సమస్యలపై ప్రజాప్రతినిధులు చోద్యం చూస్తున్నారు
తుని మున్సిపాలిటీయో.. పంచాయితీయో అర్ధం కావడం లేదు
క్రియాశీలక సభ్యత్వమే ప్రతి కార్యకర్తకు – భద్రత, భరోసా
క్రియాశ్రీలక సభ్యుడి కుటుంబానికి ఆర్ధిక సాయం
తుని కార్యకర్తల సమావేశంలో నాదెండ్ల మనోహర్
తుని (Tuni) పట్టణంలో సమస్యలు (Issues) తాండవం చేస్తుంటే, ప్రజాప్రతినిధులు (Peoples representatives) చోద్యం చూస్తున్నారని జనసేన (Janasena) నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) ఆరోపించారు. తుని పట్టణం ప్రజలకు ఇది మున్సిపాలిటీయో (Municipality) పంచాయతీయో (Panchayat) కూడా అర్ధం కాని పరిస్థితి నెలకొందని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు.
పట్టణంలో సమస్యలు తిష్ట వేస్తే ప్రజా ప్రతినిధులు చోద్యం చూస్తున్నారు. కనీసం డంపింగ్ యార్డు (Dumping Yard) సమస్యకు ఏళ్ల తరబడి ఈ నాయకులు పరిష్కారం చూపలేకపోయారని నాదెండ్ల మనోహర్ దుయ్యబట్టారు. అడుగడుగునా రోడ్లు, మురుగు కాల్వల సమస్యలు ఉన్నా పట్టించుకునే నాథుడు తునిలో కరవయ్యాడన్నారు.
తుని పట్టణం, 20వ వార్డు ఇసుకలపేటకు చెందిన జనసేన పార్టీ (Janasena Party) క్రియాశీలక సభ్యుడు వాసంశెట్టి రాజు ఇటీవల సముద్ర స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందారు. బుధవారం రాజు తల్లిదండ్రులు శ్రీమతి అప్పలనరస, లచ్చన్నలను నాదెండ్ల మనోహర్ పరామర్శించారు. పార్టీ కోసం అహర్నిశలు పని చేసే కార్యకర్త అకాల మరణం చెంది దూరం కావడం పట్ల విచారం వ్యక్తం చేశారు.
ఆ కుటుంబాన్ని ఓదార్చి పార్టీ క్రియాశీల సభ్యులకు ఇచ్చే రూ. 5 లక్షల బీమా చెక్కును (Insurance) రాజు తల్లికి జనసేన పార్టీ తరుపున నాదెండ్ల మనోహర్ అందచేశారు. ఎలాంటి సమస్య వచ్చినా పార్టీ తరఫున ఆదుకుంటామని మనోహర్ భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ… పార్టీతో ప్రయాణం చేసే ప్రతి కార్యకర్తకు భద్రత – భరోసా కల్పించేందుకే పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) క్రియాశీలక సభ్యత్వాన్ని తీసుకువచ్చారు. దురదృష్టవశాత్తు మృతి చెందిన క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు ఆర్ధిక సాయంతో పాటు వారి బిడ్డల భవిష్యత్తుకు అండగా నిలిచే విధంగా కార్యచరణ రూపొందించారు.
అంకితభావంతో సమాజం, ప్రజలకు ఉపయోగపడే ఏకైక పార్టీ జనసేన” అని నాదెండ్ల మనోహర్ అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పీఏసీ సభ్యులు పంతం నానాజీ, పార్టీ నాయకులు శెట్టిబత్తుల రాజబాబు, బండారు శ్రీనివాస్, గెడ్డం బుజ్జి, బోడపాటి శివదత్, సంగిసెట్టి అశోక్, వాసిరెడ్డి శివప్రసాద్, చొడిసెట్టి గణేష్ తదితరులు పాల్గొన్నారు.