మత్తు వదిలి రాజ్యాధికారం కోసం పోరాడ గలరా?
సంఘాలను అన్నిటిని తోరణం కట్టాలి – తోరం రాజా
వీరి సంకల్పహాన్ని కుల సంఘాలు ఒప్పుకొంటాయా?
కులసంఘాల ముందున్న కింకర్త్వం ఏమిటి?
ఒకప్పుడు నూటొక్క రాజ్యాలను ఏలిన కాపులు (Kapulu) నేడు నూటొక్క కులసంఘాలుగా విడిపోయారు. శతాబ్దాలపాటు గ్రామా గ్రామాన బొబ్బిలి బ్రహ్మన్న (Bobbili Brahmanna) పాత్ర పోషించిన కాపులు (Kapu) నేడు బిక్ష పాత్ర పట్టుకొని కాపు నేస్తాల (Kapu Nestham) కోసం ఎందుకు పరుగెట్టాలిసి వస్తున్నది. గత చరిత్ర మరిచిన కాపులు, పాలకుల పాదాల వద్ద ఎందుకు జీ హుజూర్ అనాల్సి వస్తున్నది.
దీనికి కారణం కాపుల్లో ఐక్యత (Unity in Kapus) లేకపోవడం. పాలకులకు చేసే పాదపూజకు అలవాటు పడ్డ కొన్ని కాపు సంఘాలేనా (Kapu Sangam)? వీరు సాటి అణగారిన వర్గాల (Anagarina Vargalu) సహకారం విలువ తెలుసుకోలేకపోతున్నారునా? కొన్ని కుల సంఘాలు కాపుల్లోని చైతన్యాన్ని పాలకులకు అమ్మేసి కొంటున్నారా? కుల పెద్దలకు (Kula Peddalu) ఉన్న కమ్మని ద్వేషం (Kammani Dwesham), దొడ్లపై (Reddy) ఉన్న ప్రేమ వల్లనే కాపులు నేటికి కాపు నేస్తాలు కోసం, కాలం చెల్లిన రిజర్వేషన్లు కోసం పాకులాడుతున్నారు. కానీ రాజ్యాధికారం (Rajyadhikaram) కోసం ప్రయత్నం చేయడం లేదు అని కాపు యువత భావిస్తున్నది.
కాపుపెద్దలు చేయలేని పని ఒక సామాన్యుడు చేయగలడా?
నూటొక్క కులసంఘాలను ఏకీకృతం చెయ్యాలి. జీహుజూర్ అనేవారిలో అణచివేతలపై తిరిగబడేలా ఆలోచనలు కల్గించాలి. దీనికి ముద్రగడ లాంటి వారు ముందుకు రావాల్సి ఉంది. వచ్చి కాపు సంఘాలను ఏకీకృతం చేయడానికి పూనుకోవాలి అని కాపుయువత (Kapu Yuvatha) భావిస్తున్నది. కారణాలు ఏమైనప్పటికి ముద్రగడ (mudragada) లాంటి కాపు పెద్దలు ముందుకు రావడం లేదు. ఏకీకృతం అనే బృహత్ కార్యక్రమం జరగడం లేదు.
అయితే తోరం రాజా అనే ఒక సాధారణ వ్యక్తి నేడు ముందుకు వచ్చాడు. నడుం బిగించాడు. నూటొక్క కులసంఘాలు ఒక్కటి అవ్వాలి అని ఒక సమావేశం ఏర్పాటు చేస్తున్నాడు. విజయవాడలో (Vijayawada0 ఉన్న తుమ్మలపల్లి కళాక్షేత్రంలో (Tumallapalli kalakshetram) ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఒక సాధారణ వ్యక్తి ఒక మంచి పనిని చేయగలుతున్నాడు. ప్రతీ కాపు పెద్ద, కాపు నాయకుడు, కాపు కులసంఘం (Kapu Kula Sangham) మనం ఎందుకు చేయలేకపోయాము అనే ప్రశ్నని వేసి కోవాలి. కారణం తెలుసికోగలిగితే సిగ్గుపడాలి. పౌరుషం ఉంటే ఎప్పటికైనా ముందుకు వచ్చి ఏకీకృతం కావలి అనే కార్యాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి అని కాపు యువత తపిస్తున్నది.
తోరం రాజా వల్ల సాధ్యమేనా?
