చేర్చుకోవటానికి ససేమిరా అంటున్నారు. అయినా సరే, ఏలాగైనా ఈ పార్టీ లోకి వచ్చి, పార్టీ పగ్గాలు చేపట్టాలని చూస్తున్నారు. భవిష్యత్తులో అథికారంలోకి ఈ పార్టీ వస్తే తాము మాత్రమే పదవులు పోందాలనే యావతో ఉన్నారు.

వీరిని ఎందుకు పార్టీలోకి ఆహ్వానించాలి?

అసలు వీరందరిని ఏందుకు అ పార్టీ అథినేత రెడ్ కార్పెట్ వేసి మరీ పార్టీలోకి ఆహ్వానించాలో అనేదానిపై ఒక్క కారణం కూడా చెప్పరు. తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఏన్నో పార్టీలు మార్చిన ఘనులు వీరిలో కోందరు ఉన్నారు. వీరు ఎక్కడ పచ్చగా ఉంటే అక్కడ వాలతారు. పచ్చదనం లేకపోతే ఎగిరిపోతారు. అవసరమా ఇటువంటి దిక్కుమాలిన పెద్దలు పార్టీ కి? మరి కోందరు ఉన్నత అథికార పదవులు అనుభవించి, చక్కగా సంపాదించి, పదవీ విరమణ తరువాత రాజకీయ పదవులు కోసం, తమ రిటైర్మెంట్ (Retirement) జీవితం గడిపి, తమ ప్రాబల్యం పెంచుకోవాలి అని అనుకుంటూన్నారు.

వీరిలో స్వయం ప్రకాశం కలిగిన నాయకులు ఏవరూ లేరు. వీరంతా వాస్తవానికి పరాన్నజీవులు మాత్రమే. అంటే పార్టీ అథినేత ఇమేజ్’ని అడ్డం పెట్టుకోని, అయన భుజాల పైన ఎదగాలి అనే స్వీయ, స్వార్థ యావతో ఉన్నవారే తప్పితే తమ వంతుగా సమాజంకి సేవ చేయాలనే సత్సంకల్పంతో నిజాయితీగా వచ్చేవారు ఏవరూ లేరు.

పాతికేళ్ల భవిష్యత్తు వదులుకొని పార్టీ పెడితే?

దురదృష్టవశాత్తూ వీరంతా ఒక వర్గంకి చెందిన వ్యక్తులు మరియు అనుకోకుండా సదరు పార్టీ అథినేత కూడా మా వర్గం వాడు అనుకుంటూ, తమకు అగ్రస్థానం ఇవ్వాలనే యావతో ఉన్నట్లున్నారు. వారు సౌకర్యంగా మరచిన విషయం ఏమిటంటే సదరు పార్టీ అథినేత కులబలం చూసి రాజకీయ పార్టీ పెట్టలేదు. బహుళ జనుల వేతలు, భాథలు, సమస్యలు పరిష్కారం కోసం మాత్రమే పార్టీ ఏర్పాటు చేయటం జరిగింది, తన పాతికేళ్ల ఉజ్వల భవిష్యత్తు వదులుకోని మరీ పార్టీ వచ్చింది అనే విషయాన్నీ మరిచిపోతున్నారు.

కాబట్టి అయనను ఒక కులానికి కట్టేయాలనే ఈ వ్యక్తులు ప్రయత్నం చేస్తున్నట్లు అనిపిస్తున్నది. వారు బేషరుతుగా పార్టీ లోకి వచ్చి, సాథారణ కార్యకర్తలు మాదిరిగా పార్టీ అభివృద్ధి కోసం కృషి చేసి, పోటీ చేయగల నాయకుడుగా అర్హత సంపాదిస్తే ఏవరికైనా అభ్యంతరం ఉండదు. కానీ ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు అశించి మాత్రమే పార్టీ లోకి వచ్చి పదవులు అశతో వస్తామంటే, దానిని ఏంత మాత్రం అథినేత అవకాశం ఇవ్వరు అనే విషయం వీరు గ్రహించాలి.

పార్టీ నిర్మాణం (Party Structure) చరిత్ర చుడండి

ఒక్కసారి చరిత్ర చూడండి. నాయకుడు అనేవాడు ప్రజల కోసం, ప్రజల నుంచి వచ్చినవారే బలంగా అ పార్టీ ఎదుగుదల కోసం పాటుపడాలి. పార్టీ కష్టనష్టాల సమయంలో కూడా పార్టీకి అండగా నిలబడినప్పుడే సదరు పార్టీ చిరస్థాయిగా నిలబడుతుంది. ఉదాహరణకు నందమూరి తారక రామారావు పార్టీ పెట్టినప్పుడు పార్టీ నిర్మాణం జరగలేదు. పెద్ద పెద్ద నాయకులు కూడా అప్పుడు లేరు. దాదాపుగా 98% మంది కోత్త వారు, అప్పటి వరకు రాజకీయాలు తెలియనివారే. ఇన్నాళ్ళు తరువాత పెద్ద నాయకులుగా ఎదిగారు.