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కాపు సంఘాలను కలపాలి అనే ఆలోచన తోరం రాజాలో రావడమే గొప్ప విషయం. దీనికి తోరం రాజాని అభినందించాలి. ఇక అది విజయం సాధిస్తుందా లేదా అనేది తోటి నూటొక్క కులసంఘాల సహకారంపై ఆధారపడి ఉంటుంది. అహంకారంతో జాతిని నాశనం చేస్తున్న కొన్ని కులసంఘాల్లో, కుల నాయకుల్లో అంత త్వరగా మార్పు రాకపోవచ్చు. కానీ మార్పు వచ్చేవరకు ఈ ప్రయత్నాలను కొనసాగించాలి. ముద్రగడ (Mudragada) లాంటి కుల పెద్దలు కూడా ముందుకు రావాలి. పల్లకీల మోత కోసం కాకుండా కుల సంఘాల ఏకీకృతం కోసం పాటుపడాలి. కుల సంఘాల ఐక్యత కోసం అవసరం అయితే పోరాటాలు మొదలు పెట్టాలి.
ఏకీకృత కాపు కులసంఘం దేని కోసం?
- కాపు, తెలగ, బలిజ, ఒంటరులను బిక్షగాళ్లుగా మాత్రమే చేసే కాపు నేస్తాల (Kapu Nestham) కోసం కాదు. ఇది కాపులకు అధికారాన్ని అందించడం కోసం.
- ఇది కాలం చెల్లిన రిజర్వేషన్లు (Reservations) కోసం కాకుండా రాజ్యాధికారం కోసం మాత్రమే పోరాడడం కోసం
- ఇది పాలకులు వేసే బిస్కట్ల కోసం తోటి కులాలతో గొడవలు పెట్టుకోవం మానేసి… సహచర కులాలతో, సంఘాలతో సోదర భావంతో మెలగడం కోసం.
- ఇది కాపు కుల కార్పొరేషన్లో జరుగుతున్న మోసాలను బయటపెట్టి, యువతలో చైతన్యం తీసికొని రావడం కోసం.
- ఒక దళిత సోదరుడికి, ఒక బీసీ సోదరుడికి, ఒక కాపు సోదరుడికి అధికారం కట్టబెట్టడం కోసం
ఏకీకృత కాపు కులసంఘం విధి విధానాలు ఎలా ఉండాలి?
- ఒక్కటే కులసంఘం ఉండాలి. దీనిలో నూటొక్క కులసంఘానికి భాగస్వామ్యం ఉండాలి.
- మరో రిజర్వేషన్ ఉద్యమం అనేవారికి నచ్చ చెప్పి, రాజ్యాధికారంకోసం మాత్రమే పోరాటం చేసేలా చెయ్యాలి.
- ఏకీకృత సంఘంలో బలిజలకు ప్రధాన పాత్ర ఉండేటట్లు చేయాలి.
- కుల సంఘాల నాయకులూ ఏ రాజాకీయ పార్టీకి మద్దతు ప్రకటించరాదు.
- కుల సంఘం నాయకుడు ఎవ్వరు కూడా ఒంటరిగా రాజకీయ పార్టీలను కలువరాదు. ప్రకటనలు చేయరాదు.
- కలవాలిసి వస్తే, ఏకీకృతం కులసంఘం కమిటీ మొత్తంగా మాత్రమే రాజకీయ పార్టీలను కలవాలి తప్ప, ఒంటరిగా కాదు.
- కులసంఘాల్లో ఉన్న నాయకులూ రాజకీయా పార్టీలకు మద్దతు నివ్వాలి అని కోరుకొంటే కులసంఘంలో ఉన్న పదవికి రాజీనామా చేయాలి.
- రాజ్యాధికారం కోసం కాకుండా, వేరే దానికోసం ప్రయత్నం చేసే కుల నాయకులను తప్పనిసరి అయితే బహిష్కరించాలి.
- అణగారిన వర్గాలతో అధికారాన్ని పంచుకోవడం కోసం అను నిత్యం పనిచేయాలి.
- పల్లకీలు ఎక్కడం కోసమే గాని పల్లకీలు మోయడం (Pallakeela Motha) కోసం కాదు అనే ఏక సూత్ర విధానంతో పనిచేయాలి.
ఏకీకృత కులసంఘాల ఐక్యత కోసం ప్రయత్నం చేసే ప్రతీ ఒక్కరికీ మా Akshara Satyam మద్దతు ఉంటుంది. అలానే మార్పు కోసం కాకుండా తన ఐడెంటిటీ కోసం ప్రయత్నాలు మొదలు పెడితే అటువంటి కుల సంఘాన్ని ఎండగట్టంలో మేము ముందే ఉంటాం. చివరకు ఏకీకృత కులసంఘం తప్పు చేసినా ఎండగట్టంలో మా Akshara Satyam వెనకాడబోదు. ఆలోచించండి
అద్భుత:
ఆశయ సాధనలో భాగం (భాగ్యం) కల్పించినందుకు ధన్యవాదాలు.
మీ… మారిశెట్టి చంద్రశేఖర్.
ప్రకాశం జిల్లా.