అలాగే కేసిఅర్ పార్టీ (KCR Party) నిర్మాణం కూడా అథికారంలోకి వచ్చిన తరువాత మాత్రమే జరిగింది. కేసిఅర్ బొమ్మ, రాష్ట్ర ఆకాంక్షతో గెలుపు సాథించారు. అలాగే ఢిల్లీలో (Delhi) కెజ్రీవాల్ (Kejriwal) కూడా పూర్తి స్థాయిలో పార్టీ నిర్మాణం లేకుండానే, భావజాల బలంతో అథికారం చేపట్టాక, నాయకులుగా ఎమ్మెల్యేలు నిలబడ్డారు. అలాగే గతంలో చూస్తే అస్సాంలో విద్యార్థి ఉద్యమ నాయకుడు ప్రఫుల్లా మహంతి (Prafulla Mhanthi) అథ్వర్యంలో అస్సాం గణ పరిషత్, జయలలిత (Jayalalitha) అథ్వర్యంలో అన్నాడిఎంకే (AIDMK) తన వెనుక నిలబడకపోయినా, ఓంటరి పోరాటంతో నెగ్గటం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉదాహరణలు చరిత్రలో ఉన్నాయి.

ప్రాంతీయ పార్టీల పుట్టుక, ఎదుగుదల…

ప్రాంతీయ పార్టీల (Regional Parties) పుట్టుక, ఎదుగుదల అనేది పార్టీని నడిపే అథినేత బలం, భావజాలం, ఇమేజ్ పైన మాత్రమే ఉంటుంది. కాకపోతే ఇక్కడ కావాల్సింది రాష్ట్రవ్యాప్తంగా పనిచేయగలిగిన క్యాడరు మాత్రమే. ఇప్పటికే ఎనిమిది జిల్లాలలో మండల స్థాయిలో అథ్యక్షులు ప్రకటన వచ్చింది. మిగిలిన ఐదు జిల్లాల మండల అథ్యక్షులు ప్రకటన అనంతరం, మండలస్థాయి యంత్రాంగం పూర్తిగా ఏర్పాటు చేయటం జరుగుతుంది. ఇక మిగిలింది గ్రామ, వార్డు స్థాయి కమిటీల ఏర్పాటు అనేది మరోక అరు నెలల సమయంలో పూర్తిగా ఏర్పాటు చేయటం జరుగుతుంది. అంటే పూర్తి స్థాయిలో పార్టీ నిర్మాణం జరిగినట్లే భావించాలి.

అథినేత రాష్ట్రవ్యాప్తంగా పర్యటన?

ఇక అథినేత రాష్ట్రవ్యాప్తంగా పర్యటనతో సదరు స్థానిక నాయకత్వం ప్రజల దృష్టిలో పడటం, తద్వారా వారి గుర్తింపు, తదనంతరం వారు చేసే సేవ ద్వారా నాయకులుగా గుర్తించటం జరుగుతుంది. అంటే ఎక్కడికక్కడ స్థానిక ప్రజల అదరణ, గుర్తింపు ద్వారా నాయకులుగా ఎదిగి, పార్టీకి అండగా నిలబడతారు.

కాబట్టి పార్టీ అథినేత ఇమేజ్, భావజాల బలం, అతనికున్న నిజాయితీ, నిబద్ధత మరియు స్థానిక నాయకత్వం అదరణ, బలంతో ఎన్నికలలో పోటీకి వెళ్ళటం జరుగుతుంది తప్పితే, ఇతర రాజకీయ పార్టీల మాదిరిగా చివరి క్షణంలో పార్టీలోకి వచ్చేవారి వలన పార్టీ నిలబడదు.

కాబట్టి జనసైనికులు (Janasainiks) నేడు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ఏమాత్రం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీ మీ మండల, గ్రామీణ, పట్టణ పార్టీ నాయకత్వంతో మమైకమై పార్టీ సిథ్థాంతాలు ప్రజలలోకి తీసుకోని వెళ్ళండి. మిగిలిన కార్యక్రమం అథినేత చూసుకుంటాడు. 2024 లో జరగబోయే ఎన్నికల్లో జనసేనదే (Janasena) విజయం. జనసేనానికి (Janasenani) ఉన్న వ్యూహ చతురతతో ఇది జరిగితీరుతుంది అని ఖచ్చితంగా చెప్పగలను.

— Shanti Prasad Singaluri, న్యాయవాది, జనసేన లీగల్

జిల్లా ఎస్పీ చేతుల మీదగా నగదు పురస్కారం, ప్రశంసా పత్రాలు

Spread the love
One thought on “కుల నాయకుల విష ప్రచారాన్ని తిప్పికొట్టండి: శాంతి సందేశం”

Comments are closed.